OTT Movie : యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలంటే చెవి కోసుకునే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఈ సినిమాలు చూడటానికి యూత్ ఎందుకు ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీలో లవ్ కంటెంట్ తో పాటు రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. మూవీ లవర్స్ ఈ సీన్స్ కోసం మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారు. ఇటువంటి సినిమా ఒకటి ఓటీటీ ప్లాట్ ఫామ్ ల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీ పేరు “ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్” (Friends With Benfits) ఈ మూవీలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఏకాంతంగా గడిపిన తర్వాత ఎమోషన్ గా ఫీల్ అవ్వకూడదని ఒప్పందం చేసుకుంటారు. వీళ్ళిద్దరి చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (NetFlix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
జైమీ అనే అమ్మాయి న్యూయార్క్ లో ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె చేస్తున్న కంపెనీలో ఒక వ్యక్తిని రిక్రూట్ చేస్తే బోనస్ వస్తుందని కంపెనీ వాళ్ళు జైమీకి చెప్తారు. ఈ క్రమంలో లాస్ ఏంజెల్స్ లో తనకు తెలిసిన ఒక వ్యక్తిని రిక్రూట్ చేయాలని చూస్తుంది జైమీ. ఆ హీరోని న్యూయార్క్ కి ఆహ్వానిస్తుంది. కంపెనీలో ఇంటర్వ్యూకి హెల్ప్ చేస్తూ, ఆ జాబ్ అతనికి వచ్చేలా చేస్తుంది. అయితే న్యూయార్క్ తనకు అంతగా నచ్చలేదని హీరో చెప్తాడు. అతనికి న్యూయార్క్ ఎలా ఉంటుందో తనదైన స్టైల్ లో ఆ అమ్మాయి చూపిస్తుంది. అప్పుడు హీరో జాబ్ చేయడానికి ఒప్పుకుంటాడు. వీళ్ళిద్దరూ ఒకరోజు మాటల్లో ఉండగా శృంగారం టాపిక్ వస్తుంది. శృంగారం ఎమోషన్ గా ఉండకూడదని, టెన్నిస్ ఆట ఆడినట్టు ఉండాలని హీరో చెప్తాడు. వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వస్తారు. ఏకాంతంగా గడిపిన తర్వాత ఎటువంటి రిలేషన్ ఎమోషన్ ఉండకూడదని, బైబిల్ మీద ప్రమాణం చేసుకుంటారు. అలాగే వీళ్లు ఏకాంతంగా గడుపుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఒకరోజు నాకు బాయ్ ఫ్రెండ్ కావాలంటూ జైమీ హీరోతో ఏకాంతంగా గడపడానికి ఒప్పుకోదు. జైమీ మరొక బాయ్ ఫ్రెండ్ తో కొద్దిరోజులు తిరుగుతుంది. అతడు కూడా నాకు రిలేషన్ ఇష్టం ఉండదు, ఏకాంతంగా గడపడం ఇష్టం అని చెప్తాడు. ఈ విషయం హీరోకి చెప్పగా బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడులే అని సర్ది చెప్తాడు. ఒకరోజు లాస్ ఏంజెల్స్ కి వెళ్తున్న హీరో తనని కూడా ఇన్వైట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ లాస్ ఏంజెల్స్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో సరదాగా గడుపుతారు. రాను రాను జైమీకి హీరో పై ప్రేమ పుడుతుంది. హీరో మాత్రం ఆ పనికి ఓకే కానీ బాయ్ ఫ్రెండ్ గా ఉండనని చెప్తాడు. చివరికి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారా? హీరోకి జైమీ పై ప్రేమ పుడుతుందా? చివరి వరకు వీళ్లు ఏకాంతంగానే గడుపుతూ ఉంటారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.