E-Paper
Advertisement

ICC WTC Points Table : 4వ టెస్ట్ డ్రా… WTC పాయింట్స్ టేబుల్ లో టీమిండియా ప్లేస్ ఎక్కడంటే

ICC WTC Points Table : 4వ టెస్ట్ డ్రా… WTC పాయింట్స్ టేబుల్ లో టీమిండియా ప్లేస్ ఎక్కడంటే
Advertisement

ICC WTC Points Table :  మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ను తొలుత ఇంగ్లాండ్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ టీమిండియా ఆటగాళ్లు పోరాడటంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. టీమిండియా డ్రా చేసుకోవడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లను సంపాదించి 16 పాయింట్లకి చేరుకుంది. 2025-27 స్టాండింగ్స్ లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ నాలుగు పాయింట్ల సంపాదించినప్పటికీ.. లార్డ్స్ లో స్లో ఓవర్ రేట్ కి రెండు పాయింట్లు పెనాల్టీ కారణంగా మూడో స్థానానికి పడిపోయింది. దీంతో వెస్టిండీస్ పై 3-0 సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా జట్టు ఆధిక్యం కనబరుస్తోంది. న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా ఇంకా ఆడలేదు. జట్లు గెలుపొందితే 12 పాయింట్లు.. డ్రా అయితే నాలుగు, టై అయితే పాయింట్లు సంపాదిస్తాయి. మొదటి రెండు జట్లు జూన్ 2027లో లార్డ్స్ లో జరిగే WTC ఫైనల్ కి చేరుకుంటాయి.

Also Read :  Shubman Gill : డ్రా విషయంలో వివాదం… గిల్ షాకింగ్ కామెంట్స్

Advertisement

ఆస్ట్రేలియా టాప్.. టీమిండియా ఎన్నో స్థానమంటే..? 

ఆస్ట్రేలియా జట్టు మొత్తం 3 మ్యాచ్ లు ఆడితే మూడు మ్యాచ్ లో గెలిచింది. 36 పాయింట్లతో టాప్ ప్లేస్ లో దూసుకెళ్తోంది. శ్రీలంక జట్టు 2 మ్యాచ్ లు ఆడితే 1 మ్యాచ్ లో విజయం సాధించగా.. మరో మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీంతో 16 పాయింట్లతో పాటు 66.67 శాతం తో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ జట్టు 4 మ్యాచ్ లు ఆడితే కేవలం 2 మ్యాచ్ ల్లోనే విజయం సాధించింది. 1 మ్యాచ్ లో ఓటమి పాలైంది. మరో మ్యాచ్ డ్రా ముగిసింది. దీనికి తోడు స్లో ఓవర్ రేట్ కి రెండు పాయింట్లు ఫెనాల్టీ కారణంగా మూడో స్థానానికి పడిపోయింది. ఇక టీమిండియా 4 మ్యాచ్ లు ఆఢితే.. కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించి.. మరో మ్యాచ్ ని డ్రా గా ముగిసింది. 2 మ్యాచ్ లను ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో భారత్ 16 పాయింట్లతో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్ లు ఆడితే 1 మ్యాచ్ లో ఓటమి చెంది.. మరో మ్యాచ్  డ్రా అయింది. దీంతో బంగ్లాదేశ్ కి కేవలం 16 పాయింట్లు మాత్రమే లభించాయి. వెస్టిండిస్ జట్టు ఆస్ట్రైలియా పై మూడు మ్యాచ్ లు ఆడితే.. మూడు మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది.

Advertisement

చివరి స్థానంలో వెస్టిండీస్.. 

దీంతో వెస్టిండీస్ జట్టు పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 7వ స్థానంలో కొనసాగుతుంది. ఇక న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ జట్లు కూడా టెస్ట్ సిరీస్ ఆడితే.. పాయింట్ల పట్టిక తారు మారు అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆస్ట్రేలియా జట్టు మాత్రం మంచి ఊపులో కొనసాగుతోంది. టీమిండియా మరో మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధిస్తే.. టీమిండియా ఒక స్థానం ఎగబాకే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంక కంటే కూడా మెరుగయ్యే అవకావం లేకపోలేదు. టీమిండియా ఓటమి పాలైతే మాత్రం పాయింట్ల పట్టికలో కాస్త వెనుకంజ అయ్యే అవకాశం ఉంది. టీమిండియా విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

Big Stories

Advertisement
×