E-Paper
Advertisement

Telugu TV Serials: సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు సీరియల్స్ కు శుభం కార్డు..?

Telugu TV Serials: సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు సీరియల్స్ కు శుభం కార్డు..?
Advertisement

Telugu TV Serials : బుల్లితెర ఆడియన్స్ ను నిత్యం ఆకట్టుకుంటున్న వాటిలో డైలీ సీరియల్స్ ఉన్నాయి. ప్రతి రోజు కొత్త స్టోరీతో జనాల్లో ఉత్కంఠను క్రియేట్ చేస్తూ నిత్యం ప్రసారం అవుతున్న వీటిని చూసేందుకు జనాలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇటీవల కాలంలో సినిమాల కన్నా సీరియల్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. ఊహించని ట్విస్ట్ లు.. అలాగే స్టోరీ మంచిగా ఉండడంతో ప్రతి ఒక్కరూ సీరియల్స్ చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. అయితే స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్ ను జనాలు ఎక్కువగా చూస్తున్నారు. ప్రతి సీరియల్ కూడా నువ్వా నేనాని పోటీపడి తమ స్టోరీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ కొన్ని ఉన్నాయి. అందులో గత వారం టాప్ రేటింగ్ ను అందుకున్న సీరియల్స్ కు ఈ వారం దారుణమైన పరిస్థితి ఎదురైందని తెలుస్తుంది.. స్టోరీ వీక్ అవ్వడం తోనే శుభం కార్డు పడుతుందని టాక్ నెట్టింట నడుస్తుంది. మరి ఆ సీరియల్స్ ఏవి అన్నది ఒకసారి చూసేద్దాం..

గుండెనిండా గుడిగంటలు..

స్టార్ మా లో ప్రసారం అవుతున్న  సక్సెస్ఫుల్ సీరియల్ గుండెనిండా గుడిగంటలు. బాలు మీనాలా ప్రేమ కథ.. డబ్బుల కోసం ప్రభావతి చేస్తున్న ప్రయోగాలు. మధ్యతరగతి కుటుంబంలో ఉన్నా కోరికలు ఆకాశాన్ని అంటుతాయి. ఎలాగైనా సరే కోటీశ్వర్లు అవ్వాలని అత్త ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తన కోడల్ని కూడా కోటీశ్వరుల ఇంటి నుంచి తీసుకొచ్చాను అని సంబరపడిపోతూ ఉంటుంది. కానీ ఒక కోడలు మాత్రం పేదింటి నుంచి వచ్చిందని ప్రతి రోజు వేపుకు తింటుంది.. గతవారంతో పోలిస్తే ఈ వారం ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది అని తెలుస్తుంది. మీన నగల కోసం బాలు దొంగని బయట పెట్టాలని చేస్తాడు. అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ సీరియల్ కాస్త బోరింగ్ గా నడిచింది. దాంతో జనాలు ఇందులో నగలదొంగ దొరికేంతవరకు సీరియల్ సాగదీస్తారేమో అని సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇదే విధంగా మరికొన్ని రోజులు ఈ సీరియల్ స్టోరీ గనుక ఇలానే కొనసాగితే కచ్చితంగా చాలామంది సీరియల్ చూడడం మానేస్తారని తెలుస్తుంది. మరి కొంతమంది మాత్రం నగలదొంగ దొరకగానే సీరియల్ కి శుభం కార్డు పడిపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. రేటింగ్ విషయానికి వస్తే.. 12.39 ఉందని తెలుస్తుంది. మరి ఈ వారం ఈ సీరియల్ లో ఏవైనా ట్విస్టులు జరిగి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి..

Advertisement

Also Read : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

ఇంటింటి రామాయణం.. 

ఇంటింటి రామాయణం.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్స్ లలో ఇది ఒకటి.. టైటిల్ కి తగ్గట్లే సీరియల్ లోని పాత్రలు కూడా ఉంటాయి.. తను ప్రేమించిన అబ్బాయిని దూరం చేశారని తన అత్తింటి వాళ్లపై పగను పెంచేసుకుంటుంది ఒక అమ్మాయి. తన తండ్రితో కలిసి దారుణమైన కుట్రలను పన్నుతుంది. అత్తింటి వాళ్ళు అని కూడా కనికరం లేకుండా నడిరోడ్డు మీదకి తీసుకొస్తుంది. అయితే ఆ కుటుంబంలో ఉన్న పెద్ద కోడలు తన వాళ్ళని కాపాడుకుంటూ వస్తుంది. ఈ సీరియల్ గత కొద్ది రోజులుగా బోరింగ్ గా సాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్తులు పోగొట్టుకోవడం, ఎవరికి వారే అన్నట్లు ఇంటి సభ్యులు ఉండడం. ఇవన్నీ కూడా జనాలని అయోమయంలో పడేస్తున్నాయి. గతవారం స్టోరీలో ఆస్తుల కోసం గొడవలు పడతారు. ఇక్కడికి ఎటువంటి ట్విస్టులు ఇవ్వకుండా సాఫీగా స్టోరీని తీసుకెళ్లడంతో జనాలు కాస్త బోరింగ్ గా ఫీల్ అవుతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మరోవైపు ఆస్తి పంపకాలు అవ్వగానే సీరియల్ కూడా అయిపోతుంది అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంటింటి రామాయణం సీరియల్ లో ప్రస్తుతం స్టొరీ ల్యాగు లాగా అనిపిస్తుంది. ఈవారం కొత్త క్యారెక్టర్ సీరియల్ లోకి ఎంట్రీ ఇస్తుందని టాక్. ఆ క్యారెక్టర్ వల్ల స్టోరీ మరో మలుపు తిరుగుతుందా..? లేదా బోరింగ్ సీన్లతో శుభం కార్డు వేసుకుంటుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×