The Traitors Telugu Controversy:బిగ్ బాస్ ఆడియన్స్ ని ఎంతలా అలరిస్తుందో చెప్పక్కర్లేదు.టాస్క్స్ ,ఫైట్స్ ,గేమ్స్ అంటూ ఎంగేజింగ్ గా సాగే ఈ షో కి మించిన మరేదైనా రియాలిటీ షో వస్తుందా అని అనుకున్నారంతా ,కానీ ఇపుడదే బిగ్ బాస్ కా బిగ్ బాస్ అంటూ వచ్చేసింది ట్రెయిటర్స్ అనే షో.ఇది కూడా బిగ్ బాస్ షోనే పోలి ఉండేలా డిజైన్ చేశారు.అందులో భాగంగా దాదాపు 20 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ని ఒక పెద్ద ఫ్యాలెస్ లో పెట్టేసి వారికి దాదాపు కోటి రూపాయల టార్గెట్ పెట్టడం వంటివి ఈ రియాలిటీ షో పై ఆడియన్స్ కి క్యూరియాసిటీ పెంచేశాయి.
కాని ఈ రియాలిటీ షో జరిగే తీరే ఇపుడు ప్రేక్షకులని మరింత అట్రాక్ట్ చేస్తుంది.ఇందులో పాల్గొనే 20 మంది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ని ట్రెయిటర్స్, ఇన్నోసెంట్స్‌గా డివైడ్ చేస్తారు. ట్రెయిటర్స్ తమ అసలు గుర్తింపును బయటపడకుండా చూసుకుంటూ గేమ్ ఆడాల్సి ఉంటే ఇన్నోసెంట్స్ మాత్రం తమ మధ్య ఉన్న ట్రెయిటర్స్ ఎవరో గుర్తించి వారిని బయటపెట్టేందుకు ప్రయతించాలి.
అంటే ఇదొక మైండ్ గేమ్.ఓవరాల్ గా ఇందులో ఎవరిని నమ్మాలో, ఎవరిని అనుమానించాలో ఎవరికీ తెలీదన్న మాట .సో ట్రెయిటర్స్‌లో ప్రతి మూమెంట్ కి ఒక ఓ లెక్క ఉంటుంది. ఇక్కడ ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు నటిస్తున్నారు? ఎవరు వెనుక నుంచి గేమ్ ఆడుతున్నారు? అనేది కనిపెట్టడం అంత ఈజీ కాదని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
అయితే మొదటి సీజన్ తోనే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తున్న ఈ ఈ రియాలిటీ షోలో ఇప్పుడు ఆట కంటే కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా తోటి కంటెస్టెంట్ వాడే వస్తువుపై చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి.
అవును..బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో డిబేటబుల్ అయిపొయింది.ఈ షోలో తోటి కంటెస్టెంట్ వర్ష డిసౌజా ఉపయోగించే హెయిర్ క్లిప్ రాహత్ దగ్గర కనిపించడంతో దాన్ని అప్పటికే వర్ష డిసౌజా దగ్గర చూసిన మరో కంటెస్టెంట్ శ్రీదేవి చౌదరి ఆ క్లిప్ అది ఎవరిదని అడుగుతుంది.
అంతేకాదు.ఆ హెయిర్ క్లిప్ చూడటానికి చీప్‌గా ఉందని, మిడిల్ క్లాస్ ఐటెమ్‌లా ఉందని శ్రీదేవి కామెంట్స్ చేయడం గమనార్హం,దీంతో ఒక వ్యక్తి ఉపయోగించే వస్తువు కాస్ట్లీహ ,లేక చీప్ హ అన్న దాన్ని బట్టి వారిని అంచనా వేయడం సరికాదని సోషల్ మీడియాలో శ్రీదేవిపై కామెంట్స్ విసురుతున్నారు.ముఖ్యంగా ఒకరి ఆర్థిక పరిస్థితిని గుర్తుచేసేలా లేదా వారి స్థాయిని తక్కువ చేసేలా మాట్లాడటం ఎందుకని ఏకిపారేస్తున్నారు.
అయితే మరికొందరు మాత్రం రియాలిటీ షోని పూర్తి స్థాయిలో చూస్తేనే అసలక్కడ ఏం జరిగిందో అర్థమవుతుందని,ఇలా ముక్కలు ముక్కలుగా క్లిప్స్ చూస్తే ఏమీ అర్థం కాదని,సో ఈ మాత్రం దానికి ఒక అంచనాకి వచ్చేసి జడ్జిమెంట్ పాస్ చేయడం సరికాదని తమ తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సమయంలోనే షోలో డబ్బు గురించి కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ కూడా హీట్ పెంచుతున్నాయి. శ్రావ్య వర్మ వంటి ఇతర కంటెస్టెంట్లు ఇచ్చే కౌంటర్లు, ఒకరిపై మరొకరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు గేమ్‌ను మరింత ఎంగేజింగ్ చేస్తున్నాయి.
ట్రెయిటర్స్ లాంటి షోలో కంటెస్టెంట్లు ఒకరిని మరొకరు అనుమానించడం, తమను తాము సమర్థించుకోవడం గేమ్‌లో భాగమే. అయితే పోటీ బాగా ఉన్నప్పుడు మాటలు కంట్రోల్ లో పెటుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే నిత్యం ,క్షణక్షణం కెమీరా పహారాలో ఉండే ఈ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎ మాత్రం బార్డర్ క్రాస్ చేసినా ప్యాలెస్ బార్డర్ దాటాల్సిందే కాబట్టి.
మొత్తానికి ట్రెయిటర్స్ తెలుగు మొదటి సీజన్‌లో మైండ్ గేమ్‌తో పాటు కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.చూడాలి వీటన్నింటిని దాటుకుని ఎవరు కోటి రూపాయలు ఎగరేసుకుపోతారో !
ALSO READ :తెలంగాణ పెళ్లిళ్లంటే మందు సీసాలేనా? ‘గడప’ పాటపై రచ్చ!