E-Paper
Advertisement

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!
Advertisement

Russia Sanctions Bill: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనాలతోపాటు పలు దేశాలకు భారీ ఊరటనిచ్చారు. రష్యా ఎగుమతులకు సంబంధించి తాను గత నెలలో సంతకం చేసిన వివాదాస్పద బిల్లు అమలును ఒకరోజు ముందే నిలిపివేశారు. రష్యాపై విధించిన ఆంక్షలు, ఆ దేశ వస్తువులపై విధించిన దిగుమతి సుంకాల అమలును తాత్కాలికంగా సడలిస్తున్నట్లు ప్రకటించారు.

జాతీయ ప్రయోజనాల కోసమే..

అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో దీనిపై స్పందించారు. ‘గ్రాహం చట్టం కింద ఉన్న ఆంక్షలు, నిబంధనలు, సుంకాల విధింపును నేను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాను. ఈ సమయంలో ఈ మినహాయింపు ఇవ్వడం అమెరికా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని కాంగ్రెస్‌కు నివేదించాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి ఆంక్షల అమలును మాత్రమే నిలిపివేశారని.. భవిష్యత్తులో పరిస్థితులను బట్టి ట్రంప్ వీటిని మళ్లీ అమలు చేసే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.

పుతిన్‌తో ట్రంప్ సాన్నిహిత్యం

Advertisement

మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న ట్రంప్.. రష్యాతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రష్యా నుంచి అమెరికాకు డీజిల్ దిగుమతి చేసుకునే ఒప్పందాన్ని ఇటీవల ప్రకటించారు. దీని ప్రకారం రష్యా 300,000 టన్నులకు పైగా డీజిల్‌ను సరఫరా చేయనుంది. అయితే ఈ డీజిల్ ఒప్పందాన్ని జెలెన్‌స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. దీనిని అత్యంత హేయమైన నిర్ణయంగా అభివర్ణించారు. మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించే ఒప్పందం కుదుర్చుకోవడంలో జెలెన్‌స్కీ విఫలమయ్యారని, ఆయన స్థానంలో కొత్త నాయకుడు వస్తే మంచిదని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.

రష్యా ఆంక్షల చట్టం నేపథ్యం..

‘లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ పేరుతో రూపొందించిన ఈ చట్టాన్ని ట్రంప్ గత నెలలో ఆమోదించారు. రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న చైనా, భారత్, స్లోవేకియా, హంగేరి, అజర్‌బైజాన్ దేశాల నుంచి వచ్చే అన్ని వస్తువులపై 100 శాతం సుంకాలు విధించడానికి ఈ చట్టం వీలుకల్పించింది. అలాగే రష్యా ఇంధన దిగుమతులపై ఏకంగా 500 శాతం టారిఫ్‌లు వేయడానికి కూడా ఈ చట్టం ఆస్కారం కల్పించింది. ఆమోదం అనంతరం ఈ చట్టం అమలుకు 30 రోజుల గడువును ట్రంప్ కు ఇచ్చింది. అక్టోబర్ 18తో ఆ గడువు ముగియనుండగా.. సరిగ్గా ఒకరోజు ముందు చట్టం అమలును ఆపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం గమనార్హం.

Advertisement

Also Read: Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

అమలై ఉంటే భారత్‌పై ప్రభావం

ఈ చట్టం ప్రకారం ఒకవేళ భారత్‌పై 100 శాతం సుంకం అమలై ఉంటే దేశంపై విపరీతమైన ఆర్థిక భారం పడేది. అమెరికా ఇప్పటికే వసూలు చేస్తున్న 10 శాతం అదనపు సుంకాలకు ఇది అదనంగా వచ్చి చేరేది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమెరికా కాంగ్రెస్.. రష్యా ఆంక్షల బిల్లును ఆమోదించినప్పుడే భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. తన దేశ ప్రజల ఇంధన భద్రతను కాపాడుకోవడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. భిన్నమైన మార్గాల ద్వారా ఇంధన వనరులను సమకూర్చుకుంటూ ముందుకు వెళ్తామని విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

Also Read: అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

Tags

Related News

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

Big Stories

Advertisement
×