BigTV English

Vinesh Phogat: పీటీ ఉష వల్ల వీసమెత్తు ఉపయోగం లేదు: వినేశ్ ఫోగట్

Vinesh Phogat: పీటీ ఉష వల్ల వీసమెత్తు ఉపయోగం లేదు: వినేశ్ ఫోగట్

Vinesh Phogat’s Shocking Allegations Against PT Usha: వినేశ్ ఫోగట్.. ధైర్యానికి మారు పేరు.. రెజ్లింగ్ బరిలో ఎలా ఉంటారో, బయట సమాజంలో కూడా తనంతే పవర్ ఫుల్ గా ఉంటారనే పేరుంది. ఎప్పుడూ నిర్భయంగా నిజాలను బయటపెడుతుంటారు. వ్యవస్థలతో పోరాడుతూనే ఉంటారు. ఇదే క్రమంలో  ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషపై ఫైర్ అయ్యారు.


ఒక అథ్లెట్  అయి ఉండి, సాటి అథ్లెట్ కి సాయం చేయడానికి ముందుకు రాలేదని అన్నారు. నిజానికి తనకి భారత ఒలింపిక్ సంఘం నుంచి గానీ, అక్కడే ఉన్న పీటీ ఉష నుంచి గానీ వీసమెత్తు సహకారం అందలేదని అన్నారు. నేనే ఒంటరిగా పోరాడానని తెలిపింది. నా దగ్గరకు వచ్చి ఫొటోలు దిగుతూ, వాటిని షేర్ చేసుకుంటూ, నాకు మద్దతుగా ఉన్నానని తెలిపారని ఆరోపించింది.

మేం దేశం కోసం ప్రాతినిథ్యం వహిస్తున్నాం. మాకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మద్దతు దక్కాలి.  కానీ, అందరూ మీడియాకు బైట్లు ఇచ్చే బిజీలో ఉండిపోయారు. దీంతో థర్డ్ పార్టీగానే వాదనలు వినిపించాల్సి వచ్చిందని తెలిపింది. భారత ఒలింపిక్స్ సంఘం మద్దతే లేనప్పుడు.. నాకు కోర్టులో న్యాయమెలా జరుగుతుంది? అని వినేశ్ ఫోగట్ ఆవేదన వ్యక్తం చేసింది.


పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేశ్ ఫోగట్ కి 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని అనర్హత వేటు పడిన సంగతి విధితమే. అంతవరకు 50 కేజీలపైనే పోటీ పడి గెలిచినందుకు కనీసం రజత పతకమైనా ఇవ్వాలని కాస్ లో కేసు వేసింది.  అక్కడ ఒక్కరు కూడా తోడుగా నిలవలేదని వినేశ్ ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. టీమిండియా, శ్రీలంక ఆటగాళ్లదే హవా!

ఇటీవలే కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమే కావచ్చు, కానీ క్రీడాశాఖలో ఇలాంటి రాజకీయాలు జరగడం దురదృష్టకరమని అన్నారు. వీటన్నింటితో విసిగిపోయి రెజ్లింగ్ ను వదిలేసినట్టు తెలిపింది.

చాలామంది వద్దన్నారు. ఆడి ఉపయోగం ఏముంది? ఇన్ని రాజకీయాల మధ్య బరిలో పోరాడాలా? బయట వ్యవస్థలతో పోరాడాలా? అనే ఆవేదన వ్యక్తం చేసింది.  ఆసుపత్రిలో ఉండగా ఓ వ్యక్తి వచ్చి నాతో ఫొటో దిగి అండగా ఉన్నానని ప్రచారం చేసుకోవడం సరైందేనా..? అని ప్రశ్నించింది.

ఇలా ఎవరికి వాళ్లు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు, సోషల్ మీడియాలో సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకున్నారని తెలిపింది. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపింది. కచ్చితంగా రాజకీయాల్లో గెలిచి, భారత క్రీడాశాఖను ప్రక్షాళన చేస్తానని ప్రతిజ్ఞ చేసింది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×