United Nations Day: యుద్ధం విధ్వంసాన్ని మిగులుస్తుంది.. శాంతి భవిష్యత్తును నిర్మిస్తుంది! ఈ ఆలోచనతోనే 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి అధికారికంగా ఆవిర్భవించింది. రెండో ప్రపంచ యుద్ధం మళ్లీ రాకుండా చూడటం.. దేశాల మధ్య సమస్యలను చర్చలతో పరిష్కరించడం.. మానవ హక్కులను కాపాడటం.. పేదరికాన్ని తగ్గించడం.. ఇదీ యూఎన్ ప్రధాన లక్ష్యం. అందుకే ఏటా అక్టోబర్ 24న యునైటెడ్ నేషన్స్ డే జరుపుకుంటారు.
నెరవేరిన లక్ష్యాలెన్ని?
మరి యునైటెడ్ నేషన్స్ లక్ష్యాలు పూర్తిగా నెరవేరాయని చెప్పలేం.. అలాగని యూఎన్ సాధించిన విజయాలను విస్మరించలేం. యుద్ధ ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ.. ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు.. శరణార్థులకు అండగా నిలవడం.. ఆరోగ్యం, విద్య, మానవ హక్కులపై అంతర్జాతీయ సహకారం పెంచడం వంటి రంగాల్లో ఐక్యరాజ్యసమితి కీలక పాత్ర పోషిస్తోంది. అయితే.. ఇప్పటికీ ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రతా మండలిలో విభేదాలు.. అగ్రరాజ్యాల మధ్య రాజకీయ ప్రయోజనాలు.. నిర్ణయాల అమలులో పరిమితులు.. యూఎన్ ముందున్న ప్రధాన సవాళ్లు. అంటే.. ప్రపంచ శాంతి కోసం ఒక వేదిక ఉంది.. కానీ ఆ శాంతిని సాధించేందుకు దేశాల మధ్య ఏకాభిప్రాయం ఇంకా అవసరమే!
Also Read: మాజీ మంత్రిని తోసేసిన ఎస్‌ఐ.. చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్తత