BigTV English
Advertisement

Seethe Ramudi katnam Serial: సీతే రాముడి కట్నం సీరియల్ ఈరోజు ఎపిసోడ్

Seethe Ramudi katnam Serial: సీతే రాముడి కట్నం సీరియల్ ఈరోజు ఎపిసోడ్
Seethe Ramudi katnam Serial Today September 12th Episode : విద్యాదేవి ఫోన్ మాట్లాడటం చూసిన సీత వచ్చి ఎవరితో మాట్లాడారని అడుగుతుంది. మీ నాన్నతో మాట్లాడానని చెప్తుంది విద్యాదేవి.  మా నాన్నతో ఏం మాట్లాడారని అడుగుతుంది. ఏం లేదని ఆయన నన్ను చెల్లిలా చూసుకుంటున్నారు. అందుకే ఇక్కడికి వచ్చి రాఖీ కట్టించుకుని వెళ్లారు. అందుకే మాట్లాడుతున్నాను. ఎందుకు అడుగుతున్నావు అంటూ నిలదీస్తుంది విద్యాదేవి. ఇంకేమైనా కొత్తగా విన్నావా? అని అడుగుతుంది. నేను మీరు మాట్లాడింది మొత్తం వినలేదు కాబట్టే అడుగుతున్నాను అంటుంది సీత. దీంతో నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే చెప్పు నేను వెళ్లిపోతాను అంటుంది విద్యాదేవి. దీంతో సీత షాక్ అవుతుంది. అయ్యో అలాంటిందేం లేదని మీరు ఎప్పటికీ ఇక్కడే ఉండాలని అంటుంది సీత. అయితే నేను ఎప్పటికీ ఇక్కడ ఉండలేనని ఎదో ఒకరోజు వెళ్లిపోవాల్సిందే అని చెప్పి వెళ్లిపోతుంది విద్యాదేవి. టీచర్ నా దగ్గర ఏదో దాస్తుందని అదేంటో త్వరలోనే కనుక్కుంటానని అనుకుంటుంది సీత.
సుమతిని గుర్తు చేసుకుని బాధపడిన జనార్దన్
   మరోవైపు రూంలో లెటర్ చదువుతూ ఉంటాడు జనార్ధన్. ఇంతలో అక్కడికి మహాలక్ష్మీ వస్తుంది. ఆ లెటర్ ఎన్ని సార్లు చదువుతావని అడుగుతుంది. మనం ఎంత ప్రయత్నించినా ఇక్కడకు రాని సుమతి రాసిన లెటర్ ను ఎందుకు ఇన్ని సార్లు చదువుతావు అంటుంది. అయితే సుమతి ఇక్కడ నుంచి వెళ్లినప్పుడు నీకు సుమతికి ఏదైనా గొడవ జరిగిందా? అని జనార్థన్ అడగడంతో మహాలక్ష్మీ ఎంత మాటన్నావు జనా అంటూ ఎమోషనల్ అవుతుంది. మేమిద్దరం ప్రాణస్నేహితులం. నాకు జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి సుమతి అలాంటి సుమతితో నాకు గొడవలేంటి? ఇంకా నా మీద నీకు అనుమానమా? అంటుంది. సుమతి కోసం నీకంటే నేనే ఎక్కువ ఎదురుచూస్తున్నాను. సుమతి రాగానే నా బరువు మొత్తం సుమతికే అప్పజెప్పాలని చూస్తున్నాను అని చెప్పి మహాలక్ష్మీ వెళ్లిపోతుంది. అసలు సుమతి ఎందుకు ఇలా చేస్తుంది. తను త్వరగా వస్తే బాగుండు అని జనార్థన్ కోరుకుంటాడు. బయటకు వెళ్లిన మహా కోపంగా చూస్తూ సుమతిని ఇక ఎప్పటికీ ఇక్కడికి రానివ్వను అనుకుంటుంది.
ఎమోషనల్ గా ఫీలయిన విద్యాదేవి
మరోవైపు బెడ్ రూంలో ఫ్యామిలీ డ్రాయింగ్ ఫోటో చూస్తూ విద్యాదేవి బాధపడుతుంది. ప్రాణంలా చూసుకునే పిల్లలకు నేనే మీ కన్నతల్లిని అని చెప్పలేను. తోడబుట్టిన అన్నయ్యను అందరికీ నా సొంత అన్నయ్య అని పరిచయం చేయలేను. ఆఖరికి సీతకు కూడా నిజం చెప్పలేను.  నా కష్టం పగవాళ్లకు కూడా రాకూడదు అనుకుంటుంది. మహాలక్ష్మీ నిజస్వరూపం అందరికీ తెలిసే వరకు నాకు ఈ అజ్ఞాతవాసం తప్పదు. తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అప్పటివరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉండాలి. అని విద్యాదేవి ఎమోషనల్ అవుతుంది.
విద్యాదేవిని అనుమానించిన మహాలక్ష్మీ
 మరోవైపు జనార్ధన్ గురించి ఆలోచిస్తుంది మహాలక్ష్మీ. జనా మనసు మెల్లగా సుమతి వైపు మల్లుతుంది. ఎప్పుడైనా సుమతి వస్తే ఈ ఇంట్లో నాకు స్థానం ఉండదు అని భయపడుతుంది. వెంటనే ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అవుతుంది. ఇంతలో అర్చన వచ్చే ఏం చేస్తున్నావు అక్కా అని అడగ్గానే సుమతి గురించి ఆలోచిస్తున్నాను ఎంత మందిని పెట్టి వెతికించినా తన జాడ దొరకడం లేదని చెప్తుంది. దీంతో సుమతి అక్కా ఎక్కడో ఉండే ఉంటుంది. ప్రతిక్షణం ఈ ఇంట్లో జరుగుతున్న విషయాలు అన్ని తెలుసుకుంటున్నాను అని చెప్పింది అంటే తను ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అనగానే అలా చేస్తే దొరికిపోతుంది. కానీ నా డౌట్ మన ఇంట్లో ఉన్న టీచరే సుమతి అని నా సిక్త్ సెన్స్ చెప్తుంది. అని తనని పక్కా ఆధారాలతో పట్టుకోవాలని నువ్వు ఎవ్వరూ చూడకుండా ఆ విద్యాదేవి రూంలోకి వెళ్లు అక్కడ ఏదైనా ఆధారం దొరికితే దాని అట కట్టిస్తాను అని మహాలక్ష్మీ చెప్పగానే అర్చన మొదట భయపడినా తర్వాత సరే అని వెళ్లిపోతుంది.
టీచర్ గదిలోకి దొంగచాటుగా దూరిన అర్చన   
తర్వాత ఎవ్వరూ చూడకుండా విద్యాదేవి గదిలోకి వెళ్తుంది అర్చన. గది మొత్తం వెతుకుతుంది. చీరల కింద ఉన్న ఫ్యామిలీ ఫోటో అర్చన చూడబోతుండగా అక్కడికి సీత వస్తుంది. వెనక నుంచి అర్చన భుజాల మీద చెయ్యి వెయగానే అర్చన ఉలిక్కిపడుతుంది. ఏం చేస్తున్నావు చిన్నత్తా అంటూ సీత అడగ్గానే భయంభయంగా అర్చన నేనేం చేయడంలేదని ఆవిడ బ్యాగు సర్దుతున్నాను అని చెప్పగానే మీచేత్తో టీచర్ గారికి టీ కూడా ఇవ్వరు మీరు ఆమె బ్యాగు సర్దుతున్నారా? అంటూ బ్యాగు తీసుకుని  అర్చనను కిందకు తీసుకెళ్తుంది.
ఇంట్లో దొంగను పట్టించిన సీత
అందర్నీ పిలిచి విషయం చెప్తుంది. దీంతో మహాలక్ష్మీ టెన్షన్ పడుతుంది. ఈ అర్చన మళ్లీ దొరికిపోయిందా? అని భయపడుతుంది. ఎంటి సీత ఎందుకు అందర్నీ పిలిచావు అని జనార్ధన్ అడగ్గానే ఇంటిదొంగను పట్టిద్దామని పిలిచానని చెప్పడంతో గిరి, సీతను తిడతాడు. సీత టీచర్ ను కూడా పిలిచి మీ గదిలో దొంగలు పడ్డారని అర్చన అత్తయ్య మీ రూంలోకి వెళ్లి ఈ బ్యాగుతో దేనికోసమో వెతుకుతుంది. అని చెప్పగానే విద్యాదేవి షాక్ అవుతుంది. బ్యాగులో ఫోటో అర్చన చూడలేదు కదా అనుకుంటుంది. బ్యాగు తీసి చూసుకుని అర్చన ఈ ఫోటో చూడలేదని ఊపిరి పీల్చుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.


Related News

Illu Illalu Pillalu Today Episode: వేదవతి మాటతో మనసు మార్చుకున్న నర్మద.. పుట్టింటికి వెళ్ళిపోయిన ప్రేమ..

Serial Heroine : సీక్రెట్ గా పెళ్లి.. ఏడాదికే విడాకులు..ఇప్పుడు ఏం చేస్తుంది..?

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

Big tv Kissik Talks: చైతన్య మాస్టర్ మరణం పై రాజు ఎమోషనల్… ఆఖరి మాటలు అవే అంటూ!

Big tv Kissik Talks: జానీ మాస్టర్ అరెస్ట్ .. అలా చేయకుండా ఉండాల్సింది.. ఢీ రాజు కామెంట్స్ వైరల్!

Big tv Kissik Talks: సూసైడ్  ఆలోచన చేసిన ఢీ రాజు.. ఊపిరి ఆడలేదంటూ!

Sai Kiran: 46 ఏళ్ల వయసులో తండ్రి.. ఘనంగా నటి సీమంతం.. వీడియో షేర్‌ చేసిన హీరో!

Nindu Noorella Saavasam Serial Today November 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  బ్లాక్ మ్యాన్ గురించి నిజం తెలుసుకున్న మిస్సమ్మ 

Big Stories

×