BigTV English

Visakha Agency: విశాఖ మన్యం.. అంతు చిక్కని వ్యాధి, ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Visakha Agency: విశాఖ మన్యం.. అంతు చిక్కని వ్యాధి, ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Visakha Agency: ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో ఏం జరుగుతోంది? ఎందుకు ఒకే కుటుంబంలో నలుగురు అంతు చిక్కని వ్యాధితో మృతి వెనుక కారణమేంటి? ఏదైనా వ్యాధి ప్రబలిందా? అనారోగ్యం కారణం గానే నలుగురు మరణించారా? దీనికి వైద్యులు ఏమంటున్నారు? ఇవే ప్రశ్నలు మన్యంవాసులను వెంటాడుతున్నాయి.


గడిచిన 10 రోజులుగా భారీ వర్షాలు ఉమ్మడి విశాఖ ఏజెన్సీని కుదిపేశాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. కొన్ని చోట్ల వంతెనలు తెగిపోయాయి. దీని కారణంగా గూడెం కొత్త వీధి మండలంలోని కొన్నిగ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే అక్కడికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి అక్కడ వర్షాలు కుమ్మేశాయని అంటున్నారు ఆ ప్రాంత ప్రజలు.

ALSO READ: మందుబాబులకు భారీ శుభవార్త.. అక్టోబర్ 1 నుంచి..


ఇదిలావుండగా చింతపల్లి మండలం పెదబరడలో అంతు చిక్కని వ్యాధితో ఒక కుటుంబంలో తప్పించి రోజు నలుగురు వ్యక్తులు మృతి చెందారు. కళ్లు తిరిగి పడిపోవడం, వాంతులు విరోచనాలతో వారంతా ఆసుపత్రిలో చేరారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ మరణించారు.

అందరూ ఒకే లక్షణాలతో చనిపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఆసుపత్రి వైద్యులు ఈ వ్యాధిని కనుక్కోలేక పోయారని అంటున్నారు. దీంతో ఆ గ్రామంలో ఏం జరుగుతుందోనన్న చర్చ జోరందుకుంది. ఇటీవల పడిన భారీ వర్షాలకు ఆ ప్రాంతంలోని కొండ ప్రాంతాల నుంచి వాటర్ వచ్చిందని, ఆ నీటిని తాగడంవల్లే ఈ విధంగా జరిగిందని అనుకుంటున్నారు. వెంటనే పెదబరడ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నది గ్రామస్తుల డిమాండ్.

 

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×