E-Paper
Advertisement

Illu  Illalu Pillalu Today Episode: శ్రీవల్లి పై ప్రేమకు డౌట్.. నిజం కక్కేసిన శ్రీవల్లి.. రామరాజు ఎమోషనల్..

Illu  Illalu Pillalu Today Episode: శ్రీవల్లి పై ప్రేమకు డౌట్.. నిజం కక్కేసిన శ్రీవల్లి.. రామరాజు ఎమోషనల్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా చెప్పిన మాటని ధీరజ్ ఆలోచిస్తాడు.. ప్రేమ దగ్గరికి వెళ్తాడు.. కాఫీ తాగలేదా ఏంటి అలా ఉన్నావు అని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ ఎవరితో మాట్లాడుతున్నాడు అని అటు ఇటు చూస్తుంది. ధీరజ్ మాత్రం నిన్నే అడుగుతున్నాను. వెర్రీ దాని లాగా ఆ చుట్టుపక్కల చూస్తావ్ ఏంటి కాఫీ తాగలేదా అని అడిగితే సమాధానం చెప్పవేంటి..? నువ్వు ఎందుకు తాగలేదు అని అడిగితే ప్రేమ మనసు బాగోలేదు అని అంటుంది. ప్రేమ ధీరజ్ నుంచి వెళ్ళిపోతుంది.. కానీ ధీరజ్ మాత్రం ఈ పెళ్లి చాలా సంతోషంగా జరగాలని ప్రేమతో అంటాడు. ప్రేమ ఇక చాలా సంతోషంగా ఈ పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతుంది.. పసుపు దంచే కార్యక్రమం అని మొదలు పెడుతున్నారు అక్కడికి రావాలని వేదవతి చెప్పగానే అందరూ అక్కడికి వెళ్తారు. కామాక్షి డబ్బులు డబ్బులు అంటూ మాటకు ఒక మాట అడుగుతూనే ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రామరాజు ఇంట్లో అమూల్య పెళ్లి సందడి మొదలైపోయింది. పసుపు దంచుడు కార్యక్రమంతో పెళ్లి పనులు మొదలు పెట్టేసారు.. వేదవతి పసుపు దంచడానికి రెడీ అవుతుంది. రోకలి బండకి కామాక్షి పసుపు కొమ్ము కడుతూ ఇంట్లో ఒక పెద్ద కూతురు ఉందే.. దానికి ఒక రవ్వల నెక్లెస్ కూడా చేయించాలని లేదా అని అంటుంది. రోకలి బండకు పసుపు కొమ్ము కంటే రవ్వల నెక్లెస్ కావాలా ఏం మాట్లాడుతున్నావే ఎప్పుడు చూసినా నీకు ఇదేం పిచ్చే అని వేదవతి క్లాస్ పీకుతుంది. అప్పుడే అక్కడికి నర్మదా ప్రేమలో వస్తారు. వీళ్ళు ఎలాగో ఆడపడుచుకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కనీసం నువ్వు కూడా ఇవ్వవా అమ్మ అనేసి కామాక్షి ప్రేమ నర్మదలను అవమానించేలా మాట్లాడుతుంది.

Advertisement

శ్రీవల్లి టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. అది చూసిన ప్రేమ అక్కా మనమందరం ఇక్కడే ఉన్నాము బల్లి అక్క ఎక్కడుంది కనిపించలేదు అని అనుకుంటారు వేదవతి అడగడంతో మళ్ళీ ఎక్కడుందని వెతుకుతారు నర్మదాప్రేమ. వల్లి మాత్రం అందరూ సంతోషంగా ఉన్నారు నేను మాత్రం మా నాన్నకు ఏమవుతుందని టెన్షన్ పడిపోతున్నాను అని అనుకుంటుంది. అప్పుడే అక్కడ పిలవడంతో వెళుతుంది వల్లి. పసుపు దంచే కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు.

భద్రావతి పెద్దమ్మ నేను నా కూతుర్ని చూడడానికి ఆ ఇంటికి వెళ్ళొస్తాను అని అంటుంది.. ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్లడానికి వీల్లేదు అక్కడ ఒక గీత ఉంది మీకు కనిపించలేదా అని భద్రవతి అడుగుతుంది.. హరి మీరు గీసుకున్న గీత నాకే సంబంధం లేదు కదా అని ఆమె అంటుంది. నా కూతురా ఇంట్లో ఉంది నా మనవరాలు కూడా ఇంట్లో ఉంది చూసి వస్తాను నువ్వు వస్తానంటే నిన్ను తీసుకొని వెళ్తాను లేదంటే నేనొక్కదాన్నే వెళ్లి వస్తాను అని ఆమె అంటుంది..

Advertisement

ఇకపోతే మంగళ స్నానాల కోసం అన్ని సిద్ధం చేస్తారు. అమూల్యని చూసి రామరాజు ఎమోషనల్ అవుతాడు. నిన్ను చూస్తుంటే నాకు ఆనందం పట్టలేకపోతున్నాను అని రామరాజు అంటాడు.. ప్రేమ బుగ్గకి పసుపు అంటుకునిందని ధీరజ్ కడ్చిప్ ఇస్తాడు. ఏంటి ఇక చెప్పు తీసుకొని నీ మొహాన్ని తొడవాలా అని ప్రేమ అడుగుతుంది.. నీకే పసుపట్టుకునింది ఒకసారి చూసుకో అనేసి ధీరజ్ అంటాడు.. ఆ మాట వినదని ప్రేమ షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వేనా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నేను నమ్మలేకపోతున్నాను ఒకసారి నన్ను గిల్లు అని అంటుంది ప్రేమ. ఇక ప్రేమ కెవ్వు మనడంతో భాగ్యం శ్రీవల్లి అది చూసి మీ ఆయన కూడా ఇలా గిల్లమని చెప్పొచ్చు కదా అని భాగ్యం అనగానే ఇప్పుడున్న టెన్షన్లో నాకు అదొక్కటే తక్కువ అని అంటుంది..

ఇక అప్పుడే అక్కడికి వచ్చిన చందు చిన్నప్పటినుంచి మీ అమ్మని అంటుకుని ఉన్నావు కదా.. ఇప్పుడు కూడా నువ్వు మీ అమ్మని వండి పెట్టుకుని ఉండాలా రా అక్కడికి వెళ్దామని అంటాడు.. శ్రీవల్లి సిగ్గుపడుతున్నట్టు నటించకపోతే నా మీద అనుమానం వస్తుంది అని అనుకుంటుంది.. అమూల్య మంగళ స్నానాలని అన్నదమ్ములు వదినలు చాలా సంతోషంగా పూర్తి చేస్తారు.. మొత్తానికి మంగళ స్నానాలను పూర్తి చేసి అందరూ పెళ్లికూతురుని చేయాలని అనుకుంటారు.. నర్మదా ప్రేమ అమూల్యను రెడీ చేస్తూ ఉంటే ప్రతి నర్మదా అక్కడ కూడా పోట్లాడుకుంటారు.

ఇక అమూల్యను రెడీ చేయడానికి అంత సిద్ధం చేస్తారు.. అమూల్యని రెడీ చేస్తూ ఉండగా వేదవతి వాళ్ళ పెద్దమ్మ వస్తుంది. బాగుందే మీ సరసాలు అని ఆమె అనగానే వాళ్ళందరూ కలిసి ఎవరో అని వెనక్కి తిరిగి చూస్తారు. ఇక్కడ ఆమెను చూసి షాక్ అయిన వేదవతి పెద్దమ్మ నువ్వు వచ్చావా అని ఆశ్చర్యపోయి అడుగుతుంది.. ఆ ఇంట్లో ఏం జరుగుతున్నాయో నాకు తెలుసు అందుకే కొన్ని లెక్కలు తేల్చడానికే నేను వచ్చాను అని అనగానే నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మ అని వేదవతి అంటుంది. అమూల్యని ఆశీర్వదిస్తుంది.. ప్రేమ నర్మదలు కూడా ఆశీర్వాదం తీసుకుంటారు.. ఈ పెళ్లి బాగా జరుగుతుంది నువ్వేమీ భయపడకు కంగారు పడకు అని వేదవతికి చెప్పి వాళ్ళ పెద్దమ్మక్క నుంచి వెళ్ళిపోతుంది..

రామరాజు చాలా సంతోషంగా మందు తాగుతూ ఉంటాడు.. అది చూసిన తిరుపతి అటుగా వెళుతుంటే రామరాజు రారా నీకు కూడా ఇది తీసుకో అనేసి అంటాడు.. నువ్వు నాకు మందు పోసి ఇచ్చావా అని ఇద్దరు మాట్లాడుకుంటూ సంతోషంగా మందు తాగుతారు.. అప్పుడే అక్కడికి వచ్చిన వేదవతి పెళ్లి జరగబోతుంటే ఈ మందు దుకాణం ఏంటండీ అని అడుగుతుంది. పెళ్లి జరుగుతుందని నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ సంతోషాన్ని ఆపడానికి వీల్లేదు అని రామరాజు అంటాడు.. నాకు చెప్పలేని సంతోషాన్ని ఇచ్చింది దీన్ని ఎవరు ఆపలేరు అని రామరాజు అంటాడు..

తిరుపతి పిల్లలందరూ వచ్చారు నువ్వు మందు తాగుతుంటే చూస్తున్నారు అని అంటాడు.. వాళ్ళ నాన్న ఇంత సంతోషంగా ఎప్పుడు చూసి ఉండరు. నేను ఇంత సంతోషంగా ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా లేదు కదా అని అందరినీ అడుగుతాడు. రామరాజుని అంత సంతోషంగా చూసిన ఇంతని వాళ్ళందరూ కూడా మురిసిపోతారు.. అమూల్య నీ దగ్గరకు వచ్చి పెట్టుకొని రామరాజు ఎమోషనల్ అవుతాడు.. నన్ను అనాధాని ఎందుకు పనికిరానివాడని ఎన్నో రకాలుగా ఎంతోమంది అన్నారు.. రేపు నీ పెళ్లితో అందరి నోరు మూసుకుపోతాయని కన్నీళ్లు పెట్టుకుంటాడు రామరాజు..

Also Read : పల్లవికి షాకిచ్చిన అవని.. రాజేంద్రకు నిజం తెలుస్తుందా..? పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

బుజ్జమ్మ ప్రేమ దక్కించుకున్న రోజు నేను ఎంత ఆనందంగా ఉన్నాను. ఈరోజు అమూల్య పెళ్లి వల్ల నేను అంతే ఆనందంగా ఉన్నాను అని అంటాడు. ఇప్పుడు నేను చచ్చిపోయిన పర్వాలేదు అని రామరాజు అనగానే అందరూ షాక్ అవుతారు. ఇన్నాళ్లు నేను దేవుని ప్రార్థిస్తూ ఎప్పుడు సంతోషాన్ని ఇస్తావని అడిగాను. నీ రూపంలో నాకు ఆ సంతోషాన్ని ఇచ్చాడు అని రామరాజు ఎమోషనల్ అవుతాడు. కన్న తండ్రిని అలా చూసి మిగిలిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు.. ఇక సంగీత్ ఫంక్షన్ ని గ్రాండ్ గా మొదలుపెడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×