E-Paper
Advertisement

Amaravati: అమరావతికి రానున్న GIIS విద్యాసంస్థ.. 4 ఎకరాల్లో క్యాంపస్, రూ. 300 కోట్ల పెట్టుబడి

Amaravati: అమరావతికి రానున్న GIIS విద్యాసంస్థ.. 4 ఎకరాల్లో క్యాంపస్,  రూ. 300 కోట్ల పెట్టుబడి
Advertisement

Amaravati: ఏపీ రాజధాని పనులు చకచకా జరుగుతున్నాయి. కేవలం ప్రభుత్వ కార్యాలయాలే కాదు.. ప్రైవేటు సంస్థల నిర్మాణాల పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా అమరావతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ రానుంది. గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్-GIIS ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో ఏర్పాటు చేయబోతోంది. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

అమరావతికి రానున్న GIIS విద్యాసంస్థ.. 4 ఎకరాల్లో క్యాంపస్

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయి. కేవలం ప్రభుత్వ, బ్యాంకులు కాకుండా ఐటీ, ఎడ్యుకేషన్ క్యాంపస్‌లు తరలివస్తున్నాయి. ఇప్పటికే అమరావతిలో వివిధ ఎడ్యుకేషన్ సంస్థల నిర్మాణాల పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ స్కూల్ రాబోతోంది.

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌-GIIS కొత్త క్యాంపస్ రానుంది. తుళ్లూరు మండలం శాఖమూరులో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం 4 ఎకరాలు కేటాయించనుంది. ప్రపంచ స్థాయి విద్యా సదుపాయాలతో ఈ క్యాంపస్ ఏర్పాటు కానుంది. ఏపీ సీఆర్డీఏ-జీఐఐఎస్ ప్రతినిధుల మధ్య ఒప్పందాలు జరిగాయి.

Advertisement

దేశంలోని ఆ సంస్థకు ఆరో క్యాంపస్.. రూ.300 కోట్ల పెట్టుబడి

సీఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ రాయ్- జీఐఐఎస్ సంస్థ తరఫున కంట్రీ డైరెక్టర్ రాజీవ్ కౌల్ సంతకాలు చేశారు. కొత్త పాఠశాల క్యాంపస్ కోసం దాదాపు రూ. 300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది ఆ సంస్థ. అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనుంది. అమరావతిలో విద్యా మౌలిక వసతులు బలోపేతం కానున్నాయి.

ఇప్పటివరకు మూడు యూనివర్శిటీలు ఏర్పాటు చేశారు. అవన్నీ బీటెక్, ఎంటెక్ ఆధారంగా వచ్చినవి. ఇప్పుడు పాఠశాలల వంతైంది. పాఠశాల స్థాయిలో ప్రపంచ స్థాయి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఒక్కటీ రాలేదు. జీఐఐఎస్ ఏర్పాటుతో ఆ లోటు తీరనుంది. ఇలాంటి సంస్థలు రావడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని నిర్వాహకులు చెబుతున్నారు.

ALSO READ: కాకినాడలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం ఘటన.. వెనక్కి వచ్చిన కుక్క ఎందుకు పారిపోయింది? చిన్నారి ఎక్కడ?

గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌-GIIS సంస్థకు వివిధ దేశాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. జపాన్, సింగపూర్, యుఏఈ వంటి దేశాల్లో కొనసాగున్నాయి. ఇండియాలో ఆ సంస్థకు ఐదు క్యాంపస్‌లు ఉన్నాయి. అమరావతిలో ఏర్పాటు చేయబోయేది ఆరో క్యాంపస్.

Related News

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

Big Stories

Advertisement
×