Gundeninda GudiGantalu Today episode july 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా నటింట్లో పువ్వులు కట్టడం చూసిన ప్రభావతి షాక్ అవుతుంది. శృతి మాత్రం ఆ పువ్వుల వాసనకి మైమరిచిపోతుంది. అయితే ప్రభావతి శృతిని మీనాని చూస్తూ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత బాలు కిందకు వస్తాడు. లక్షవతి ఎక్కడ అని అడుగుతాడు. ఇప్పుడే లోపలికి వెళ్ళింది అనగానే బాలు మీనా తో సరసాలు మొదలు పెడతాడు. మీనా కావాలని పెట్టి చేయడంతో బాలు నేను వెళ్ళిపోతాను అని అంటాడు. చివరికి మీనా లాగడంతో బాలు మీనా మీద పడిపోతాడు. ఇద్దరి మధ్య మల్లెపూలు పడడంతో రొమాన్స్ జరుగుతుంది. ఆ సీన్ హైలెట్ గా నిలుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. మీనా పూలు ఇవ్వాలని బయటకు వెళ్తుంది. ప్రభావతి ఆపి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. వేరే వాళ్లకు పూలు ఇవ్వాల్సింది ఉంది ఇచ్చేసి వస్తాను అని అంటుంది.. ఫ్రిజ్లో ఉండాల్సిన కూరగాయలు బయటపెట్టి పువ్వులని ఫ్రిజ్ నిండా నింపేస్తావా అని ప్రభావతి అడుగుతుంది. వాడి పోకూడదు కదా అత్తయ్య అందుకే అక్కడ పెట్టాను అని మీనా అంటుంది.. నేను బయటికి వెళ్లి వస్తాను మీరు వంట చూస్తూ ఉండండి అని చెప్పి నేను బయటకి వెళ్ళిపోతుంది మీనా.. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ అని ప్రభావతి అడుగుతుంది. పూలు ఆర్డర్ ఇచ్చారు ఒక నలుగురికి పువ్వులు ఇచ్చి రావాలి అని అంటుంది.
అప్పుడే ఇంట్లోకి శృతి వాళ్ళమ్మ శోభ వస్తుంది. మీ కూతుర్ని చూడ్డానికి వచ్చారా అని ప్రభావతి కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఇటు వెళ్తున్నాను ఒకసారి చూసి వెళదామని వచ్చాను అని శోభ అంటుంది. శోభా ప్రభావతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక ఆవిడ పులమ్మాయి అని గట్టిగా అరుస్తుంది. పూలమ్మాయి ఏంటి మీనా అని పిలవాలి గాని అని అడుగుతుంది.. మీనా లేదు బయటికి వెళ్ళింది మళ్లీ రేపు అని అరుస్తుంది. మీన లేకుంటే మీరు ఉన్నారు కదా మీరు ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది. ప్రభావతి అమ్మాయికి అడిగినట్లుగా పూలు ఇస్తుంది.
శోభ మీరే పువ్వులు కూడా ఇస్తున్నారా అని ఈ 200 తీసుకొని నాకు పువ్వులు ఇవ్వండి అని అడుగుతుంది. శోభ వల్ల తనకు అవమానం జరిగిందని ప్రభావతి ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ మీద వల్ల నాకు అవమానాలు ఎదురవుతున్నాయి అని బాధపడుతూ ఉంటుంది. అత్తయ్యకు బాగా కాలినట్టుంది. ఏమైనా కాస్త ఫైర్ చేస్తే నా మేటర్ గురించి మర్చిపోతుందని రోహిణి ప్లాన్ చేస్తుంది.. ఈవిడని వదిన గారు అని మర్యాదగా పిలుస్తుంటే నన్ను పూల అమ్ముకునే దాన్ని చేస్తుందా అని ప్రభావతి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంకెప్పుడూ పువ్వులు కావాలనుకున్న ఇక్కడికే వస్తానని చెప్పిన మాటని తలుచుకొని ప్రభావతి మండిపడుతూ ఉంటుంది.
శృతి రవి బయటకు రాగానె శోభ ఎదురుగా వస్తుంది. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇస్తుంది. అది సరేగాని ఈ పూలే ఏంటి అని అడిగితే మీ అత్తయ్య పూలను ఇచ్చింది అన్నది. మా అమ్మ చెప్పింది మీరు మీనాకు ఇలాగే సహాయంగా ఉంటే బాగుంటుంది అని సలహా ఇచ్చి వెళ్తుంది.. అక్కడే ఉన్న రోహిణి ఈ పూల కొట్టు నువ్వు తీసేసి ఒక ఐడియా నా దగ్గర ఉంది ఆంటీ అని అంటుంది. ఏంటమ్మా ఐడియా ని ప్రభావతి అడుగుతుంది.
Also Read :బాపురే.. జ్యోతి రాయ్ రొమాంటిక్ వీడియో.. మెంటలెక్కిస్తుంది మామా..
కార్పొరేషన్ వాల్ల పర్మిషన్ తీసుకోవాలి. వీళ్లు తీసుకోలేదనుకుంటా మనము వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఆ షాప్ ని తీసేస్తారు అని అంటుంది. అది విన్న ప్రభావతి సంతోషపడుతుంది. పూల కొట్టు పోతుంది మీనా నా గుప్పెట్లో ఉంటుంది అని కలలు కంటుంది.. మీనా నీకు ఇక ముందు ఉంటుంది. అప్పుల కొట్టు చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావు. దాన్నే లేకుండా చేసేస్తా అని ప్రభావతి సంతోషపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..