E-Paper
Advertisement

Telangana: క్లైమాక్స్‌లో దానం వ్యవహారం, ఈసారి తాడోపేడో.. స్పీకర్ ముందు విచారణ

Telangana: క్లైమాక్స్‌లో దానం  వ్యవహారం, ఈసారి తాడోపేడో.. స్పీకర్ ముందు విచారణ
Advertisement

Telangana: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్వహించనున్న విచారణ అత్యంత కీలకం కానుంది.

నేడు స్పీకర్ వద్ద విచారణ
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నేడు విచారణ చేపట్టనున్నారు. ఉదయం 10:30 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్‌పై, మధ్యాహ్నం 12:00 గంటలకు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరగనుంది.

Advertisement

ప్రతిపక్షాల డిమాండ్
నిబంధనల ప్రకారం ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి మారడం అనర్హత వేటుకు దారితీస్తుందని బీఆర్ఎస్, బీజేపీ వాదిస్తున్నాయి. ఈ మేరకు ఆధారాలతో కూడిన పిటిషన్లను స్పీకర్‌కు అందజేశారు.

దానం నాగేందర్ వాదన
ఈ నోటీసులపై దానం నాగేందర్ ఇప్పటికే స్పందిస్తూ.. తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేశారు. సాంకేతికంగా తాను పార్టీ మారలేదని ఆయన తన వాదనలో సమర్థించుకుంటున్నారు.

Advertisement

క్రాస్ ఎగ్జామినేషన్
నేటి విచారణలో దానం నాగేందర్ తరపు న్యాయవాదులు ఫిర్యాదుదారులైన పాడి కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఫిర్యాదులోని అంశాలను సవాలు చేస్తూ దానం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

Also Read: తెలంగాణ మున్సిపల్ పోరు.. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు.. ఆశావహుల జోరు

అంతేకాకుండా దానం నాగేందర్ తన కౌంటర్‌కు మరిన్ని వివరాలను జోడించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే పార్టీ మారినట్లు కాదని, చట్టపరమైన నిబంధనల ప్రకారమే తాను వ్యవహరిస్తున్నానని ఆయన వర్గం చెబుతోంది.

రాజకీయ ఉత్కంఠ
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ఈ విచారణను వేగవంతం చేశారు. ఈ విచారణ అనంతరం స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అనర్హత వేటు పడితే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది.

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×