E-Paper
Advertisement

Golden Globes 2026 OTT : ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక… ఇండియాలో లైవ్ ను ఇలా చూడండి

Golden Globes 2026 OTT : ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక… ఇండియాలో లైవ్ ను ఇలా చూడండి
Advertisement

Golden Globes 2026 OTT : 2025లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ను అలరించిన బెస్ట్ మూవీస్, సిరీస్ లను వరించడానికి 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 రెడీగా ఉంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో పాపులర్ హాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్‌ పై దర్శనం ఇవ్వబోతున్నారు. 2025లో గోల్డెన్ గ్లోబ్స్‌ను హోస్ట్ చేసిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన నిక్కీ గ్లేజర్… మరోసారి ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ ను సోలోగా హోస్ట్ చేయబోతున్నారు. మరి ఈ అవార్డ్స్ వేడుకను లైవ్ లో ఇండియాలో ఏ ఓటీటీలో, ఎప్పుడు చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

83వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం జనవరి 11న ఆదివారం సాయంత్రం 8 గంటలకు జరగనుంది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌ లోని బెవర్లీ హిల్టన్‌ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అయితే భారతదేశంలో ఈ లైవ్ చూడాలంటే మాత్రం మరునాటి వరకు వెయిట్ చేయక తప్పదు. జనవరి 12న ఉదయం 5:30 గంటలకు Jio Hotstar గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ను మనం ఇక్కడ చూడొచ్చన్నమాట. మరి ఈ అవార్డ్స్ కోసం పోటీ పడుతున్న, నామినేషన్లు దక్కించుకున్న సినిమాలు సిరీస్ లు ఏంటో తెలుసుకుందాం పదండి.

One Battle After Another

Advertisement

లియోనార్డో డికాప్రియో నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’. ఈ ఏడాది ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ దర్శకుడు వంటి కేటగిరీలలో ఏకంగా తొమ్మిది నామినేషన్లతో గోల్డెన్ గ్లోబ్ కోసం పోటీలో నిలిచింది ఈ మూవీ. ఈ చిత్రం అవార్డు అందుకోవడానికి ఈ లిస్ట్ లో ముందంజలో ఉంది.

Sentimental Value

ఈ నార్వేజియన్ కామెడీ డ్రామా 2026 గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఎనిమిది నామినేషన్లను సంపాదించింది. ‘సెంటిమెంటల్ వాల్యూ’ మూవీ బెస్ట్ డ్రామా, బెస్ట్ నాన్ – ఇంగ్షీషు భాషా చిత్రం విభాగాలలో ప్రధానంగా పోటీ పడుతోంది. ఇందులో నటించిన మెయిన్ లీడ్స్ రెనేట్ రీన్స్వే, స్టెల్లన్ స్కార్స్‌గార్డ్ కూడా తమ నటనకు గానూ ప్రశంసలు అందుకున్నారు. తల్లి చనిపోయాక కలుసుకునే ఇద్దరు సిస్టర్స్ స్టోరీ ఇది.

Sinners

Advertisement

మైఖేల్ బి జోర్డాన్ దర్శకత్వం వహించిన హర్రర్-థ్రిల్లర్ ‘Sinners’. 7 నామినేషన్లతో రేసులో ఉన్న ఈ మూవీ ఉత్తమ మోషన్ పిక్చర్ (డ్రామా) విభాగంలో అవార్డును సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. లుడ్విగ్ గోరాన్సన్ రాసిన ఉత్తమ ఒరిజినల్ స్కోర్ వంటి సాంకేతిక విభాగాలలో 83వ ఎడిషన్‌లో ఈ సినిమా భారీగా అవార్డులను కొల్లగొడుతుందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. ‘సిన్నర్స్’ మూవీకి ఏ రేటింగ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

The White Lotus Season 3

ఆరు నామినేషన్లతో టీవీ కార్యక్రమాలు, సిరీస్‌లలో ‘ది వైట్ లోటస్ సీజన్ 3’ ముందుంది. 2026 గోల్డెన్ గ్లోబ్స్ ఎడిషన్‌లో ఉత్తమ టెలివిజన్ సిరీస్ విభాగంలో ఈ సిరీస్ గట్టి పోటీని ఇస్తోంది. సీజన్ 3లో నటాషా రోత్‌వెల్, వాల్టన్ గోగిన్స్, క్యారీ కూన్, మిచెల్ మోనాఘన్, జాసన్ ఐజాక్స్, పార్కర్ పోసీ, పాట్రిక్ స్క్వార్జెనెగర్, ఐమీ లౌ వుడ్ తదితరులు నటించారు.

Adolescence

ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ 5 నామినేషన్లను సాధించింది. ఇప్పటికే ప్రైమ్‌టైమ్ ఎమ్మీలు, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను గెలుచుకున్న ఇది, బెస్ట్ లిమిటెడ్ లేదా ఆంథాలజీ సిరీస్‌గా గోల్డెన్ గ్లోబ్స్ లోనూ సత్తా చాటే అవకాశం ఉంది. జామీ మిల్లర్ అనే 13 ఏళ్ల బాలుడి కథ ఇది. అతను తన క్లాస్‌మేట్ కేటీ లియోనార్డ్‌ ను హత్యచేసి అరెస్ట్ అవుతాడు. ఆ తరువాత ఏమైంది అన్నది స్టోరీ.

Read Also :  ఈ వారం ఓటీటీలోకి కొత్త మలయాళం మూవీస్… ఆ రెండూ డోంట్ మిస్

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×