E-Paper
Advertisement

‘సర్దార్ 2’ మూవీ రివ్యూ: ఇలా చేశావేంటి కార్తి?

‘సర్దార్ 2’ మూవీ రివ్యూ: ఇలా చేశావేంటి కార్తి?
Advertisement

Sardar 2 movie review:తమిళ స్టార్ హీరో కార్తి (Karthi ) నటించిన సూపర్ హిట్ మూవీ ‘సర్దార్’కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘సర్దార్ 2’ (Sardar 2). పీఎస్ మిత్రన్ (PS .Mithran) దర్శకత్వం వహించిన ఈ హై-వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో కార్తి మరోసారి ద్విపాత్రాభినయంలో ప్రేక్షకులను అలరించడానికి వచ్చాడు. ఎస్.జె. సూర్య (SJ.Surya) విలన్‌గా, మాళవిక మోహనన్ (Malavika mohanan), ఆశికా రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో నేడు థియేటర్లలోకి వచ్చింది. మరి సోషల్ మెసేజ్‌తో ముడిపడి ఉన్న ఈ స్పై థ్రిల్లర్ ఏ మేరకు మెప్పించిందో చూద్దాం .

సర్దార్ 2 సినిమా స్టోరీ..

తొలిభాగం ఎక్కడైతే ముగిసిందో దాదాపు అక్కడి నుంచే ఈ సీక్వెల్ కథ మొదలవుతుంది. దేశ ద్రోహి అనే ముద్ర పడిన ఒక మాజీ రా (RAW) ఏజెంట్ బోస్ (కార్తి), తన గతాన్ని చెరిపేసుకుని ఒక తప్పును సరిదిద్దుకునే మిషన్‌లో ఉంటాడు. మరోవైపు విజి (కార్తి) పాత్ర కూడా ఈ మిషన్‌లో కీలకంగా మారుతుంది. అయితే, సమాజానికి ముప్పుగా పరిణమించే ఓ యాంటీబయోటిక్స్/మెడికల్ మాఫియా కుంభకోణంతో ఓ పవర్‌ఫుల్ విలన్ (ఎస్.జె. సూర్య) ఎంటర్ అవుతాడు. మరి ఈ పవర్ ఫుల్ విలన్‌ను సర్దార్ ఎలా ఎదుర్కొన్నాడు? తన మీద పడిన మచ్చను ఎలా చెరిపేసుకున్నాడు? రా ఏజెంట్ జారా (మాళవిక మోహనన్) పాత్ర ఏమిటి? అనేది మిగతా కథ.

సర్దార్ 2 సినిమా ఎలా ఉందంటే?

Advertisement

సాధారణంగా స్పై థ్రిల్లర్స్ అంటే సీట్ ఎడ్జ్ మూమెంట్స్ ఆశిస్తారు. దర్శకుడు పీఎస్ మిత్రన్ ఎంచుకున్న పాయింట్, దానికి ముడిపెట్టిన సోషల్ మెసేజ్ బాగున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. ఎలాంటి అనవసరమైన లవ్ ట్రాక్స్, పాటలు లేకుండా నేరుగా యాక్షన్ లోకి తీసుకెళ్లడం ప్లస్. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, అక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకుంటాయి.కానీ, సెకండాఫ్‌కి వచ్చేసరికి సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోతుంది. కథనం చాలా నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉండటం ఈ సినిమాకు అతిపెద్ద మైనస్. ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు రొటీన్‌గా ఉండటం వల్ల సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక మంచి మెసేజ్ ఉన్నప్పటికీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు.

ALSO READ:సుహాస్ – సూరి మండాడి మూవీ రివ్యూ.. పోరులో నెగ్గిందెవరు?

నటీనటుల పెర్ఫార్మెన్స్..

Advertisement

ఈ సినిమాకు అతిపెద్ద బలం కార్తి. బోస్, విజి రెండు పాత్రల్లోనూ కార్తి తనదైన మార్క్ చూపించాడు. ముఖ్యంగా రెండు క్యారెక్టర్ల మధ్య బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్‌లో చూపించిన వేరియేషన్ సూపర్బ్. ఎస్.జె. సూర్య లాంటి అద్భుతమైన నటుడికి విలన్ పాత్ర దక్కినా.. రైటింగ్ వీక్‌గా ఉండటంతో ఆయన పాత్ర ఆశించిన స్థాయిలో పేలలేదు. రా ఏజెంట్‌గా మాళవిక మోహనన్ డీసెంట్ యాక్టింగ్‌తో మెప్పించింది. ఆశికా రంగనాథ్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. యోగిబాబు ఉన్నంతలో తన కామెడీ టైమింగ్‌తో కొన్ని నవ్వులు పూయించాడు.

సాంకేతిక నిపుణులు..

సాంకేతికంగా ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా విజువల్స్ అందించినా, వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్ మాత్రం చాలా నాసిరకంగా ఉంది. సామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఏమాత్రం ప్లస్ అవ్వలేదు. ముఖ్యంగా ఎలివేషన్ సీన్లలో బీజీఎమ్ తేలిపోయింది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండాల్సింది. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి కానీ టేకింగ్‌లో మ్యాజిక్ లోపించింది.

సర్దార్ 2 ప్లస్ పాయింట్స్:

కార్తి అద్భుతమైన నటన (ద్విపాత్రాభినయం)

ఫస్ట్ హాఫ్ సెటప్ & ఇంటర్వెల్ బ్లాక్

కోర్ పాయింట్ & సోషల్ మెసేజ్

సర్దార్ 2 మైనస్ పాయింట్స్:

3 గంటల సుదీర్ఘ నిడివి,
సాగదీసిన సెకండాఫ్

ఎస్.జె. సూర్య క్యారెక్టరైజేషన్, వీక్ విలనిజం
నిరాశపరిచే మ్యూజిక్ (BGM) & నాసిరకం వీఎఫ్ఎక్స్

చివరి మాటగా :

మంచి పాయింట్ ఉన్నప్పటికీ, సాగదీసిన కథనం, ఎమోషన్ మిస్ అవ్వడంతో ‘సర్దార్ 2’ అంచనాలను అందుకోలేకపోయింది. కేవలం కార్తి వన్ మ్యాన్ షో, ఫస్ట్ హాఫ్ లో ఉన్న కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ కోసం ఈ స్పై థ్రిల్లర్‌ను థియేటర్లలో ఓసారి చూడొచ్చు.

Sardar 2 Movie Rating: 2.25/5

Related News

సుహాస్ – సూరి మండాడి మూవీ రివ్యూ.. పోరులో నెగ్గిందెవరు?

‘మారెమ్మ’ మూవీ రివ్యూ: మాస్ మహారాజా తమ్ముడి కొడుకు మెప్పించాడా ?

సహా రివ్యూ: గుండు ఛాలెంజ్‌తో వైరల్.. థియేటర్‌లో మాత్రం..

మీర్జాపూర్ మూవీ రివ్యూ.. గద్దె కోసం గ్యాంగ్ వార్.. ఎవరు గెలిచారంటే?

రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. పాత జోనర్ నే నమ్ముకున్న అల్లరి నరేష్ కి కలిసొచ్చిందా?

బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ మూవీ లాంటి సక్సెస్ లభిస్తుందా?

‘ఐయామ్ గేమ్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Big Stories

Advertisement
×