E-Paper
Advertisement

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు… ఆ రెండూ అస్సలు మిస్ అవ్వొద్దు

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు… ఆ రెండూ అస్సలు మిస్ అవ్వొద్దు
Advertisement

OTT Releases: వీకెండ్ వచ్చిందంటే కొత్త సినిమా కోసం థియేటర్‌కి వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో కొత్త కంటెంట్ చూసేయొచ్చు. ఈ వారం తెలుగు ప్రేక్షకుల కోసం ఆరు కొత్త సినిమాలు, సిరీస్లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఇందులో హారర్ కామెడీ ఉంది.. మ్యూజికల్ సిరీస్ ఉంది.. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే కథ కూడా ఉంది. అయితే ఈ లిస్ట్‌లో ‘కొరియన్ కనకరాజు’, ‘జ్ఞాపకాలు’ మాత్రం కాస్త ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇంతకీ ఈ వారం ఏయే కొత్త సినిమాలు, సిరీస్లు వచ్చాయంటే..

1. కొరియన్ కనకరాజు (Korean Kanakaraju)

వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘కొరియన్ కనకరాజు’ ఇప్పటికే థియేటర్లలో సందడి చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ అమ్మాయితో ప్రేమలో పడిన కనకరాజు జీవితంలోకి అనుకోకుండా ఓ మిస్టరీ వస్తువు రావడం.. దాంతో పాటు ఓ ఆత్మ అతడిని ఆవహించడం కథలో అసలు ట్విస్ట్. అక్కడి నుంచి అతడి జీవితంలో హారర్‌తో పాటు కామెడీ కూడా మొదలవుతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో చూడొచ్చు.

2. జగమే సంగీతం (Jagamae Sangeetham)

Advertisement

సంగీతం చుట్టూ అల్లుకున్న కథలను ఇష్టపడేవాళ్ల కోసం వచ్చిన సిరీస్ ‘జగమే సంగీతం’. ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, సంగీతం.. ఈ మూడు అంశాలను కలుపుతూ కథ సాగుతుంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా, రూప లక్ష్మి, మధుబాల, శ్రీఖాంత్ తదితరులు నటించారు. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది.

3. పళ్లబురుసు (Pallaburusu)

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మరో తెలుగు సినిమా ‘పళ్లబురుసు’. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో చూడొచ్చు. కొత్తగా ఏదైనా తెలుగు సినిమా చూడాలనుకునేవాళ్లు ఈ మూవీని కూడా వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు.

4. వదల (Vadhala)

Advertisement

శ్రీకాంత్ హీరోగా నటించిన ‘వదల’ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ విన్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్, ఎమోషనల్ అంశాలతో సాగే ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో చూడొచ్చు.

5. ఆకలి రాజ్యం సీజన్ 1 (Aakali Rajyam)

ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ‘ఆకలి రాజ్యం’ సిరీస్‌లో మరో మూడు ఎపిసోడ్లు వచ్చేశాయి. సీజన్ 1లోని 4 నుంచి 6వ ఎపిసోడ్స్ తాజాగా ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగు ఒరిజినల్‌గా రూపొందిన ఈ సిరీస్ తమిళంలోనూ అందుబాటులో ఉంది. మొదటి మూడు ఎపిసోడ్స్ చూసినవాళ్లకు ఇప్పుడు కథలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ కొత్త ఎపిసోడ్స్ చూడాల్సిందే.

6. జ్ఞాపకాలు (Gnyapakalu)

కుటుంబ బంధాలు, ప్రేమ, చిన్ననాటి జ్ఞాపకాల చుట్టూ తిరిగే ఫీల్‌గుడ్ మూవీ ‘జ్ఞాపకాలు’. ఈటీవీ విన్‌లో సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ‘కథా సుధ – సండే స్టోరీస్’ ఆంథాలజీలో 73వ కథగా వచ్చింది. కుటుంబంతో కలిసి చూడగలిగే ఎమోషనల్ కంటెంట్ కోసం చూస్తున్నవాళ్లకు ఇది మంచి ఆప్షన్.

మొత్తంగా ఈ వారం ఓటీటీలో తెలుగు కంటెంట్‌కు కొదవ లేదు. హారర్ కామెడీ కావాలంటే ‘కొరియన్ కనకరాజు’… కుటుంబ అనుబంధాలతో కూడిన కథ కావాలంటే ‘జ్ఞాపకాలు’… సిరీస్‌లు ఇష్టపడితే ‘జగమే సంగీతం’, ‘ఆకలి రాజ్యం’ ఆప్షన్ లో ఉన్నాయి. మీ వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో ఇందులో ఎన్ని ఉన్నాయో చూసుకోండి.

Read Also: కుప్పలు తెప్పలుగా వచ్చి పడే భారీ అనకొండలు… ప్రాణాల కోసం పరుగులు… ఊపిరి బిగపట్టించే మాన్స్టర్ థ్రిల్లర్

Related News

జగపతిబాబు షోలో బాలయ్య రహస్యాలు రివీల్ చేసిన నారా లోకేష్!

ప్రేమ కోసం షోలోకి… కెమెరాలు ఆగాక వాళ్ల బంధాలు ఏమయ్యాయి ? క్రేజీ కొరియన్ సిరీస్

చక్రవర్తి సింహాసనానికే ఎసరు పెట్టే నింజాలు… ఒక్క సీక్రెట్ బయటకొస్తే బ్లడీ బ్లడ్ బాత్… యాక్షన్ తో ఇరగదీస్తున్న సిరీస్

సముద్రంలో చిక్కుకున్న అన్నదమ్ములు… ముంచేయడానికి దూసుకొచ్చే పెను తుఫాను… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

సైంటిస్ట్‌ గా మారిన గొర్రె… ప్రయోగం బెడిసికొట్టి ఊర్లోకి వచ్చే భయంకరమైన మృగం… హాలోవిన్ అంతా రచ్చ రచ్చ

36 ఏళ్ల క్రితం మాయమైన తండ్రి శవం ప్రత్యక్షం… గతం తవ్వితే బయటపడే భయంకర నిజాలు… హర్రర్ మిస్టరీ థ్రిల్లర్

ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లి… మాజీ లవర్ ఎంట్రీతో ట్విస్ట్… లవర్స్ డోంట్ మిస్

డిన్నర్‌ పార్టీలో బయట పడే రహస్యాలు… ఇలాంటి భార్యభర్తలను ఎక్కడా చూసుండరు మావా

Big Stories

Advertisement
×