E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నందు గురించి నిజం తెలుసుకున్న వెంకీ 

Brahmamudi Serial Today Episode July 25th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నందు గురించి నిజం తెలుసుకున్న వెంకీ 
Advertisement

Brahmamudi serial today Episode: లక్కీ రూం విషయంలో ఫైనల్‌ డిసీషన్‌ నీదే పిన్ని ఏదైనా సరే ఆలోచించుకుని చెప్ప అంటూ రాజు చెప్పగానే.. భ్రమరాంబ ఏంటి రేఖ ఇంకా ఆలోచిస్తున్నావు. ఇష్టం లేదని చెప్పు అనగానే.. రేఖ కోపంగా వదిన ఆగు.. మదన్‌ నువ్వు కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వు ఆ తర్వాత నీకు వేరే చూస్తాను అని చెప్పగానే.. మదన్‌ ఏం మట్లాడుతున్నావు మమ్మీ వాడు నా గదిని షేర్‌ చేసుకోవడం ఏంటి..? అని అడగ్గానే.. రేఖ కోపంగా చెప్తున్నాను కదా అర్థం చేసుకుని అడ్జస్ట్‌ అవ్వు అంతవరకు నన్ను ఏమీ అడగకు అంటూ రేఖ వెళ్లిపోతుంది. మదన్‌ కోపంగా రూంలోకి వెళ్తాడు.. ఏయ్‌ నువ్వు కూడా వెళ్లు అనగానే.. లక్కీ వెళ్తాడు. తర్వాత అందరూ వెళ్లిపోతారు. భ్రమరాంబ, శేషు ఏదో అనుమానం ఉంది. దీని వెనక ఏదో రహస్యం ఉంది. లేకపోతే ఆ రాజు గాడికి మన రేఖ భయపడటం ఏంటి..? దీన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందే. అంటూ భూషణ్‌ను రెచ్చగొడతారు.

మరోవైపు వెంకీ బండి మీద వెళ్తున్న నందు దుగ్గిరాల ఇంటి దగ్గరకు రాగానే బైక్‌ ఆపేసి మా ఇంట్లోకి వెళ్లి ఒక ఫైల్‌ తీసుకుని వస్తాను అని చెప్పగానే.. ఈ ఇల్లు మీ ఇళ్లేంటి..? అని వెంకీ అనుమానంగా అడిగితే అసలు నిజం చెప్తుంది నందు. తాను దుగ్గిరాల ఇంటి వారసురాలిని నేను.. దుగ్గిరాల ప్రకాష్‌, ధాన్యలక్ష్మీల కొడుకు కళ్యాణ్‌ కూతురుని నేను అని చెప్పగానే.. వెంకీ బాధగా ఇక నేను వెళ్తాను నందు బై అంటూ వెళ్లబోతుంటే.. సరే ఇందాక ఏదో చెప్తాను అన్నావు కదా..? ఏంటో చెప్పు అని అడగ్గానే.. ఇప్పుడు చెప్పేంత టైం లేదు మనం తర్వాత మాట్లాడుకుందాం బై అంటూ వెంకట్‌ బాధగా వెళ్లిపోతాడు. ఇంట్లోకి వెళ్తున్న నందుకు ఇందు ఎదురుగా వచ్చి ఎక్కడికి వెళ్లావో చెప్పు అని అడగ్గానే.. యాక్సిడెంట్‌ గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్లానని చెప్తే అక్క సీరియస్‌ అవుతుంది అని మనసులో అనుకుని బయటకు మాత్రం నేను వెంకీ సరదాగా బయటకు వెళ్లాము అని చెప్తుంది.

Advertisement

దీంతో ఇందు అయితే మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది నందు నువ్వు వెంకీని ఇష్టపడుతున్నావా..? అని అడగ్గానే.. నందు సిగ్గుపడుతూ.. అవును అక్కా వాడంటే నాకు ఇష్టం.. ఇష్టమే కాదు ప్రాణం.. తెలియకుండానే వాడంటే నాకు ఇష్టం కలిగింది. ఆ ఇష్టం కాస్త వాడే నా ప్రపంచం అన్నంతగా మారిపోయింది అని చెప్పగానే.. అయితే వెంకీకి నువ్వంటే ఇష్టమేనా అని అడిగితే.. ఇష్టమే కానీ బయట పడటం లేదు.. అని చెప్పగానే.. అయితే మరి నువ్వు చెప్పొచ్చు కదా..? అనగానే.. లేదు అక్కా వాడే ముందు చెప్పాలి అందుకోసమే ఎదురుచూస్తున్నాను.. అని చెప్పగానే.. ఓహో నీకు చాలా ఎక్స్‌ఫెక్టేషన్స్‌ ఉన్నాయి అనగానే.. నీకు ఎవరిమీదైనా లవ్వు పుడితే నీకు ఇలాగే అనిపిస్తుంది అని చెప్తుంది నందు.

ఐశ్వర్య ఫ్రెండ్స్‌ అందరూ కలిసి పార్టీ చేసుకుంటుంటారు. పార్టీలో కూడా ఐశ్వర్య మూడీగా ఉంటుంది. అది చూసి వాళ్ల ఫ్రెండ్‌ సరదాగా ఉండమని చెప్తుంది. కానీ ఐశ్వర్య తనకు లైఫ్‌ మీద విరక్తి పుడుతుందని చెప్తుంది. అందుకు ఎదురుగా ఉన్న ఫ్రెండ్‌ను చూపిస్తూ వాడిని పెళ్లి చేసుకో నీ ప్రాబ్లమ్స్‌ అన్ని సాల్వ్‌ అవుతాయి అంటుంది. ఐశ్వర్య ఆలోచిస్తుంది.

Advertisement

రాజు, ఇందులో లక్కీ గురించి మాట్లాడుతుంటే.. ఇందు మాత్రం నీ లైఫ్‌లోకి వచ్చే అమ్మాయి గురించి ఎమైనా కలలు ఉన్నాయా..? అంటే గలగల మాట్లాడే అమ్మాయి.. సైలెంట్‌గా ఉండే అమ్మాయి… ఇలా ఏదైనా డ్రీమ్స్‌ ఉన్నాయా..? అని అడిగితే.. నా లైఫ్‌లోకి వచ్చే అమ్మాయి నీలా ఉండకూడదు అంతే..చాలు అంటాడు. దాంతో ఇందు చీచీ అసలు నిజం చెప్పు.. అంటూ అడిగితే రాజు తనకు ఎలాంటి అమ్మాయి రావాలో చెప్తుంటాడు. ఇందు కోప్పడుతుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఆటో రాంప్రసాద్ కు ఓటు వేయద్దు.. ఫాన్స్ కు రిక్వెస్ట్ అంత పగేంటి ఉప్పల్ బాలు!

యాంకర్ గా తొక్కేయడంతోనే ఉదయభాను నిర్మాత అయ్యారా?

యూట్యూబర్ నందన కేసులో బాధితుడు చెప్పిన నిజాలు!

సామాన్యుడిపై సెలబ్రిటీస్ ప్రతాపం.. కప్పు కొట్టేస్తాడని భయమా?

నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మర్యాద ఉండదు .. నాగార్జునకు బిగ్ వార్నింగ్!

మగపిల్లలే కాదు.. ఆడపిల్లలు కూడా…బిగ్ బాస్ ఝాన్సీ ఎమోషనల్!

‘వీసా స్కామ్ ‘.. మీడియాతో నందన కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

స్టేజ్ పై గొడవపడ్డ కృష్ణ భగవాన్, యమునా?

Big Stories

Advertisement
×