E-Paper
Advertisement

Podarillu Today Episode : తండ్రిని గుర్తుచేసుకున్న మహా.. మహా తిండిని చూసి చక్రీ.. గాయత్రికి తాయారు వార్నింగ్..

Podarillu Today Episode : తండ్రిని గుర్తుచేసుకున్న మహా.. మహా తిండిని చూసి చక్రీ.. గాయత్రికి తాయారు వార్నింగ్..
Advertisement

Podarillu Today Episode January 30th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆది మహా పై సీరియస్ అవుతాడు.. ఏంటి నువ్వు నాన్నతో మాట్లాడాలా ఒకసారి మాట్లాడు ఏమంటాడో చూద్దామని ఆది ఫోన్ చేసి ఇస్తాడు.. ప్రతాప్ నా కూతురే లేదు చచ్చిపోయింది. చచ్చిపోయిన వాళ్ళతో నేనెలా మాట్లాడుతాను ఇంకొకసారి ఇలాంటివి నా దగ్గరికి తీసుకురావద్దు అని ఆదికి చెప్తాడు.. మా నాన్నని ఎలాగైనా చూస్తాను అని మహా మొండిగా ప్రవర్తిస్తుంది.. నువ్వు ఇక్కడే కాదు ఈ ఊర్లోనే ఉండకూడదు వెళ్లిపో అని ఆది మహాను తోసేస్తాడు. పడిపోతున్న మహాని చక్రి పట్టుకుంటాడు.. వీడు కూడా ఇక్కడే ఉన్నాడా? నిన్నేమైనా చేస్తామని వీడు ఇక్కడ నీకోసం కాపలా ఉన్నాడా అని ఆది చక్రిని తిడతాడు.

నాన్న నేను చనిపోయానని అంటున్నాడు నాకు చాలా బాధగా ఉంది అని మహా ఫీల్ అవుతుంది.. ఆ తర్వాత హారిక కు ఫోన్ చేసి అసలు విషయాన్ని కనుక్కుంటుంది. మాధవ్ మాత్రం చక్రి, మహాల రిసెప్షన్ ను గ్రాండ్ గా చేయాలని అనుకుంటారు.. ఊర్లో వాళ్ళందరిని పిలుస్తాడు. పెళ్లికూతురు పెళ్ళికొడుకు బట్టలు కూడా కొనాలని అనుకుంటాడు.. చక్రీ, మహా కు బట్టలు కొనాలని అనుకుంటారు. కన్నా కేశవ ఇద్దరు కలిసి బట్టలు కొనుక్కొని వస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహా ప్రతాప్ కి ఏం కాలేదని తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటుంది. ఇక నాకు ఆకలేస్తుంది అని అడుగుతుంది. తిందాం పదండి అనేసి మాహా అడుగుతుంది.. ఇక అక్కడికి వెళ్లి మహా చెప్పిన ఆర్డర్ విని చెక్రి షాక్ అవుతాడు.. గాయత్రి ఇంట్లో ఏదైనా పని ఉంటే చేద్దామని వచ్చానని అంటుంది. కేశవ మాధవ్ను ఎందుకన్నయ్య నువ్వు ఇలా చేస్తున్నావ్ నీకేం బాధగా అనిపించడం లేదా అని అడుగుతాడు.. నాకేం బాధగా లేదురా రేపు నువ్వు కూడా పెళ్లి చేసుకుని వస్తే నీకు కూడా ఇంతే గ్రాండ్ గా నేను అన్ని ఏర్పాటు చేస్తాను అని మాధవ్ అంటాడు..

ఇక మహా తన తండ్రి గురించి చాలా గొప్పగా చెప్తుంది. అయితే తన తండ్రి తనకోసం చేసిన విషయాలన్నిటిని మరోసారి గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా అంటుంది. మా నాన్న నా నాకోసం చాలా చేశాడు. అది తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని మహా ఎమోషనల్ అవుతుంది. అయితే చక్రి మీ నాన్న అంటే ఏంటి ఇష్టం కదా.. మరి మీ నాన్న మాట ఎందుకు కాదన్నారు అని అనగానే మా నాన్న ఆ ద్రోహిని పెళ్లి చేసుకోమని అన్నాడు. ఇక అక్కడ ఫుడ్ రావడంతో మహా ఒక్కటే అన్నిటిని లాగించేస్తూ ఉంటుంది. రాక్షసులగా తింటున్నాను కదా అని మహా అడుగుతుంది. అదేం లేదు మీకు ఆకలేస్తుంది కదా మీరు తినండి అని చక్రి అంటాడు..

Advertisement

అయితే, గాయత్రి ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక ఆవిడ వచ్చి ఇదిగో బ్లౌజ్ అయిపోయింది అని అంటుంది. ఎవరు వచ్చింది అని తాయారు అడుగుతుంది. ఇక తాయారుకి అనుమానం వచ్చి ఏంటది అని అడుగుతుంది.. ఆ కవర్లో బ్లౌజ్ కనిపించడంతో ఈ బ్లౌజ్ ఎవరిది అని అడుగుతుంది. తాయారు మాత్రం ఎవరిదో చెప్పకపోతే ఖచ్చితంగా నీకు కాళ్లు విరుగుతాయి అని అంటుంది. ఈ బ్లౌజ్ ఎక్కడో చూసినట్టుందే ఎవరిదో నిజం చెప్పు అని తాయారు ఎంతగా అడిగినా సరే గాయత్రి చెప్పదు. తర్వాత నిజం తెలుసుకొని దాన్ని కాల్ చేయాలని అనుకుంటుంది. మొదటిసారి తల్లిని గాయత్రి ఎదిరిస్తుంది..

ఆ బ్లౌజ్ కనుక ఏదైనా అయితే తల్లివని కూడా చూడను అని గాయత్రి బెదిరిస్తుంది. అంతేకాదు దాన్ని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత ఎక్కడికి పోతావే నువ్వు ఎలాగైనా ఇంటికి వస్తావు కదా కాళ్ళు విరగగొడతాను అని అంటుంది తాయారు.. ఇక చక్రి మహా ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ వస్తారు. మహా నిద్రపోయి లేవడంతో లేచారా అని చక్రి అడుగుతాడు. బాగా తిన్నాను కదా అందుకే బాగా నిద్ర పట్టేసింది అని మహా అంటుంది. బాగా తినడం వల్ల కాదు మీ నాన్నకి ఏం కాలేదని తెలుసుకున్నారు కదా అందుకే మీరు బాగా నిద్రపోయారు అని చక్రి అంటాడు.

Also Read :భద్రకు వార్నింగ్ ఇచ్చిన ధీరజ్.. అమూల్య కోసం టెన్షన్.. విశ్వం తాళి కడతాడా..?

మీరు నాకు తోడు లేకపోతే నేను ఏమైపోయానో అని ఆలోచించుకుంటున్నాను అని మహా అంటుంది. చక్రి మీకు ఏదో సాయం చేయాలనిపించింది చేశాను అని అంటాడు. మహా చక్రిని పొగడ్తలతో ముంచేత్తుతుంది. మీలాంటి మంచి మనిషి నాకు దొరకడం చాలా అదృష్టం అని అంటుంది. అది సరే కానీ మీరు ఎవరిని ప్రేమించలేదా అని మహా అడుగుతుంది. నేను ఎవరిని ప్రేమించలేదండి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న షాక్ ఇచ్చాడు అని చక్రి అంటాడు.. మీకు ఇప్పుడు లవ్ స్టోరీలు ఏమీ లేవా అని అడిగితే ఒక అమ్మాయితో మొదలైంది అని అనగానే ఆ అమ్మాయి మీకు కచ్చితంగా దక్కుతుంది అని మహా అంటుంది. ఇక ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. పోలీసులు మహని వివరాలు అడిగి తెలుసుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×