BRS Strategy: శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి, ప్రజాక్షేత్రంలో పొలిటికల్ మైలేజ్ సాధించాలనుకున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు అసెంబ్లీ సమావేశాలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. సభలో వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో గులాబీ దళం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు ప్రతిపక్షం చేపట్టిన ఆందోళనలు, ఎత్తుగడలు వికటించి చివరికి సభ నుంచే దూరమైంది.ప్రజాసమస్యలపై సభలో నిలదీయాల్సింది పోయి, కేవలం రాజకీయ లబ్ధి కోసమే పాకులాడి సభకు దూరమైందనే విమర్శలు వస్తున్నాయి. సభ ప్రారంభమైన నాటి నుంచి అనుసరించిన తొందరపాటు వ్యూహాలు, ఆందోళనల కారణంగానే గులాబీ ఈ పరిస్థితి వచ్చిందనే చర్చజరుగుతుంది.
రాజకీయ వ్యూహాలు రచించడంలో, ప్రత్యర్దులను ఎత్తులో చిత్తుచేసే రాజకీయ చతురత గులాబీ అధినేత కేసీఆర్ కు ఉంది. అయితే ఎప్పుడు అసెంబ్లీ జరిగినా బీఆర్ఎస్ పై చేయ్యి సాధించేది. కానీ ఈసారి శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం వ్యూహాలు రివర్స్ అయ్యారు. అంటే వ్యూహరచనలోపంతో ఇది జరిగిందా? అనే చర్చజరుగుతుంది.సభ మొదటి రోజే సభకు నల్ల చొక్కాలతో హాజరై నిరసన తెలపడం ద్వారా బీఆర్ఎస్ తన పంథాను స్పష్టం చేసింది. అయితే, కీలకమైన అంశాలపై చర్చించకుండా ప్రారంభంలోనే నిరసనలకే పరిమితమవడం, అరెస్టులతో సభకు రాలేదు. అయితే బీఆర్ఎస్ కు మైలేజ్ వచ్చిన సమయంలోనే ఎమ్మెల్సీ తాతామధు.. పోలీసులు అడ్డుకునే సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు అస్త్రాన్ని ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వానికి మైలేజ్ తీసుకొచ్చింది.
Also read: పీకలదాకా తాగుతూ నైట్ క్లబ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెటర్లు
పార్టీ ఎమ్మెల్సీలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్ కు తరలింపుతో బీఆర్ఎస్ రెండోజూ సభలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఎమ్మెల్సీల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ శాసనసభలో రచ్చ చేయడం ప్రతిపక్ష వ్యూహరాహిత్యానికి అద్దం పట్టిందని పలువురు రాజకీయ వేత్తలు అభిప్రాయపడ్డారు. సభలో ఉండి చర్చకు పట్టుబడితే బాగుండేదని, అంశాలపై చర్చజరుగకుండా ప్లకార్డుల ప్రదర్శనతో సభ వాయిదాపడింది. అదే సమయంలో ఫాం హౌజ్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడం.. అటు వెళ్లే ప్రయత్నంలో హకీంపేటవద్ద అరెస్టు కావడం.. పోలీసుస్టేషన్లకు ఎమ్మెల్యేలను తరలించడం, సాయంత్రం వారిని విడిచిపెట్టడం.. వారు వచ్చే సరికి సభను వాయిదా వేశారు. ఆరోజూ చర్చజరుగకుండానే ముగిసింది. గులాబీ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సభా కార్యక్రమాలకు తీవ్ర విఘాతం కలగడంతో స్పీకర్ కఠిన నిర్ణయం తీసుకుంటూ, ఈ విడత అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు బీఆర్ఎస్ సభ్యులందరినీ సస్పెండ్ చేశారు. దీంతో ప్రజాసమస్యలపై మాట్లాడే ప్రధాన ప్రతిపక్షం సభలో లేకుండానే పోయింది.
రైతుల కష్టాలు, సంక్షేమ పథకాల అమలు, నిరుద్యోగం, విద్యార్థుల ఫీజు రియింబర్స్ మెంట్, ఇరిగేషన్ వంటి అనేక తీవ్రమైన ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు లభించిన సువర్ణావకాశాన్ని బీఆర్ఎస్ చేతురారా జారవిడుచుకుందనే ప్రచారం జరుగుతుంది. విషయాల ఆధారంగా రగడ సృష్టించి ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన చోట, కేవలం రాజకీయ మైలేజ్, ప్రచారం కోసమే తాపత్రయపడిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఫలితంగా, అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుని తమకు తామే సభకు దూరమై, ప్రజల మనసును చూరగొనడంలో బీఆర్ఎస్ తీవ్రంగా వెనుకబడిపోయిందనే ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తే పార్టీకి మైలేజ్ వచ్చేదని, ఆ అంశాలతో తాము సైతం ప్రజల్లోకి వెళ్లేవారని, మాకు ఆదరణ వచ్చేదని, రాబోయే ఎన్నికలకు మార్గం సులువు అయ్యేదని పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఎలా ముందుకు పోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also read: జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!