E-Paper
Advertisement

బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ తల్లి కాబోతోందా?

బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ తల్లి కాబోతోందా?
Advertisement

Shubhashree:సినిమా సెలబ్రిటీలు ఎవరితోనైనా కలిసి తిరిగితే చాలు వారి మధ్య ఎఫైర్స్ సృష్టిస్తారు. ఒకవేళ ఒక జంట పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైతే.. ఇక సినిమాలకు శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పేసారేమో అంటూ రూమర్లు సృష్టిస్తారు. ఒకవేళ అమ్మాయిలైతే కొంతకాలం ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ కొద్దిగా బొద్దుగా కనిపిస్తే చాలు ప్రెగ్నెంట్ ఏమో అంటూ రూమర్లు సృష్టిస్తారు. ఈ క్రమంలోనే ఒక బిగ్ బాస్ బ్యూటీపై ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ క్రియేట్ చేయడమే కాకుండా ఆమెను పదే పదే కామెంట్ రూపంలో అడుగుతూ విసిగించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేస్తూ రూమర్లన్నింటికీ చెక్ పెట్టింది.

శుభశ్రీ ప్రెగ్నెంట్?

ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని అందర్నీ ఆకట్టుకున్న శుభ శ్రీ రాయగరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. స్వతహాగా ఒడియా అమ్మాయి .. పైగా లాయర్ కూడా.. అయినప్పటికీ తెలుగు సినిమాలలో నటిగా మంచి ప్రయత్నాలే చేసింది. అలా ఒకటి రెండు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ సక్సెస్ రాలేదు. అయితే బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఈమెకు ఊహించని గుర్తింపు లభించింది.

Advertisement

also read:బుల్లితెరపై ప్రత్యక్షమైన ప్రదీప్.. సినిమాలకు గుడ్ బై చెప్పేశాడా?

రూమర్స్ రావడానికి కారణం?

హౌస్ నుంచీ బయటకు వచ్చిన తర్వాత ఆస్ట్రేలియాలో ఉంటున్న అజయ్ అనే భారతీయుడిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. అంతే కాదు గత ఏడాది జూన్లో తన పెళ్లి విషయాన్ని కూడా బయటపెట్టి అభిమానులను సర్ప్రైజ్ చేసింది . ఇకపోతే ఆ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో కనిపించలేదు. కానీ గత వారం రోజుల క్రితం నుంచీ అడపాదడపా పోస్ట్లు పెడుతూ కనిపించింది. అయితే ఇటీవల షేర్ చేసిన ఫోటోలలో శుభశ్రీ కాస్త బరువెక్కి కనిపించింది. బొద్దుగా కనిపించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇది చూసిన కొంతమంది శుభశ్రీ ప్రెగ్నెన్సీ తో ఉందా అంటూ కామెంట్లు చేశారు. పైగా ఆమె ఫాలోవర్లు కూడా తరచూ కామెంట్లు చేస్తుండడంతో ఏకంగా ఒక వీడియో పోస్ట్ చేసింది.

ఒక్క వీడియోతో ఫుల్ క్లారిటీ..

Advertisement

మీరు ప్రెగ్నెంటా అని పదేపదే కామెంట్ పెడుతున్న సదరు నెటిజన్ కి ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు అదే సమయంలో తాను గర్భవతిని కాను అంటూ పరోక్షంగా కూడా క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియోలో శుభశ్రీ..” అసలు ఏం నడుస్తోందిరా సోషల్ మీడియాలో.. ఒక ఏడాది లాంగ్ గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో నేను 3 పోస్ట్లు పెట్టాను. అయితే వాటిల్లో కంటిన్యూగా ఒక ఆమె నన్ను అడుగుతోంది నువ్వు ప్రెగ్నెంటా అని.. స్టుపిడ్.. నువ్వు సింగిలా లేక నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను వదిలేసాడా.. మరి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావ్? ఎలా తింటున్నావ్? పీజీలో ఉంటున్నావా? ఎందుకు? మమ్మీ కూడా నిన్ను వదిలేసిందా? మరి నువ్వే వండుకొని తింటున్నావా? నీకు జాబ్ కూడా లేదా?నాకు తెలిసి ఇప్పుడు నీకు ఒక జాబ్ కావాలి..” అంటూ ఒక రేంజ్ లో ఆమెను ఆటాడుకుంది. మొత్తానికైతే తాను ప్రెగ్నెంట్ కాను అనే విషయాన్ని ఇండైరెక్టుగానే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం శుభ శ్రీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Big Stories

Advertisement
×