E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : బాండింగ్ దెబ్బేసింది… ఎలిమినేట్ అయ్యాక రియలైజయ్యి ఏం లాభం దివ్య?

Bigg Boss 9 Telugu : బాండింగ్ దెబ్బేసింది… ఎలిమినేట్ అయ్యాక రియలైజయ్యి ఏం లాభం దివ్య?
Advertisement

Bigg Boss 9 Telugu : సండే ఫన్ డే ఎపిసోడ్ లో దివ్య హైలెట్ గా నిలిచింది. ఎలిమినేట్ అవుతాను అని ముందే ఊహించిందో ఏమోగానీ ఫుల్ ఎనర్జీగా దర్శనం ఇచ్చింది. చివరికి ఆమె అనుకున్నదే జరిగింది అంటూ బిగ్ బాస్ హౌస్ లో నుంచి హ్యాపీగానే బయటకు వెళ్ళింది. కానీ తన వీడియో తాను చూసుకున్నాక బాండింగ్ దెబ్బేసిందని రియలైజ్ అయ్యింది.

హౌస్ లో ఉన్నప్పుడే ఆలోచించాల్సింది 

చివరగా నామినేషన్ టెన్షన్లో సుమన్, దివ్య మిగిలారు. ఎవరి వాల్కనోలో నుంచి రెడ్ కలర్ లావా వస్తుందో వాళ్ళే ఎలిమినేట్ అని చెప్పారు నాగార్జున. ఎట్టకేలకు దివ్య ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. ఎలిమినేట్ అయిన ప్రతీ కంటెస్టెంట్ కు వేసినట్టే… బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి వెళ్ళే వరకు వీడియో రూపంలో ఆమె జర్నీని చూపించారు. అది చూశాక నాగార్జున ‘నీ గేమ్ పై రివ్యూ ఏంటి?’ అని అడిగారు. ‘సినిమాలకు ఎలా రివ్యూ ఇస్తానో, నా గేమ్ కూడా అలాగే రివ్యూ ఇచ్చుకుంటా. అంతా బాగానే ఉంది. కానీ బాండింగ్ వల్ల గేమ్ పై ఎఫెక్ట్ పడింది” అంటూ స్వయంగా తాను చేసిన మిస్టేక్ ను ఒప్పుకుంది దివ్య.  కానీ ఇలా ఎలిమినేట్ అయ్యాక రియలైజ్ అయ్యి లాభం ఏంటి? అంటున్నారు ఆమె అభిమానులు.

హౌస్ మేట్స్ ఆటతీరుపై రివ్యూ 

Advertisement

‘పవన్ నీకోసం నువ్వు ఆడు, ఇంకొకరికి ఇవ్వకు. వాళ్ళకోసం త్యాగం చేయకు. ఇంకా 3 వారాలే ఉన్నాయి కాబట్టి గట్టిగా ఆడు. పవన్ నాకు బయట ఫ్రెండే సార్. సెన్సిటివ్ గా ఉంటాడు కాబట్టి అలా త్యాగాలు చేస్తూ ఉంటాడు” అంటూ డెమోన్ గురించి చెప్పింది.  హౌస్ లో నాకంటే బెటర్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది ఇమ్మూనే.  సంజన మనిషి మంచిదే కానీ మాట జాగ్రత్త. తనుజా గురించి అయితే నెగెటివ్స్ ఏం లేవు. కానీ మిస్ యూ అంటూ షాక్ ఇచ్చింది దివ్య. వెళ్తూ తనూజపై షాకింగ్ కామెంట్స్ చేస్తుంది అనుకున్న వాళ్ళకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.

కళ్యాణ్ మోతీచోర్… అతనికి ఇండస్ట్రి అంటే పిచ్చి సార్. నువ్వు బయటకు వచ్చాక ఎలాగైనా హీరో అయిపోవాలని కోరుకుంటున్నా’ అంటూ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టింది. రీతూ బబ్లీ గర్ల్, కానీ క్లోజ్ అయిన వాళ్ళను ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోదు. బయట ఉంటే మంచి ఫ్రెండ్స్ అయ్యి ఉండేవాళ్లం. చివరగా నా అన్నయ్య భరణి గెలవాలనే కోరుకుంటా. బయటకు వస్తే అస్సలు ఊరుకోను, ఫినాలేలో కలుద్దాం అంటూ భరణికి గుడ్ బై చెప్పింది. చోటా ప్యాకెట్ బడా ధమాకా.. సుమన్ అన్న ప్రతిసారీ యాపిల్ తినమ్మా, ఆరెంజ్ తినమ్మా అంటూ ఏదో ఒకటి తినిపిస్తూనే ఉండేవారు. వీళ్ళు ఇద్దరే నన్ను హౌస్ లో బాగా చూసుకున్నారు అంటూ ఎమోషనల్ అయ్యింది దివ్య.

Advertisement

Read Also : తనూజపై నాగ్ సెటైర్లు… కొడుకుతో సహా సంజనాను టార్గెట్ చేసిన హౌస్ మేట్స్… దివ్యకు బైబై

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×