E-Paper
Advertisement

Satyabhama Today Episode : డీఎన్ఏ పరీక్షకు ఒప్పుకోని మహాదేవయ్య.. అసలు తండ్రి ఎవరో తెలుసుకున్న క్రిష్..

Satyabhama Today Episode : డీఎన్ఏ పరీక్షకు   ఒప్పుకోని మహాదేవయ్య.. అసలు తండ్రి ఎవరో తెలుసుకున్న క్రిష్..
Advertisement

Satyabhama Today Episode November 24 th : నిన్నటి ఎపిసోడ్ లో.. భైరవిని క్రిష్ నీళ్ళు కావాలని అడుగుతాడు కానీ భైరవి పోయి నీ ముద్దుల పెళ్ళాన్ని అడిగి తీసుకొని నీళ్లు తాగు అని పంచులు వేస్తుంది. ప్రతి దానికి పెళ్ళాం పెళ్ళాం అని పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతావు నీళ్లు కూడా నీ పెళ్ళాన్ని అడిగి తీసుకోపో అనేసి బైరవి అంటుంది. దీనమ్మ నీళ్లు అడిగినందుకు ఇంత లొల్లి చేస్తావా అని క్రిష్ భైరవి పై సీరియస్ అవుతుంది. అయితే పెళ్ళాం కొంగు పట్టుకోక నీ కొంగు పట్టుకోమంటావా అని క్రిష్ బైరవిన్ అంటాడు. భైరవి కూడా అదే చెప్తున్నా నీ పెళ్ళాన్ని అడిగే నీళ్లు తెచ్చుకో అనేసి అంటుంది. పంకజం కాఫీ తీసుకొని వస్తుంది. తల్లి, కొడుకులు ముచ్చట్లు పెట్టుకోవడం చూసి ఎన్నాళ్ళు అయ్యిందని కాఫీ తీసుకోండి అనగానే సత్య లేదా నువ్వు వచ్చావు అని అడుగుతాడు.. ఆ ముచ్చట్లు ఇంకా తేలక ముందే కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆమె ఇంట్లో రచ్చ చేస్తుంది.. దానికి ఇంటిల్లి పాది షాక్ అవుతారు.. గంగ ఎవరు అని చెవులు కొరుక్కుంటారు.

తర్వాత ప్రోమో విషయానికొస్తే.. గంగ ఇంట్లో అడుగు పెడుతుంది. భైరవి పెనిమిటి నిజంగానే నీకు చిన్న ఇల్లు ఉందా? నాకు తెలియకుండా ఏదైనా దాస్తున్నావా అని అంటుంది. అంతలోకే అక్కడికి పంకజం వస్తుంది. అమ్మ కొడుకులు కలిసి ఇంత ముచ్చట పెట్టుకుంటున్నారంటే ఏదో మంచి ముచ్చటే పెట్టుకున్నారని పంకజం అంటుంది. నువ్వేందే నువ్వు కూడా ఇలానే మాట్లాడుతున్నావు అని క్రిష్ అంటాడు. క్రిష్ నా బిడ్డ కదా మరి వీళ్ళకి ఎందుకు నిజం చెప్పలేదు అనేసి అడుగుతుంది. దేవయ్య అంటే శివుడితో సమానం బైరవి అంటే పార్వతి ఇక గంగంటే నేను తల మీద ఉంటానని గంగ పెద్ద స్టోరీ చెప్తుంది. దానికి మహాదేవయ్య నువ్వు గంగ అయితే నాకేంటి గోదావరి అయితే నాకేంటి ఇంతకీ నువ్వు ఎవరు అనేసి అడుగుతాడు.. ఇలా అంటావని నేను అనుకున్నాను ఇంట్లో వాళ్లకి నిజం తెలియదు కదా ఊరందరికీ నేను నీ రెండో పెళ్ళాం అని చెప్పేసేయ్ అంటుంది గంగ.. ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు నా పెళ్ళాం ఏందీ అని మహాదేవయ్య అంటాడు. గంగ గుక్క తిప్పుకోకుండా గల గల మాట్లాడుతుంది. నిజం ఏంటి అస్సలు అని క్రిష్, జయమ్మ అడుగుతారు.

Advertisement

గంగను బయటకు గెంటేస్తే బయట కూర్చొని నా బిడ్డకు నాకు న్యాయం చెయ్యండి అని సోకాలు పడుతుంది గంగ.. ఆ బండోడిని ఎలాగైనా నా దారికి తెచ్చుకుంటాను అని అంటుంది. ఇక మహాదేవయ్య అనుచరులు కూడా ఇక్కడి నుంచి పో అమ్మా మా అయ్య గురించి నీకు తెలియదు చంపేస్తాడు అని అంటారు. మీ అయ్యగారు గురించి నాకు బాగా తెలుసు. నా పక్కలో ఎలా ఉంటాడో తెలుసా అని పంచాయితీ పెడుతుంది. అందరు గంగది తప్పులేదని సమర్దిస్తారు. గంగను సపోర్ట్ చేసేందుకు మహిళా సంఘాలు కూడా ముందుకు వస్తాయి. గంటలు గడిచే కొద్ది గంగకు సపోర్ట్ పెరుగుతుంది. ఇక ఇంట్లో మహాదేవయ్య మీద భైరవికి అనుమానం మొదలవుతుంది.. నిజంగానే పెనిమిటి ఏది చేయకుంటే ఈమె ఎవరో ఎందుకు అలా అంటుంది అని ఆలోచిస్తుంది. జయమ్మను కూడా పిలిచి మీ అబ్బాయికి ఇలాంటి అలవాట్లు ఉన్నాయి కదా. ముందు నుంచే ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. కానీ దాచిపెట్టి నా గొంతుకోశారు కదా అత్తమ్మ అని భైరవి అడుగుతుంది. దానికి జయమ్మ సోఫాలో కూర్చొని నిద్ర పోయే అలవాటు లేదు. ఇప్పుడు వచ్చినట్లు ఉంది. అని అంటుంది. ఇక సత్య రేణుకలు అత్తయ్య బాధను చూసి జాలి పడతారు. ఎలాగైనా మీకు న్యాయం జరిగేలా చూస్తామని అంటారు.

ఇక గంగ విషయాన్ని మీడియాకు లీక్ చేస్తుంది సత్య.. మీడియాకు మహాదేవయ్య రెండో భార్య వచ్చింది అని   ఇంఫర్మేషన్ ఇవ్వగానే మీడియా వాళ్ళు అక్కడకు చేరుకొని అసలు నిజాలు తెలుసుకోవాలని మహాదేవయ్యకు నిజంగానే రెండో భార్య ఉందా? ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదు? రాజకీయాలకు అడ్డుగా ఉందని అనుకున్నారా. మరేదైనా కారణాల వల్ల దాచి పెట్టాడా? ఇంతకీ ఈ గంగ ఎవరు ఆ బిడ్డ మీ బిడ్డేనా అని మీడియాలో వార్తలు ఊపందుకుంటాయి. సత్య గంగ దగ్గరకు వచ్చి మామయ్య బిడ్డలను మారుస్తావని అనుకున్నా కానీ నువ్వు ఏకంగా సెకండ్ సెటప్ పెట్టావా? క్రిష్ గురించి నిజం వెతికే పనిలో ఉంటే ఆవిడ నా బిడ్డ అంటుంది. నా క్రిష్ ఎవరి బిడ్డో తెలియాలంటే డీఎన్ఏ టెస్ట్ చేయించాలని అంటుంది. కానీ మహాదేవయ్య దానికి ఒప్పుకోడు. మరి సోమవారం ఎపిసోడ్ లో అసలు నిజం తెలుస్తుందా? క్రిష్ కు నిజం తెలిసిపోతుందా? చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×