E-Paper
Advertisement

Bus Fire: ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సులో మంటలు.. స్పాట్‌లో 29 మంది

Bus Fire: ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సులో మంటలు.. స్పాట్‌లో 29 మంది
Advertisement

Bus Fire: తిరుపతి నుంచి పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్తున్న ఏపీఎస్‌ఆర్‌టీసీ సూపర్ లగ్జరీ బస్సులో గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. నాయుడుపేట మండలం విన్నమాల సమీపంలో రాత్రి 9:30 గంటల సమయంలో బస్సు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా వెనుక భాగం నుంచి దట్టమైన పొగలు రావడం మొదలైంది. ఆ సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక ప్రయాణికుడు అప్రమత్తమై పొగలను గమనించి కేకలు వేయడంతో, డ్రైవర్ వెంటనే స్పందించి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రయాణికులందరూ వేగంగా కిందకు దిగిపోవడంతో పెను ప్రాణాపాయం తప్పింది.

అయితే ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే పొగలు కాస్తా పెద్ద మంటలుగా మారాయి. బ్యాటరీ వైర్లలో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న నాయుడుపేట అగ్నిమాపక సిబ్బంది అధికారి సత్యంబాబు ఆధ్వర్యంలో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు వెనుక భాగం కొంతమేర దగ్ధమైంది. ప్రయాణికుల లగేజీని కూడా సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

సాధారణంగా వేసవి కాలం ప్రారంభంలో లేదా ఇంజిన్ ఓవర్ హీట్ అయినప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అయితే, ఈ బస్సులో వైరింగ్ లోపమే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కనీస భద్రతా ప్రమాణాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు ఉన్నప్పటికీ, మంటలు వేగంగా వ్యాపిస్తే అవి సరిపోవని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి సాంకేతిక లోపాలపై ఎప్పటికప్పుడు మెకానికల్ టీమ్ ఫిట్‌నెస్ సర్టిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందని రవాణా శాఖ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: దారుణం.. కేపీహెచ్‌బీ‌లో భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

Advertisement

అయితే బస్సు ప్రమాదానికి గురవడంతో ప్రయాణికులు రోడ్డుపైనే పడిగాపులు కాశారు. వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి, వినుకొండ వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం మరో ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేశారు. అర్థరాత్రి వేళ ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఆ ప్రయాణికుడు, డ్రైవర్‌ను అందరూ అభినందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×