E-Paper
Advertisement

ఎస్‌బీఐ కస్టమర్ల డేటా లీక్.. మీకూ అకౌంట్ ఉందా? వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఎస్‌బీఐ కస్టమర్ల డేటా లీక్.. మీకూ అకౌంట్ ఉందా? వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి
Advertisement

SBI data leak Safety Tips| మీ పేరు, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ ఇతరుల చేతుల్లోకి వెళితే ఏమవుతుంది? ఈ వివరాలతో సైబర్ నేరగాళ్లు మీకు బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది. మీడియా నివేదికల ప్రకారం.. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. బ్యాంకు ప్రాథమిక పరిశీలనలో మొత్తం 3,897 రికార్డుల (బ్యాంకు ఖాతాల) వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు గుర్తించింది. అయితే, ఈ సమాచారం ఎంతవరకు నిజమైనదో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతోంది. ఇలాంటి సందర్భంలో ఎస్‌బీఐ ఖాతాదారులు ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ఎస్‌బీఐ డేటా లీక్ ఘటనలో ఏం జరిగింది?

అక్టోబర్ 21, 2026న ఎస్‌బీఐ ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. అక్టోబర్ 16న బ్యాంకు డేటా బయటపడినట్లు హెచ్చరికలు అందాయి. థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) నుంచి ఈ సమాచారం వచ్చింది. డార్క్ వెబ్‌లో కనిపించిన సుమారు 3.75 లక్షల రికార్డులను పరిశీలించగా, వాటిలో 3,897 రికార్డుల్లో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు గుర్తించారు. సమాచారం ఎలా బయటకు వచ్చింది, దాని పూర్తి పరిధి ఎంత అనే విషయాలను తెలుసుకోవడానికి బ్యాంకు ప్రత్యేక దర్యాప్తు సంస్థను నియమించింది.

కస్టమర్లకు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటపడింది?

Advertisement

ప్రాథమిక పరిశీలన ప్రకారం.. కొన్ని రికార్డుల్లో కస్టమర్ల పేర్లు, లింగం, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈమెయిల్ చిరునామాలు, ఇంటి చిరునామాలు ఉన్నాయి. బ్రాంచ్ వివరాలు, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ (CIF) గుర్తింపు సంఖ్యలు, లోన్లు లేదా లీడ్లకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే.. పాస్‌వర్డులు, ఏటీఎం పిన్‌లు, ఓటీపీలు లేదా ఖాతా నిల్వలు బయటపడ్డాయని నివేదికలో పేర్కొనలేదు. ప్రస్తుతం సమాచారం నిజమైనదా, ఎంతమంది కస్టమర్లకు సంబంధించినదా అనే విషయాలపై విచారణ జరుగుతోంది.

ఈ ఘటన వల్ల బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగిందా?

ఈ ఘటన వల్ల తమ ప్రధాన బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు లేదా సేవల కొనసాగింపుపై గణనీయమైన ప్రభావం పడలేదని ఎస్‌బీఐ తెలిపింది. అయినప్పటికీ, వ్యక్తిగత సమాచారం ఆధారంగా సైబర్ నేరగాళ్లు నకిలీ కాల్స్, మెసేజ్‌లు పంపే అవకాశం ఉంది.

ఎస్‌బీఐ ఖాతాదారులు ఇప్పుడు ఏం చేయాలి?

Advertisement

ముందుగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వార్త ఒక్కటే కారణంగా మీ బ్యాంకు ఖాతాను మూసివేయాల్సిన అవసరం లేదు. అయితే అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. ఎవరితోనూ ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకింగ్ పాస్‌వర్డ్ లేదా కార్డు వివరాలు పంచుకోవద్దు. కేవైసీ అప్‌డేట్, లోన్ వివరాలు లేదా ఖాతా ధృవీకరణ పేరుతో వచ్చే అనుమానాస్పద కాల్స్‌ వస్తే వారి నమ్మవద్దు.
తెలియని లింకులను క్లిక్ చేయకండి. అనుమానాస్పద యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకండి.
బలహీనమైన లేదా ఇతర ఖాతాల్లోనూ వాడుతున్న పాస్‌వర్డ్ ఉంటే దాన్ని మార్చండి. బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్ ఉపయోగించండి. ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ అలర్ట్‌లను ఆన్‌లో ఉంచి, ఖాతా లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలించండి. అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే ఎస్‌బీఐకి ఫిర్యాదు చేయండి.

Also Read: పిల్లలు తప్పు చేసినా సరే.. కోపంలో ఈ మాటలు మాత్రం అనకండి!

సైబర్ మోసం జరిగితే వెంటనే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?

మీ ఖాతా నుంచి అనుమానాస్పదంగా డబ్బు బదిలీ అయినా లేదా మోసానికి గురయ్యారని అనిపించినా, వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. అలాగే cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.

Also Read: చాణక్య నీతి.. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి 7 మార్గాలు

ఎస్‌బీఐ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి

డేటా బయటపడిన ఘటనపై ఎస్‌బీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే వరకు అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత సమాచారం తెలిసినంత మాత్రాన మోసగాళ్లకు మీ ఖాతా నుంచి డబ్బు తీసుకునే అధికారం లభించదు. మీ ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్ వంటి రహస్య వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు వెల్లడించకండి.

Related News

ఢమాల్.. ఇండియాలో భారీగా తగ్గిన స్మార్ట్‌ఫోన్ విక్రయాలు.. టాప్ 5 బ్రాండ్స్ ఇవే

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? హాస్పిటల్ బిల్స్ ఈఎంఐలో చెల్లించవచ్చు.. ఎలాగంటే?

రిటైర్మెంట్ తరువాత నెలవారీ అద్దె ఆదాయం కోసం షాప్ కొంటున్నారా? కొనేముందు ఈ లెక్కలు వేసుకోండి

అప్పట్లో సామాన్యులను లక్షాధిపతులను చేసిన ధీరుభాయ్.. ‘జియో’ IPOతో అది సాధ్యమేనా?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఏం జరిగింది? ఇద్దరు సీనియర్‌ అధికారులపై విచారణ పూర్తి! రేపో మాపో చర్యలు

40 ఏళ్ల వయసు నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్.. ఇలా పెట్టుబడి చేస్తే రూ.3 కోట్ల రాబడి

దీపావళి ముందు తగ్గిన బంగారం ధరలు.. మరింత తగ్గుతాయా?

Big Stories

Advertisement
×