E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ కష్టం పగోడికి రాకూడదు.. మహా మాటతో చక్రీ ఫీల్.. సర్ప్రైజ్ ఇచ్చిన విక్కీ..

Podarillu Today Episode : చక్రీ కష్టం పగోడికి రాకూడదు.. మహా మాటతో చక్రీ ఫీల్.. సర్ప్రైజ్ ఇచ్చిన విక్కీ..
Advertisement

Podarillu Today Episode July 22nd: చక్రి మీరు ఎందుకు నా మీద ప్రేమను పెంచుకుంటున్నారు అని మహాలక్ష్మి అడుగుతుంది. అయితే నేనేం చేశాను అండి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీకోసం నేను ఎంత చేసినా కూడా మీరు ఇలా మాట్లాడతారని నేను అసలు ఊహించలేదు అని చక్రి అంటాడు.. మొత్తానికి మహాలక్ష్మి కానిస్టేబుల్ చెప్పిన నిజం గురించి చక్రికి చెప్పగానే ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి.. నువ్వు నాకోసం అన్ని చేశావు నువ్వు ఒక త్యాగమూర్తివి కానీ ఈ ప్రేమ దోమ లాంటివి నా దగ్గరికి తీసుకురావద్దు అని ఒక్కసారిగా చెప్పేస్తుంది.. ఆ మాట వినగానే చక్రి ఈ షాక్ అవుతాడు..

చక్రీ మాటతో దిమ్మతిరిగే షాక్..

చక్రి మహాలక్ష్మి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇంటికి వస్తారు.. ఎందుకు మీరిద్దరూ ఎలా ఉన్నారు? నువ్వు చెప్పాలనుకున్న మాట మహాలక్ష్మికి చెప్పావా తను ఏమనింది అని నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా లేచి అడుగుతారు.. కానీ చక్రి మాత్రం తనకి ఏం చెప్పలేదు అన్నయ్య ఆ సందర్భం రాలేదు అని ఏదో ఒక అబద్ధం చెప్పేసి వాళ్ళది నమ్మేలా చేస్తాడు.. చక్రి నిజంగానే మహాలక్ష్మికి తన మనసులోని మాట చెప్పలేదా అని అందరూ అనుకుంటారు.. అయితే ఉదయం లేచిన తర్వాత కూడా మహాలక్ష్మి చక్రి ఇద్దరూ ఒకరినొకరు మాట్లాడుకోకుండా చూసుకోకుండా ఉండటం చూసి అందరూ ఒక్కసారిగా ఆలోచనలో పడతారు.. వీళ్ళిద్దరికీ ఏమైంది ఎందుకు ఇలా అన్నారు అని అనుకుంటారు.. ఆ తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు మాధవ్.. అసలు వీళ్ళిద్దరికీ ఏమైందో అర్థం కావడం లేదు అని మిగిలిన వాళ్ళందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు..

చక్రీ కి మహా షాక్..

Advertisement

వదిన నువ్వు స్కూటీ నేర్చుకున్నావా..? ఇక ఆఫీస్ కి స్కూటీ లోన వెళ్లొచ్చు కదా అని కన్నా మహనీ అడుగుతాడు.. స్కూటీ నేర్చుకున్న సరే రా కానీ లైసెన్స్ రాలేదు కదా.. అది వచ్చేంతవరకు వెయిట్ చేయాలి అని మహాలక్ష్మి అంటుంది.. అయితే మాధవ్ చక్రి డ్రైవింగ్ లైసెన్స్ గురించి చూసుకుంటానని చెప్పాడు కదా మా వాడు చేస్తాడులే అని అంటాడు.. ఆ మాట వినగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. నాకు ఫ్రాడ్ చేసి మోసం చేసి ఇప్పించడం వద్దు పెట్టి అని అంటుంది.. అయ్యో వాడు అలా ఏం చేయడం మా వాడికి డ్రైవింగ్ గురించి లైసెన్స్ గురించి బాగా తెలుసు అని అంటాడు.. ఇక మహాలక్ష్మి ని వెతుక్కుంటూ వెళ్లిన చక్రీకి మహాలక్ష్మి దిమ్మ తిరిగిపోయిన షాకిస్తుంది.. మీరు ఎంత ఫ్రాడ్ అన్న సంగతి ఇంట్లో వాళ్లకు చెప్తే బాధపడతారని మీ గురించి ఏమీ చెప్పలేదు.. మీరు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి అని మహా ఎంత చెప్తున్నా సరే చక్రి మాత్రం లైసెన్స్ కోసం నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని అంటాడు..

చక్రిని కొట్టిన మహా..

పోస్ట్ మాన్ వచ్చి పోస్టు అని అనగానే కన్నా మహాలక్ష్మి పేరు మీద పోస్ట్ వచ్చింది అని తెలుసుకుని వదిన మీకోసం పోస్ట్ వచ్చింది అని అరుస్తాడు.. ఏంట్రా నేను ఏం పోస్ట్ చేయలేదు కదా ఏం వచ్చింది అని మహాలక్ష్మి ఓపెన్ చేసి చూడగానే అందులో ఆధార్ కార్డు ఉంటుంది.. నేను ఆధార్ కార్డు అప్లై చేయలేదు కదరా అని అనుకుంటూ ఉండగానే.. కొత్తగా ఎవరో చేశారు అని ఆలోచిస్తుంది.. బృందావనం ఇంటి పేరు మీద అడ్రస్ రావడం ఎవరి పని అని ఆలోచిస్తూ ఉండగా చక్రీ ఆధార్ కార్డు వచ్చిందా నేనే మార్పించాను అని అంటాడు.. అయితే అందులో వైఫ్ ఆఫ్ చక్రి అని ఉండడం చూసిన మహాలక్ష్మి ఏంటిది అని కోపంగా మాట్లాడుతుంది.. అంతే కదూ అక్కడ చక్రీని కట్టేసి కొడుతుంది ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పినా కూడా ఎందుకు చేస్తున్నావు అంటూ దారుణంగా కొడుతుంది.. చక్రీ కన్నాకి నిజం చెప్పి షాక్ ఇస్తాడు..

మహాకు విక్కీ సర్ప్రైజ్..

Advertisement

మహాలక్ష్మి నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అక్కట్లు విప్పేసేరా.. వీడికి అనవసరంగా ఏమి మాట్లాడను అని అనుకునేవి వెళ్ళిపోతుంది.. ఇక మహాలక్ష్మి ఆఫీస్ కి వెళ్ళదని దివ్య తనని ఇంకా టెన్షన్ పెట్టేలా మాట్లాడుతుంది.. ఆఫీసులో నువ్వు ఏమైనా తప్పు చేసావా ఎందుకు విక్కి నీ మీద ఫైర్ అవుతున్నాడు అని అంటుంది.. ఆఫీసులో నేను ఏమి తప్పు చేయలేదు కదా ఎందుకు అంటున్నారు అని అడుగుతుంది.. ఏమో నాకు తెలియదు విక్కీ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు ఒకసారి వెళ్ళు అని మహాలక్ష్మిని దివ్య పంపిస్తుంది.. అయితే అక్కడ అందరూ రిలేటెడ్ హ్యాపీ బర్త్డే అని చెప్పడంతో మహా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది.. ఆఫీసులో విక్కి ఇచ్చిన సర్ప్రైజ్ చాలా బాగుంది అంటూ సంతోషంగా ఉండగానే దివ్య విక్కి నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఆలోచించు అని అంటుంది.

బండితో గుద్దేసిన మహా..

మహాలక్ష్మి లైసెన్స్ కోసం వెళ్లాలి అని చక్రి అనగానే ఇది కూడా నిజమేనా లేక ఫ్రాడ్ అని అంటుంది.. మీరు ప్రతిదీ నన్ను అలా అర్థం చేసుకుంటే నేనేమీ చేయలేను ఇది నిజమే మీరు రండి వెళ్దామని అంటాడు. ఓంకారేశ్వర్ దగ్గరికి మహాలక్ష్మి తీసుకెళ్లగానే మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మొత్తానికి డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో మహాలక్ష్మిని చూడలేని ఓంకారేశ్వర్ చెప్తాడు. అయితే అప్పుడే ఒక అతను ఎదురుగా రావడంతో అతని మహాలక్ష్మి గుద్దిస్తుంది.. ఇక ఓంకారేశ్వరి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో మహాలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వేదవతి మాటకు నర్మద సీరియస్.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Related News

Gundeninda GudiGantalu Today episode: రెడ్ హ్యాండెడ్ గా దొరికిన చింతామణి.. మీనా గెలిచింది.. ప్రభావతికి మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode July 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను అనుమానించిన శివనారాయణ 

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి మాటకు నర్మద సీరియస్.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Brahmamudi Serial Today Episode July 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన లక్కీ 

Intinti Ramayanam Today Episode: అయ్యో.. భానుమతి.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. చక్రధర్ మాటకు మైండ్ బ్లాక్..

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. రెండు మస్ట్ వాచ్..

బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ తల్లి కాబోతోందా?

Big Stories

Advertisement
×