E-Paper
Advertisement

Chiranjeevi Bobby: ఎప్రిల్‌లో బాబి కొల్లి దర్శకత్వంలో చిరు ‘మెగా 158’ షూటింగ్ షురూ..

Chiranjeevi Bobby: ఎప్రిల్‌లో బాబి కొల్లి దర్శకత్వంలో చిరు ‘మెగా 158’ షూటింగ్ షురూ..
Advertisement

Chiranjeevi Bobby: మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ డైరెక్టర్ బాబి కొల్లి (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్ అనగానే అభిమానులకు ‘వాల్తేరు వీరయ్య’ సృష్టించిన సునామీ గుర్తుకు వస్తుంది. ఇప్పుడు వీరిద్దరూ మళ్ళీ చేతులు కలుపుతుండటంతో టాలీవుడ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చిరంజీవి కెరీర్‌లో మెగా 158గా రాబోతున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ఘనంగా ప్రారంభం కానుంది. గత ఏడాది విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, చిరంజీవిలోని వింటేజ్ మాస్‌ను వెండితెరపై ఆవిష్కరించింది. బాబి దర్శకత్వంలో మెగాస్టార్‌ను చూడాలని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. తాజాగా మెగా 158 ప్రకటనతో ఆ నిరీక్షణకు తెరపడింది.

Read also-Historical drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన షేక్స్‌పియర్ రియల్ స్టోరీ… ఐయండిబిలో 7.9 రేటింగ్ కూడా

Advertisement

ఏప్రిల్‌లో ముహూర్తం

ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రం పనులు తుది దశకు చేరుకోవడంతో, తదుపరి చిత్రంపై మెగాస్టార్ దృష్టి సారించారు. బాబి ఇప్పటికే పక్కా కమర్షియల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని, ఏప్రిల్ నెలలో ఉగాది పర్వదినం సందర్భంగా లేదా దానికి దరిదాపుల్లో ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Read also-Intinti Ramayanam Today Episode: ట్విస్ట్ అదిరింది.. నిజం ఒప్పుకున్న చక్రధర్.. దిమ్మతిరిగే షాకిచ్చిన పల్లవి..

మెగా 158 గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని, ఇందులో చిరంజీవి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ లేదా ఒక మాస్ లీడర్ పాత్రలో కనిపిస్తారని టాక్. బాబి సినిమాల్లో సంగీతానికి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి, ముందుగా ఏఆర్ రెహమాన్ ను అనుకున్నారు, కానీ అనివర్య కారణాల వల్ల థమన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఇతర భాషల నటులు కూడా భాగం కానున్నట్లు సమాచారం, తద్వారా దీనికి పాన్-ఇండియా అప్పీల్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూనే, తన బలం అయిన మాస్ ఆడియన్స్‌ను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. బాబి దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రం ఖచ్చితంగా మాస్ జాతరను తలపిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. వేసవిలో ప్రారంభం కానున్న ఈ షూటింగ్ శరవేగంగా జరుపుకుని వచ్చే ఏడాది విడుదలకు సిద్ధం కానుంది. ఇప్పటికే మన శంకరవర ప్రసాద్ తో మంచి జోష్ మీద ఉన్న మెగాస్టార్ ఈ సినిమా తో ఏం చేస్తారో చూడాలి మరి.

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×