E-Paper
Advertisement

దేశంలో ఫాస్టెస్ట్ వందే భారత్ రైళ్లు ఇవే.. సికింద్రాబాద్– విశాఖ ఎక్స్ ప్రెస్ స్పీడ్ ఎంతో తెలుసా?

దేశంలో ఫాస్టెస్ట్ వందే భారత్ రైళ్లు ఇవే.. సికింద్రాబాద్– విశాఖ ఎక్స్ ప్రెస్ స్పీడ్ ఎంతో తెలుసా?
Advertisement

Fastest Vande Bharat Trains: భారతీయ రైల్వేలో వందేభారత్ రైళ్లు సరికొత్త మైలురాయిగా నిలిచాయి. ఈ రైళ్లు దేశంలో వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాలను అందిస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని చేరుకునేలా రూపొందించిన ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఢిల్లీ, ముంబై, సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖ లాంటి ప్రధాన నగరాలను కలుపుతూ పలు మార్గాల్లో ఇవి నడుస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం..

1.న్యూ ఢిల్లీ – వారణాసి వందే భారత్

దేశ రాజధాని ఢిల్లీ నుంచి పవిత్ర క్షేత్రమైన వారణాసికి వెళ్లే ఈ రైలు అత్యంత వేగవంతమైన సర్వీసుల్లో ఒకటి. ఉదయం 6 గంటలకు బయలుదేరి సుమారు 771 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల్లో పూర్తి చేస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు వారణాసి చేరుకుంటుంది. సగటు వేగం గంటకు సుమారు 95 కిలోమీటర్లు కాగా, గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

2.న్యూ ఢిల్లీ – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా

Advertisement

వైష్ణో దేవి దర్శనానికి వెళ్లే భక్తులకు ఈ రైలు బెస్ట్ ఆప్షన్. ఉదయం 6 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 655 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 8 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. మధ్యాహ్నం 2.20 గంటలకు కత్రా చేరుకుంటుంది. సగటు వేగం గంటకు దాదాపు 79 కిలోమీటర్లు.

3.ముంబై సెంట్రల్ – గాంధీనగర్ క్యాపిటల్

మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను కలిపే ఈ రైలు ఉదయం 6.10 గంటలకు ముంబై నుంచి బయలుదేరుతుంది. సుమారు 522 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటల 25 నిమిషాల్లో పూర్తి చేసి మధ్యాహ్నం 12.35 గంటలకు గాంధీనగర్ చేరుతుంది. సగటు వేగం గంటకు 81 కిలోమీటర్లు కాగా, గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

4.సికింద్రాబాద్ – విశాఖపట్నం

Advertisement

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణించే వారికి ఈ వందే భారత్ ఎంతో ఉపయోగపడుతోంది. ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 699 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 8 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు సగటు వేగం గంటకు 79 నుంచి 82 కిలోమీటర్ల మధ్య ఉంటుంది.

5.కోయంబత్తూరు – బెంగళూరు కంటోన్మెంట్

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి ఈ రైలు అనుకూలంగా ఉంటుంది. ఉదయం 7.25 గంటలకు కోయంబత్తూరు నుంచి బయలుదేరి 377 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 6 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. మధ్యాహ్నం 1.45 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుతుంది.

6.పాట్నా – హౌరా

బీహార్,  బెంగాల్ రాష్ట్రాలను కలిపే ఈ వందే భారత్ రైలు కూడా అత్యంత వేగంగా నడిచే సర్వీసుల్లో ఒకటి. ఉదయం 6 గంటలకు పాట్నా నుంచి బయలుదేరి 532 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 35 నిమిషాల్లో పూర్తి చేసి ఉదయం 11.35 గంటలకు హౌరా చేరుకుంటుంది. సగటు వేగం గంటకు 78 నుంచి 81 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

7.జోధ్‌పూర్ – ఢిల్లీ కంటోన్మెంట్

రాజస్థాన్ నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు వేగవంతమైన సేవ అందిస్తోంది. ఉదయం 5.30 గంటలకు జోధ్‌పూర్ నుంచి బయలుదేరి సుమారు 606 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల్లో పూర్తి చేస్తుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ కంటోన్మెంట్ చేరుకుంటుంది. ఈ మార్గంలో రైలు సగటు వేగం గంటకు 75 కిలోమీటర్లు.

8.మైసూరు – చెన్నై సెంట్రల్

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి ఈ రైలు వేగవంతమైన సౌకర్యాన్ని అందిస్తోంది. ఉదయం 6 గంటలకు మైసూరు నుంచి బయలుదేరి సుమారు 500 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైలు సగటు వేగం గంటకు 76 నుంచి 79 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

Read Also: బుల్లెట్ ట్రైన్ హబ్‌గా శంషాబాద్‌.. ఏకంగా మూడు కారిడార్ల నిర్మాణం!

Tags

Related News

రైలులో టీ తాగుతున్నారా? ఒక్కక్షణం ఆలోచించండి.. ఈ వీడియో చూడండి బ్రో, మీకే తెలుస్తుంది?

ఈ రోడ్లు ఉంటాయ్ భయ్యా.. నా భూతో నా భవిష్యత్.. లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

టైటానిక్ మునిగిపోతుందని 14 ఏళ్ల ముందే తెలుసా? ఆ నవలలో ఉన్నట్టే అక్షరాలా జరిగిందా?

మనసు దోచేసే ప్రకృతి అందాలు.. ఆగస్టులో 5 అద్భుత పర్యాటక ప్రాంతాలు ఇవే

బుల్లెట్ ట్రైన్ హబ్‌గా శంషాబాద్‌.. ఏకంగా మూడు కారిడార్ల నిర్మాణం!

ఇండియా నుంచి చైనా, భూటాన్ వరకు రైళ్లు.. డోక్లాంలో రైల్వే ట్రాక్‌కు లైన్ క్లియర్!

ఐఆర్‌సిటిసి జపాన్ టూర్.. హ్యాపీగా 10 రోజులు ఎంజాయ్ చేయండి గురూ!

Big Stories

Advertisement
×