Telugu Serial: తెలుగు టీవీ చానల్స్ సినిమాలను మాత్రమే కాదు.. సీరియల్స్ ను కూడా ప్రసారం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో టీవీ సీరియల్స్ ఒకటికి మించి మరొకటి ఉంటూనే ఉన్నాయి.. కొన్ని సీరియల్స్ ఎమోషనల్ గా కట్టిపడేస్తే.. మరికొన్ని సీరియల్స్ మాత్రం ప్రేక్షకులను వేరే లోకానికి తీసుకెళుతున్నాయి. అదేంటి సినిమాలకు మించి సాహిత్యం చెప్తున్నారనుకుంటున్నారా? అవునండి ఈమధ్య సీరియల్స్ సినిమాలను మించి ఉండటం విచిత్రం.. మొన్నటి వరకు ఫైట్ సీన్లు మాత్రమే సీరియల్స్లలో కనిపించేవి.. కానీ ఈ మధ్య సినిమాలను మించిన రొమాంటిక్ సన్నివేశాలు సీరియల్స్లలో కనిపించడంతో యూత్ కూడా సీరియల్స్ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. తాజాగా ఓ సీరియల్ కి సంబంధించిన రొమాంటిక్ సీన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇంతకీ ఆ సీరియల్ ఏంటో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
‘ఉల్లు’ ను మించేలా సీరియల్ సీన్లు..
ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించే సీరియల్స్ కాస్త.. ఇప్పుడు యూత్ని ఆకట్టుకునే ప్రయత్నంలో సినిమాలను మించేలా రొమాంటిక్ సీన్లతో దర్శనమిస్తున్నాయి.. నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ తెలుగు సీరియల్స్లలో రొమాంటిక్ సన్నివేశాలు ఉండడం కొందరిని ఆశ్చర్యానికి గురిచేసిన కూడా.. మరికొందరిని మాత్రం ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మేఘసందేశం సీరియల్ లోని భూమి, గగన్ మధ్య ఆటోలో ఒక సీన్ ఉంటుంది. అది కాస్త చూసే ప్రేక్షకులకు రొమాన్స్ ఎక్కువైందని అనిపించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తూ ఉల్లు మించిపోయేలా సీన్లు ఉన్నాయని కామెంట్లతో రచ్చ చేస్తున్నాయి.. ఆ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుందో లేదో గానీ సీన్ మాత్రం చర్చనీయాంశంగా మారింది.
Also Read:ప్రభావతికి షాకిచ్చిన మీనా.. గెలికిన శోభా..మీనాకు రోహిణి ఐడియా..
‘మేఘసందేశం’ సీరియల్ స్టోరీ..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగులో కొత్త కంటెంట్ సినిమాలు ఎక్కువగా ప్రసారం అవుతాయి. ఒక దాన్ని మించిన స్టోరీ మరొకటి ఉంటుంది. కథ నెలలో కొత్త సీరియల్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో జూన్ నెల నుంచి ‘మేఘసందేశం’ సీరియల్ ప్రసారం అవుతుంది. అద్భుతమైన స్టోరీతో మొదటి రోజు నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరింత ఆసక్తికరమైన కథాంశంతో జీ తెలుగు డైలీ సీరియల్ మేఘసందేశం తెలుగు ప్రేక్షకులకు చక్కటి వినోదంతోపాటు ఎమోషన్స్‌తో కట్టిపడేస్తుంది. అగ్నిప్రమాదంలో తల్లిని కోల్పోయిన భూమి చెత్తకుండిని చేరగా, తండ్రి చేసిన మోసంతో తండ్రి ప్రేమకు దూరంగా పెరుగుతాడు గగన్. వైవిధ్యమైన నేపథ్యాల నడుమ భిన్న ధ్రువాలైన భూమి, గగన్ల జీవితాలు ఎలా ముడిపడ్డాయనేదే మేఘసందేశం సీరియల్ కథాంశం.. వీరిద్దరి మధ్య ప్రేమ పుడుతుందో లేదో అన్న కథతో ఈ సీరియల్ మొదలైంది.. ప్రస్తుతం ఈ రొమాంటిక్ సీన్ వీడియో వైరల్ అవ్వడంతో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని తెలుస్తుంది. మరి త్వరలోనే పెళ్లి చేసుకుంటారు ఏమో చూడాలి.. ఈ సీరియల్ రొమాంటిక్ సీన్ వీడియో ఇక్కడ ఉంది ఒకసారి చూసేయ్యండి..
మన తెలుగు సీరియల్స్ లో ఉండే ఆ మాధుర్యమే వేరు 😍😍👌👌 pic.twitter.com/3nXHQCWSEW
— WX (@winsttonxavier) July 26, 2025