E-Paper
Advertisement

After Death: చచ్చి బతికి.. మరణం గురించి ఒక్క బొమ్మతో అంతా చెప్పేశాడు, దీని అర్థం ఇదే!

After Death: చచ్చి బతికి.. మరణం గురించి ఒక్క బొమ్మతో అంతా చెప్పేశాడు, దీని అర్థం ఇదే!
Advertisement

మరణం తర్వాత ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలీదు. ఇప్పటికీ మనం సినిమాల్లో లేదా కథల్లో చెప్పినట్లే ఉంటుందని అనుకుంటాం. చనిపోగానే యుముడు లేదా ఆయన యమ భటులు వచ్చి తీసుకెళ్తారని అంతా భావిస్తుంటారు. పాపాలు చేస్తే నరకానికి.. పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తారనేది ఒక నమ్మకం. అయితే, ఏం జరుగుతుందనే ఎవరికీ కచ్చితంగా తెలీదు. అయితే.. ఇటీవల యూసఫ్ షకుర్ అనే వ్యక్తి గీసిన బొమ్మ ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. అందులో అతడు మరణం తర్వాత ఎలా ఉంటుందనేది గీశాడు. దాన్ని చూస్తే.. భూమిని వేరొక లోకానికి కలిపే మ్యాప్‌లా ఉంది.

ఎవరు ఈ యూసఫ్?

ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యూసఫ్ షకుర్ సుమారు రెండేళ్లు కోమాలోనే ఉన్నాడు. ఇక అతడు చనిపోయి ఉంటాడని నిర్ధరించే సరికి.. కళ్లు తెరిచాడు. ఆ తర్వాత ఏదేదో మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను మరణాన్ని చూసి వచ్చానని.. ఆ లోకమే చాలా వేరుగా ఉందని అన్నాడు. అయితే, అవన్నీ తాను మాటల్లో చెప్పలేనంటూ ఓ నోట్ బుక్‌లో అతడు చూసిందంతా గీశాడు. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇది సైన్స్‌కు కూడా అంతుబట్టని విషయం. ఆత్మ భూమిని వదిలిపెట్టగానే రెండు మూడు దశలు దాటుకుని.. అసలైన లోకానికి చేరుకుంటారు అనేలా అతడు మ్యాప్ గీశాడు. ఇప్పుడు దాని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో పరిశోధకులు ఉన్నారు. అయితే, ఈ కథనం ప్రస్తుతం సోషల్ మీడియా, ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ద్వారా బాగా వైరల్ అవుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. యూసఫ్ ఎక్కడ, ఏ ప్రాంతానికి చెందినవాడనే విషయాలేవీ ఈ వార్తల్లో వెల్లడించలేదు.

ఆ డ్రాయింగ్‌లో ఏం ఉంది?

Advertisement

అతడు గీసిన బొమ్మ ఒక మ్యాప్‌లా ఉంది. అది వేరే యూనివర్శిటీని కలుపుతున్నట్లుగా ఉంది. కింద వైపు అతడు ఎర్త్ మ్యాప్‌ను గీశాడు. దాని మీద మనుషులు నిలబడి ఉన్నట్లుగా గీతలు ఉన్నాయి. భూమికి పైన మరికొన్ని గుండ్రని వలయాలు ఉన్నాయి. వాటిని చూస్తే పైలోకాలకు దారుల్లా ఉన్నాయి. మరణం తర్వాత దాటాల్సిన దశలను సూచిస్తున్నాయి. వాటికి ‘సిల్వర్ కార్డ్స్’ అనే సన్నని తాళ్లు ఉన్నాయి. అవే.. మనుషులను పైకి తీసుకెళ్తాయి. ఎందుకంటే అతడి గీసిన బొమ్మలో కొన్ని గుర్తులు.. కొంతమంది మనుషులు ఆ వెండి తాళ్లకు వేలాడుతున్నట్లుగా ఉన్నాయి. అక్కడ యూసఫ్ (Transit) అని రాశాడు. కాబట్టి.. మరణం తర్వాత ఆ దశలను దాటుకుని మనుషులు పైకి వెళ్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. చివరిగా పై భాగంలో గోళాన్ని తిరగేసి ఉంచినట్లుగా ఒక ఆకారం ఉంది. దానిపై V ఆకారాలు, చిన్న గోళాలు ఉన్నాయి. చివరిగా అదే ఆత్మ చేరుకోవల్సిన ప్రాంతం కావచ్చని తెలుస్తోంది.

అంతా అనుసంధించబడ్డాం: యూసఫ్

ఈ విశ్వంలోని మనుషులంతా ఒకే ఒక పెద్ద మూలానికి అనుసంధించి ఉన్నారని యూసఫ్ తెలిపాడు. ఆ లోకానికి ఆ వెండి రంగుంలో మెరుస్తున్న తీగలు కనెక్ట్ చేస్తున్నాయని పేర్కొన్నాడు. అయితే, యూసఫ్ చెప్పినది అంతా ఒట్టి మాటలు అని కొట్టిపడేయలేం. ఎందుకంటే.. గతంలో మరణం అంచులు వరకు వెళ్లి వచ్చినవారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. వాళ్లు పెద్ద కాంతిలాంటిది ఏదో కనిపించిందని చెప్పారు. వేరొక లోకానికి వెళ్తున్న భావన కలిగిందన్నారు. మరి దీని గురించి సైన్స్ ఏం చెబుతుందో చూడాలి.

Advertisement

Also Read: తేళ్లతో కోట్లు కురిపించే వ్యాపారం.. ఇందుకు మీరు ఏం చేయాలంటే?

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×