E-Paper
Advertisement

ఐఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? అమెజాన్ సేల్‌లో ఈ 4 మోడళ్లలో ఏది బెటరో తెలుసుకోండి!

ఐఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? అమెజాన్ సేల్‌లో ఈ 4 మోడళ్లలో ఏది బెటరో తెలుసుకోండి!
Advertisement

Amazon Great Indian Festival 2026: స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు తక్కువ ధరకు వస్తుందా అని చూడటంతో పాటు.. మనం పెట్టే డబ్బుకు తగిన ఫీచర్లు ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026లో iPhone 17e, iPhone 16, iPhone Air, iPhone 17 Pro మోడళ్లపై ఆకర్షణీయమైన తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో iPhone Airపై ఏకంగా రూ.30,000 వరకు తగ్గింపు ఉండగా.. iPhone 17e తక్కువ ధరలోనే 256GB స్టోరేజ్‌ను అందిస్తోంది.

మరోవైపు, iPhone 17 Pro కెమెరా, బ్యాటరీ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. మరి ఈ నాలుగు మోడళ్లలో ఏది మీ డబ్బుకు తగిన విలువను ఇస్తుంది? ఏ ఫోన్‌పై ఎంత తగ్గింపు ఉంది? ధరతో పాటు ఫీచర్లను పోల్చి చూస్తే మీకు సరిపోయే ఐఫోన్‌ను ఎంచుకోవడం సులభమవుతుంది.

తక్కువ ధరలో ఎక్కువ స్టోరేజ్:

Advertisement

ఐఫోన్ 17e 256GB మోడల్ ధర రూ.71,999గా ఉంది. దీని అసలు ధర రూ.79,900 కావడంతో రూ.7,901 ఆదా అవుతుంది. 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, A19 చిప్, 48MP కెమెరా ఇందులో ఉన్నాయి. 2x ఆప్టికల్ క్వాలిటీ జూమ్‌తో ఫొటోలు తీయొచ్చు. MagSafe ద్వారా 15W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా అందుతుంది. ఎక్కువ స్టోరేజ్ కావాలి, కొత్త చిప్‌తో రోజువారీ పనులు సాఫీగా చేయాలి అనుకునేవారికి ఇది మంచి ఎంపిక.

కెమెరా ఫీచర్ల కోసం:

ఐఫోన్ 16 (128GB మోడల్) ధర రూ.76,999. అసలు ధర రూ.89,900తో పోలిస్తే రూ.12,901 తగ్గింపు లభిస్తోంది. 17e కంటే ధర ఎక్కువైనా, ఇందులో కెమెరా కంట్రోల్ బటన్ ప్రత్యేక ఆకర్షణ. 48MP ప్రధాన కెమెరాతో పాటు ఆటోఫోకస్ ఉన్న అల్ట్రా వైడ్ కెమెరా మాక్రో ఫొటోలు, వీడియోలకు ఉపయోగపడుతుంది. A18 చిప్ Apple Intelligence ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. కెమెరా ఫీచర్లు ముఖ్యం అనుకునేవారు ఈ మోడల్‌ను పరిశీలించొచ్చు.

Advertisement

Also Read: గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. 6 కీలక లోపాలకు పరిష్కారం, వెంటనే ఇలా అప్డేట్ చేసుకోండి!

పలుచని డిజైన్ కావాలంటే:

ఐఫోన్ ఎయిర్ 256GB ధర రూ.1,19,900. రూ.1,49,900 ధరతో పోలిస్తే రూ.30,000 ఆదా అవుతుంది. ఈ నాలుగింటిలో ఇదే పెద్ద తగ్గింపు. కేవలం 5.6 మిల్లీమీటర్ల మందంతో, టైటానియం ఫ్రేమ్‌తో ఈ ఫోన్ చాలా సన్నగా ఉంటుంది. A19 Pro చిప్, 48MP కెమెరా, 18MP ముందు కెమెరా ఇందులో ఉన్నాయి. వీడియో ప్లేబ్యాక్ 27 గంటల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది. తక్కువ బరువు, ప్రత్యేకమైన రూపం ముఖ్యం అనుకునేవారికి ఇది నచ్చొచ్చు.

కెమెరా, పనితీరు విషయానికొస్తే:

ఐఫోన్ 17 ప్రో 256GB ధర రూ.1,29,900. అసలు ధర రూ.1,34,900 కావడంతో రూ.5,000 మాత్రమే తగ్గింది. అయినా కెమెరా, వేగం, బ్యాటరీకి ప్రాధాన్యం ఇచ్చేవారికి ఇది ఉపయోగపడుతుంది. A19 Pro చిప్‌తో పాటు వెనుక మూడు కెమెరాలూ 48MPగా ఉన్నాయి. 8x ఆప్టికల్ క్వాలిటీ జూమ్ ఐఫోన్‌లో ఇప్పటివరకు అందించిన అత్యంత పొడవైన జూమ్‌గా చెప్పబడుతోంది. వీడియో ప్లేబ్యాక్ 31 గంటల వరకు ఉంటుందని ఆపిల్ పేర్కొంది.

ఏది కొనడం బెటర్ అంటే?

తక్కువ ఖర్చుతో 256GB స్టోరేజ్ కావాలంటే ఐఫోన్ 17e చూడొచ్చు. కెమెరా నియంత్రణలు, తగ్గింపు రెండూ కావాలంటే ఐఫోన్ 16 సరైన ఎంపిక. సన్నని డిజైన్ కోసం ఎయిర్‌ను ఎంచుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు ఎక్కువగా తీస్తూ, జూమ్, బ్యాటరీపై ఎక్కువ శ్రద్ధ ఉంటే 17 ప్రో ఉపయోగపడుతుంది. కొనేముందు ఆఫర్ ధర, బ్యాంక్ తగ్గింపులు, ఎక్స్చేంజ్ నిబంధనలు కూడా ముందుగా చెక్ చేయండి. మీకు రోజూ అవసరం లేని ఫీచర్ల కోసం అదనంగా ఖర్చు చేయకుండా.. మీ బడ్జెట్‌కు సరిపోయే మోడల్ తీసుకోవడమే తెలివైన నిర్ణయం.

Also Read: సైజులో చిన్నదే.. హెల్త్ ఫీచర్లు మాత్రం బోలెడు, Oura Ring 5 భారత్‌లోకి వచ్చేసింది!

Tags

Related News

BSNL రూ. 439 vs Jio రూ. 448.. తక్కువ ధర ఎక్కువ రోజుల వ్యాలిడిటీ.. సామాన్యులకు పండగే!

ఇంటికి కొత్త వైఫై కనెక్షన్ కావాలా? Airtel, Jio, BSNLలో.. అత్యంత చౌకైన ప్లాన్లు ఇవే!

ఇక నుంచి మీ కిచెన్ పని ఈజీ..డిష్ వాషర్‌పై అదిరిపోయే డిస్కౌంట్!

రూ.646కే పార్టీ వైబ్స్! దీని ఆర్జీబీ లైట్లతో మీ వైబ్ నెక్స్ట్ లెవెల్ అంతే!

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. 6 కీలక లోపాలకు పరిష్కారం, వెంటనే ఇలా అప్డేట్ చేసుకోండి!

రూ.720కే అదిరిపోయే సౌండ్ బార్‌..ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ!

యాపిల్ ఐప్యాడ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఒప్పో కొత్త మినీ టాబ్లెట్.. ధర రూ.95,000!

Big Stories

Advertisement
×