E-Paper
Advertisement

పవన్ తో పెళ్లిపై రీతూ చౌదరి క్లారిటీ!

పవన్ తో పెళ్లిపై రీతూ చౌదరి క్లారిటీ!
Advertisement

Rithu Chowdary: సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి ఇటు జబర్దస్త్(Jabardasth ) లో లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది రీతూ చౌదరి (Rithu Chowdary). బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగుపెట్టిన తర్వాత ఈమె క్రేజ్ అనూహ్యంగా పెరిగిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా డెమోన్ పవన్(Demon Pawan) తో లవ్ లో పడింది అంటూ పలు వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. పైగా బిగ్ బాస్(Bigg Boss 9)హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి షోలలో కూడా సందడి చేస్తున్నారు. వీడియోలు, రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటే.. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని , పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారు అంటూ పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో సడన్గా వీరిద్దరూ పెళ్లి బట్టల్లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా రీతు చౌదరి స్పందించింది.

సడన్గా పెళ్లి బట్టల్లో దర్శనమిచ్చిన రీతూ చౌదరి – డెమోన్ పవన్..

తాజాగా వీరిద్దరూ కలసి బంగారం అనే ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ సాంగ్ కి అటు సోషల్ మీడియాలో కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ఈ పాటలో డెమోన్, రీతు చౌదరి స్క్రీన్ ప్రజెంట్స్ అందరినీ బాగా ఆకట్టుకుంది. కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది. సోషల్ మీడియాలో, అటు యూట్యూబ్ లో ఎక్కడ చూసినా సరే ఈ బంగారం పాటకు మంచి రెస్పాన్స్ కూడా లభిస్తూ ఉండడం గమనార్హం. ఈ పాటలో వీళ్ళిద్దరూ ప్రేమికులుగా కనిపించడం, ఆ తర్వాత పెళ్లి బట్టలలో కనిపించడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రూమర్లు మొదలయ్యాయి. అయితే ఇదే విషయంపై తాజాగా రీతు చౌదరి స్పందిస్తూ డెమోన్ పవన్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

also read:లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న హీరో శ్రీకాంత్!

పవన్ తో పెళ్లికి సిద్ధమైన రీతూ చౌదరి?

బంగారం ఆల్బమ్ సాంగ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న రీతూ చౌదరికి..” మీరిద్దరూ కలసి చేసే వీడియోలు చూస్తే చాలామంది నిజంగానే మీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకుంటున్నారు. అటు కామెంట్ సెక్షన్లో కూడా రీతూ చౌదరి- డెమోన్ పవన్ పెళ్లి ఎప్పుడు? అని అడుగుతున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి?” అంటూ ప్రశ్నించింది యాంకర్. దీంతో రీతూ చౌదరి మాట్లాడుతూ.. “తెరపై కనిపించిన జంటలు నిజజీవితంలో భాగస్వాములు కావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా సమయం పడుతుంది. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యం. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అటు అన్ని విషయాలలో కూడా అభిప్రాయం ఒకే విధంగా ఉండాలి. అప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు.

మమ్మల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి – రీతూ చౌదరి

Advertisement

అయితే ప్రస్తుతం మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము. మంచి స్నేహితులం అయ్యాము. కలసి మంచి మంచి ప్రాజెక్టులు చేస్తున్నాము. ఇక మీరు కూడా మమ్మల్ని ఇలాగే ప్రేమిస్తూ, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక పెళ్లి గురించి అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఆలోచన, నిర్ణయం లేదు “అంటూ రీతూ చౌదరి క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే రీతూ చౌదరి షేర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×