E-Paper
Advertisement

లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న హీరో శ్రీకాంత్!

లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న హీరో శ్రీకాంత్!
Advertisement

Srikanth:ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో శ్రీకాంత్ (Srikanth)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోగా మారి 100కు పైగా చిత్రాలలో నటించిన ఈయన.. ఈ మధ్యకాలంలో మళ్లీ విలన్ గా మారి సెకండ్ ఇన్నింగ్స్ లో పలు చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్న శ్రీకాంత్.. తాజాగా లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి శ్రీకాంత్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? అసలు ఏమైంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.

90’స్ రోజులను గుర్తుచేసిన చిన్నారి..

ఇటీవల కాలంలో కొన్ని కామెడీ షోలు కేవలం ఆడియన్స్ ను నవ్వించడమే కాకుండా నాటి రోజులను గుర్తు చేసి ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అందుకే కాబోలు కామెడీ షోలు ఈమధ్య ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి కేవలం కామెడీని మాత్రమే నమ్ముకోకుండా జ్ఞాపకాలను నెమరు వేసే వేదికగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న హీరో శ్రీకాంత్.. చిన్నారి ప్రణీత్ చేసిన స్కిట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే..ఆ పర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. హీరో శ్రీకాంత్, డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi), ప్రముఖ హీరోయిన్ రోజా(Roja) లతో కలసి జడ్జిగా వ్యవహరిస్తున్న షో ‘డ్రామా జూనియర్స్’.. చిన్న పిల్లలు ఇందులో వేసే స్కిట్స్ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం అందరి చేత కన్నీళ్లు పెట్టించారు. డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రణీత్ స్కిట్ ప్రోమో విడుదలవ్వగా.. అందులో ఒక చిన్నారి 90’స్ రోజులను గుర్తు చేస్తూ చేసిన స్కిట్ కి చూసే ఆడియన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు..

కన్నీళ్లు పెట్టుకున్న హీరో శ్రీకాంత్..

Advertisement

డ్రామా జూనియర్స్ నుంచి విడుదలైన లేటెస్ట్ ఎపిసోడ్ స్కిట్ ప్రోమో విషయానికి వస్తే.. కంటెస్టెంట్ ప్రణీత్ 90’స్ నోస్టాల్జియా (గత తాలూకు మధురమైన క్షణాలను గుర్తు చేసుకున్నప్పుడు కలిగే బాధ) పేరుతో ఒక స్కిట్ చేశాడు. “నేనండి 90′ స్ కిడ్ ను.. మిమ్మల్ని మీకు మళ్లీ గుర్తు చేయడానికి వచ్చాను అంటూ అప్పట్లో వీధి దీపాల కింద చదువుకున్న రోజులను, లైట్ లాంతరును , బొంగరాలను చూపించి మళ్లీ నాటి రోజులను గుర్తు చేశాడు ప్రణీత్. ఇది డిబ్బి ఇందులో రూపాయి రూపాయి కూడబెట్టుకుని లక్షాధికారులు అవ్వాలి అనుకుంటాం.. కానీ ఐదు రూపాయలు పోగు అవ్వగానే పగలగొట్టేసి ఐస్క్రీం కొనితింటాం అంటూ ఆ రోజులను గుర్తు చేశాడు.

నాటి రోజులను గుర్తు చేసుకున్న రోజా , శ్రీకాంత్..

దీన్ని కాయిన్ బాక్స్ అంటారు అని ప్రణీత్ చెప్పగానే.. రోజా అందుకొని.. కాయిన్ బాక్స్ చూడగానే నేను , శ్రీకాంత్ సీతారత్నం గారి సినిమా చేసేటప్పటి రోజులు గుర్తొచ్చాయని రోజా చెబుతుంటే..ఎప్పుడూ నువ్వే కదా మాట్లాడే దానివి పైగా అప్పుడు లవ్ లో ఉన్నావు కదా అంటూ ఝలక్ ఇచ్చాడు. అప్పట్లో అందరికీ ఆల్మోస్ట్ ఒకే హెయిర్ స్టైల్ ఉండేది పక్క పాపిడి అని, అలాగే వీధికి ఒక టీవీనే ఉండేది, అక్కడ టీవీలో సినిమా చూడడానికి కాదు మనుషుల మధ్య అనురాగాలు పెంచుకోవడానికి అక్కడికి వచ్చేవాళ్ళం అంటూ నాటి రోజులను ఒక్కొక్కటిగా చెబుతూ అందరికీ గుర్తు చేశారు ప్రణీత్.

Advertisement

ALSO READ: రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో గోల్డెన్ ఆఫర్!

నేటి బాల్యం ఏం మిస్ అవుతోందో తెలుసా?

దీంతో నాటి రోజులను గుర్తు చేసుకొని.. షోకి వచ్చిన కిడ్స్ తల్లిదండ్రులతో పాటు జడ్జెస్ స్థానంలో ఉన్న అనిల్ రావిపూడి, రోజా, శ్రీకాంత్ అటు హోస్ట్ గా ఉన్న సుధీర్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఆడియన్స్ కి కూడా కన్నీళ్లు వచ్చాయి. మొత్తానికి అయితే నేటి బాల్యం ఏం మిస్ అవుతుందో చూపించే ఈ స్కిట్ చాలా అద్భుతంగా ఉంది అంటూ శ్రీకాంత్ కొనియాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర నటి?

సుధీర్ ది రియల్ హెయిర్ కాదా?విగ్గా? బయటపడ్డ నిజం!

ముగిసిన ‘లాక్ అప్ 2’.. విన్నర్ ఎవరు? ట్రోఫీ, రూ.1 కోటి నగదుతో పాటూ?

Karthika Deepam 2 jyo : కార్తీక దీపం విలన్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. ఇంట్లోంచి గేంటేసిన ప్రభావతి.. పాపం రోహిణి..

Podarillu Today Episode : మాధవ్ మిస్సింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. పోలీస్ మాటతో చక్రీ ఫైర్..

Big Stories

Advertisement
×