E-Paper
Advertisement

Rajasthan Police seized: గణతంత్ర దినోత్సవానికి కొద్దిగంటల ముందు.. 10 వేల కిలోల పేలుడు పదార్థాలు సీజ్

Rajasthan Police seized: గణతంత్ర దినోత్సవానికి కొద్దిగంటల ముందు.. 10 వేల కిలోల పేలుడు పదార్థాలు సీజ్
Advertisement

Rajasthan Police seized: గణతంత్ర దినోత్సవానికి కొద్దిగంటల ముందు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు రాజస్థాన్ పోలీసులు. నాగౌర్ జిల్లా హర్సౌర్ గ్రామంలోని ఫామ్‌హౌస్‌లో అర్థరాత్రి సోదాలు చేశారు పోలీసులు. వారికి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు కనిపించడంతో షాకయ్యారు. దాదాపు 10 వేల కిలోల పేలుడు పదార్ధాలు సీజ్ చేశారు. దీనికి సంబంధించి సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.

గణతంత్ర దినోత్సవానికి కొద్దిగంటల ముందు

Advertisement

గణతంత్ర దినోత్సవానికి ముందు భారీ ఉగ్ర కుట్రను రాజస్థాన్ పోలీసులు భగ్నం చేశారు. నాగౌర్ జిల్లా హర్సౌర్ గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్ నుండి దాదాపు 10 వేల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 10 వేల కిలోల పేలుడు పదార్ధాలు, అమ్మోనియం నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి సులేమాన్ ఖాన్ గా గుర్తించారు.

మైనింగ్ కోసం పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు నిందితుడు చెబుతున్నాడు. అయినా గణతంత్ర దినోత్సవానికి ముందు భారీ ఎత్తున నిల్వ చేయడం వెనుక కారణమేంటి? ఏదైనా భారీ కుట్ర ఏదైనా ఉందా? అనే కోణంలో నిందితుడ్ని విచారిస్తున్నారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు నాగౌర్ జిల్లా పోలీసులు సమాచారం అందించారు.

Advertisement

ఉగ్ర కుట్ర భగ్నం..  10 వేల కిలోల పేలుడు పదార్థాలు సీజ్

ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలతో నిందితుడికి ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అనేదానిపై సులేమాన్ ఖాన్‌ను కేంద్ర సంస్థలు ప్రశ్చించే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకు అక్రమ మార్కెట్లో అనేక కోట్ల రూపాయల విలువైనదని పోలీసులు భావిస్తున్నారు.

సులేమాన్‌కు నేర చరిత్ర ఉందని, గతంలో మూడు కేసులు నమోదయ్యాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీటిలో రెండు విచారణలో ఉండగా, ఒక కేసులో నిర్దోషిగా ఉన్నాడు. 1884 పేలుడు పదార్థాల చట్టం, 1908 పేలుడు పదార్థాల చట్టం, భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత విభాగాల కింద కేసు నమోదు చేశారు అధికారులు. ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న నెట్‌వర్క్‌లతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అనేదానిపై కూపీ లాగుతున్నారు.

ALSO READ: వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాకు అత్యున్నత సైనిక గౌరవం!

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×