E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి మాటకు నర్మద సీరియస్.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి మాటకు నర్మద సీరియస్.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 22nd:తన పుట్టింటి వాళ్ళు వస్తున్నారు ఇంకా చందమామ వెళ్ళిపోలేదు ఏంటి..? తెల్లవారు లేదు కదా అని ఆలోచిస్తూ ఉంటారు వేదవతి.. తొందరగా తెల్లవారితే బాగుండు మా అక్క అన్న మన ఇంటికి వస్తున్నారు కదా ఎప్పుడు ఇప్పుడు వాళ్ళని చూద్దామని ఎదురు చూస్తున్నాను అని రామరాజుతో ధీరజ్ తో అంటుంది. ఇక ప్రేమ తన పుట్టింది వాళ్ళకోసం ఎదురు చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉండగా వేదవతి ప్రేమ దగ్గరికి వెళ్లి తన బాధని పెట్టి ఇంకా అక్క ఎమోషనల్ అవుతుంది.. వీళ్ళిద్దరూ ఎమోషనల్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. పాతికేళ్ల నా నిరీక్షణ ఇప్పుడు తీరబోతుంది అని వేదవతి ప్రేమతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. వేదవతిని చూసి అమ్మ సంతోషం చూసిన ముగ్గురు కొడుకులు చాలా సంతోషంగా ఉంటారు.. అందరూ కలిసి ఇలా సంతోషంగా ఉండడం చూసి వేదవతి మా వాళ్ల కోసం నేను ఇన్నేళ్లు వెయిట్ చేసాను నాకు ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది.

పుట్టింటివాళ్ల కోసం వేదవతి కన్నీళ్లు…

నా చేతులతో పాతికేళ్ల తర్వాత నా వాళ్లకి భోజనం చేసి పెడుతున్నాను అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అది చూసిన అందరూ కూడా బాధపడతారు. 25 ఏళ్ల తర్వాత మా వాళ్ల కోసం నేను ఇంత కష్టపడుతున్నాను అని వేదవతి అంటుంది.. చిన్నప్పుడు నుంచి మా అక్క వాళ్ళతో ఎంత సంతోషంగా ఉన్నానో ఇప్పుడు కూడా నేను అంత సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. ఆరోజులు గుర్తుచేసుకొని నేను మళ్ళీ మా వాళ్లతో సంతోషంగా గడపబోతున్నాను అన్న ఆలోచన నన్ను ఇంకా కుదిపేస్తుంది అని వేదవతి ఎమోషనల్ అయిపోతుంది. వేదవతిని చూసిన ప్రేమ కూడా ఎమోషనల్ అవడంతో ధీరజ్ అమ్మ నీ మేనకోడలు కూడా నీవు అనడం వల్ల బాధపడుతుందమ్మా అని అనగానే.. ప్రేమ నేను కూడా ఆ ఇంటి బిడ్డనే కదరా ఏం మాట్లాడుతున్నావు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మీ పుట్టింటి వాళ్ళు వస్తున్నారని ఈరోజు అంతగా చేశారు. మా పుట్టింటి వాళ్లకి ఏ రోజైనా ఒకరోజు పిలిచి ఇలా భోజనం పెట్టారా అని నర్మదా అనగానే నువ్వే మనకే మీ వాళ్ళకి కూడా నేను పెడతాను అని నర్మదాను అంటుంది వేదవతి..

ఫంక్షన్ కోసం గ్రాండ్ ఏర్పాట్లు..

Advertisement

శారదాంబ ఫంక్షన్ నీ గ్రాండ్గా చేయాలని వేదవతి కుటుంబం ఎంతో కష్టపడి ఇల్లంతా డెకరేట్ చేసి అన్నిటినీ సిద్ధం చేస్తారు.. మా ఇల్లు ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది వీటిని కచ్చితంగా పూర్తిగా మార్చి వేయాలి అని అందరూ కూడా చాలా ప్రయత్నించి మొత్తానికి డెకరేషన్ ని అదరగొడతారు. అటు వేదవతి ఏ చీర కట్టుకోవాలి మా అక్క నేను ఇద్దరు ఒకే చీర కట్టుకుంటే బాగుంటుంది అంటూ సెలక్షన్ లో పడి బిజీగా ఉంటుంది. రామరాజు నువ్వు అంతా సరే బాగానే చేశావు కానీ ఈ చీర వెతకడం ఇప్పట్లో అవ్వదులే కానీ అని వెటకారంగా మాట్లాడేసి వెళ్ళిపోతాడు. మా అక్క ఏ చీర కట్టుకుంటే నేను అదే చీర కట్టుకుంటాను అని వేదవతి తనకు నచ్చిన చేరని సెలెక్ట్ చేసుకుంటుంది..

శ్రీవల్లి పై చందు సీరియస్..

శ్రీవల్లి అందరూ ఫంక్షన్ ఏర్పాట్లలో బిజీగా ఉంటే ప్రేమని ఎలా విడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది.. ప్రేమ జీవితాన్ని నాశనం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.. చెందువుతో మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా శ్రీవల్లి మొహం కూడా చూడడానికి ఇష్టపడడు చందు.. అది చూసిన శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. నా మొహం కూడా చూడడానికి నీకు ఇష్టం లేదా బావ అని అడుగుతుంది. చందు బటన్ వేసుకోలేదు అని శ్రీవల్లి ఏంటి బావ ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు పైన బటన్ వేసుకోలేదు అని ముట్టుకోవాలని అనుకుంటుంది. నువ్వు మళ్ళీ భార్యతో మాత్రం మారద్దు అని చందు అనుకుంటాడు. నన్ను ముట్టుకోవడానికి భారీగా సేవలు చేయడానికి నువ్వు పనికిరావు నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను నువ్వు నా దగ్గరికి రావద్దు అని వార్నింగ్ ఇస్తాడు.. నా భర్త నాతో దూరం అవడానికి కారణం నువ్వే.. ఆ పొట్టి మిరపకాయ సంగతి నేను చూస్తాను అని శ్రీవల్లి అనుకుంటుంది.

ధీరజ్, ప్రేమల రొమాన్స్..

Advertisement

ధీరజ్ ప్రేమలు ఫంక్షన్ కి రెడీ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రేమ చీర సెలెక్ట్ చేసుకున్నంత ఈజీగా చీర కట్టుకోవడం రాదు అని అనుకుంటుంది.. అయితే ప్రేమ ఏం చేసినా కూడా దాంట్లో వంకలు పెట్టే ధీరజ్ ఆడదాని వేయండి చీర కట్టుకోవడం రాకపోవడం నిజంగా సిగ్గుచేటు అని అంటాడు.. అయితే ప్రేమ ఏం చేసినా కూడా ధీరజ్ ఏదో ఒకటి అనడంతో ప్రేమ బాధ పడిపోతూ ఉంటుంది.. మొత్తానికి ధీరజ్ ప్రేమకి చీర కట్టడం చూసిన ప్రేమ సిగ్గు పడిపోతూ మెలికలు తిరుగుతుంది.. అసలుకి చీర కట్టుకోవడం రాదు ఒకవైపు కడుతుంటే మళ్ళీ ఇలా వానకు తడిసిన వానపాము లాగా ఎందుకే మెలికలు తిరుగుతున్నావు అని ధీరజ్ వెటకారంగా మాట్లాడతాడు. మొత్తానికి వీరిద్దరూ కలిసి రొమాంటిక్గా రెడీ అవ్వడం ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది..

ఒక్కటైన రెండు కుటుంబాలు..

ఇక వేదవతి ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది.. నా పుట్టింటి వాళ్ళు తన ఇంటికి రాబోతున్నారు అని బయటకు వెళ్లి చాలా సంతోషంగా ఎమోషనల్ అయిపోతూ వాళ్ళని చూస్తుంది.. ఇక శారదంబ కూడా తన కూతురింటికి వెళ్ళాలి అని హడావిడి చేసి అక్కడికి వెళుతుంది. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న గీతను దాటి వేదవతి తన వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడుతుంది.. వేదవతికి భద్ర ప్లాన్ తెలియక వాళ్ళందరితో అమాయకంగానే తన వాళ్ళు అనుకుని నమ్మి మాట్లాడుతుంది. అందరూ కలిసి చాలా సంతోషంగా ఉండడం ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సంతోషంగా ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: అయ్యో.. భానుమతి.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. చక్రధర్ మాటకు మైండ్ బ్లాక్..

Related News

Podarillu Today Episode : చక్రీ కష్టం పగోడికి రాకూడదు.. మహా మాటతో చక్రీ ఫీల్.. సర్ప్రైజ్ ఇచ్చిన విక్కీ..

Brahmamudi Serial Today Episode July 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన లక్కీ 

Intinti Ramayanam Today Episode: అయ్యో.. భానుమతి.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. చక్రధర్ మాటకు మైండ్ బ్లాక్..

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. రెండు మస్ట్ వాచ్..

బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ తల్లి కాబోతోందా?

బుల్లితెరపై ప్రత్యక్షమైన ప్రదీప్.. సినిమాలకు గుడ్ బై చెప్పేశాడా?

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×