E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కుటుంబంతో సొంతూరికి వెళ్లిన రాజేంద్ర.. కన్నతల్లి సమాధి వద్ద అక్షయ్ ఎమోషనల్.. భానుమతి కన్నీళ్లు..

Intinti Ramayanam Today Episode: కుటుంబంతో సొంతూరికి వెళ్లిన రాజేంద్ర.. కన్నతల్లి సమాధి వద్ద అక్షయ్ ఎమోషనల్.. భానుమతి కన్నీళ్లు..
Advertisement

Intinti Ramayanam Today Episode December 21st: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ తన అత్తగారి బట్టలను ఐరన్ చేస్తానని చెప్తాడు. మీరు మా అమ్మ బట్టలు ఐరన్ చేస్తే బాగోదేమో అని అంటుంది అవని. కానీ అక్షయ్ మాత్రం అత్తయ్య అమ్మతో సమానం ఏం కాదు నేను ఆమె బట్టలు ఐరన్ చేస్తాను నువ్వు వెళ్లి ఐరన్ బాక్స్ తీసుకురా అని అంటాడు. అవని ఐరన్ బాక్స్ కి వెళ్ళగానే అక్షయ్ కి మీనాక్షి బ్యాగులోని ఒక ఫోటో కనిపిస్తుంది.. ఆ ఫోటో చూడగానే అక్షయ్ షాక్ అవుతాడు.. ఏంటి ఈ ఫోటో ఏంటి అని అవని అడుగుతాడు.. అవని ఆ ఫోటో గురించి చెప్పడానికి సంకోచిస్తుంది. ఈ ఫోటో ఏంటి అని అందరూ అక్కడికి వచ్చి అడుగుతారు. కానీ అవని మాత్రం ఆ ఫోటో గురించి అసలు విషయాన్నీ చెప్పకుండా దాస్తుంది.

భానుమతి నా అల్లుడికి నీ తల్లికి ఉన్న సంబంధం ఏంటి ఎందుకు వాళ్ళిద్దరూ కలిసి ఫోటో దిగారు అని అడుగుతుంది. కానీ అవని మాత్రం ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటుంది. శ్రియ మీ అమ్మకు ఆయనకి ఏదో అక్రమ సంబంధం ఉంది అందుకే ఇలా దాచుకున్నారేమో అని అంటుంది. అందరూ తన తల్లిని తప్పుగా అంటున్నారని అవని అనుకుంటుంది. వాళ్లకి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతమవుతుంది.. ఆ కల రాగానే నిద్ర లోంచి లేస్తుంది.. ఇది జరగకుండా ఉండాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ ఇంట్లో ఆస్తి కోసం గొడవలు జరుగుతున్నాయని ఒక నిర్ణయం తీసుకుంటాడు. బయట పరిస్థితి ఎలా ఉంది ఎలాంటి పరిస్థితుల్లో అతని పెరిగాడు అన్న విషయాలని కుటుంబ సభ్యులకు తెలియజేయాలని అనుకుంటాడు. ఇక అందరూ కలిసి గోదావరి జిల్లాకు వెళ్తారు. ఆ ఊరి అందాలను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు.. చాలా అందంగా ఉంది ఈ ఊరు అని అవని అంటుంది.. ఇప్పుడు సిటీలో ఉండి ఉండి ఇలాంటి పచ్చని వాతావరణం లోకి రావడంతో మనసు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.

ఇదేంటమ్మా ఇంకా ముందు చాలా బాగుంటుంది అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఈ ఊరిలో మనుషులు అలాగే పచ్చని చెట్లు కల్మషం లేకుండా ఉంటాయి అని రాజేంద్రప్రసాదంటాడు. తాతయ్య మీ ఊరు చాలా బాగుంది తాతయ్య అని ఆరాధ్య కూడా అంటుంది. అక్షయ్ ను అవని మీ ఊరు చాలా బాగుంది మీరు ఏమనుకుంటున్నారు అని అడుగుతుంది. ఈ ఊర్లోకి అడుగుపెట్టదని నేను నా తల్లి ఒడికి చేరుకుంటున్నానని అనిపిస్తుంది అని అక్షయ్ అంటాడు. ఈ ఊరిలో మా అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి వాటిని భద్రంగా దాచుకుంటాను అని అంటాడు.

Advertisement

ఇదేరా మన ఊరు ఇంక లోపలికి వెళ్తే మన ఊరి ఒకసారి అట్లా వెళ్లి చూద్దాం పదండి అని రాజేందర్ ప్రసాద్ అంటాడు. అందరూ కలిసి ఊరు అందాలని ఆస్వాదిస్తూ ఉంటే పల్లవి శ్రియ మాత్రం ఇక్కడ ఏముందని ఇంతగా ఫీల్ అయిపోతున్నారు. ఈ ఊరు చూస్తుంటేనే ఏదోలా ఉంది ఇక ఇక్కడ ఉండాలంటే భయమేస్తుంది అని పల్లవి తానా అంటే శ్రీయ తందనా అంటుంది. కమల్ మీ ఇద్దరికీ ఈ ఊరు అందాల గురించి అర్థం కావట్లేదు నాకు మాత్రం ఈ స్వచ్ఛమైన గాలి ఈ పచ్చని వాతావరణం చాలా బాగా నచ్చాయి అని అంటాడు.. అనుమతి ఇదేంట్రా ఇంకా ముందుంటుంది అసలు మర్చిపోలేరు అని అంటుంది.

Also Read: మళ్లీ ఇరుక్కున్న మనోజ్.. మౌనిక కోసం బాలు కన్నీళ్లు..లక్ష కోసం ప్రభావతి ప్లాన్..

ఆ ఊరిని చూసినా అక్షయ్ చాలా సంతోషంగా ఉంటాడు. నాన్న అమ్మ సమాధి దగ్గరికి తీసుకెళ్లమని అక్షయ్ అడుగుతాడు.. రాజేంద్రప్రసాద్ అలాగే అనే శ్రీకర్ని అక్కడికి తీసుకెళ్ళమని చెప్తాడు. ఆ సమాధి చూడగానే మీ అమ్మ మన మధ్య కాకుండా మన సంతోషాన్ని చూడాలని అనుకుంటుంది. అందుకే ఇక్కడ దూరంగా ఉండి మన సంతోషాన్ని చూస్తుంది అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అక్షయ్ అవని ఇద్దరు కూడా ఆ సమాధిని క్లీన్ చేసి పూలమాల వేస్తారు. నేను పుట్టకపోతే నువ్వు బ్రతికి దానివి కాదమ్మా నన్ను ఎందుకు అమ్మ వదిలేసి పోయావు అని అక్షయ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తన తల్లి సమాధిని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎవరెంతగా ఓదార్చినా కూడా అక్షయ్ మాత్రం నా తల్లి నా ముందర లేదు అని బాధపడుతూ ఉంటాడు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఆస్తి గురించి పల్లవిశ్రియాలు అడుగుతారు. రాజేంద్రప్రసాద్ ఏం చెప్తాడో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×