E-Paper
Advertisement

కాకినాడలో మైండ్ బ్లాకింగ్ చోరీ.. 204 కాసుల బంగారం, 85 తులాల వెండి మాయం!

కాకినాడలో మైండ్ బ్లాకింగ్ చోరీ.. 204 కాసుల బంగారం, 85 తులాల వెండి మాయం!
Advertisement

Kakinada Theft: ఈయన పేరు ఊటుకూరి సుబ్బారావు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు దేవీనగరం కాలనీలో ఉంటాడు. సంచుల వ్యాపారం చేస్తూ సంసార సాగరాన్ని ఈదుతున్నాడు. నైట్ హ్యాపీగా భార్యతో కలిసి లాక్స్ అవుదామని పిఠాపురం సెకండ్ షో సినిమాకి వెళ్లాడు. టికెట్లు తీసుకుని థియేటర్లో సీట్లో కూర్చున్నారు. ఇంట్లో ఎవరూ లేరన్న విషయం దొంగలకు తెలిసిపోయింది. అంతే అక్కడ సినిమా టైటిల్స్ కార్డ్స్ పడకముందే.. ఇక్కడ ఇంటి తాళాలు తెరుచుకున్నాయి. థియేటర్‌లో హీరో ఎంట్రీ ఇచ్చాడో లేదో.. అప్పుడే ఆ ఇంట్లోకి ఎవరో నీడలా వచ్చారు. బీరువాలు, అరలు, మూలమూలలూ.. అంతా సెర్చింగ్ గేమ్ స్టార్ట్ అయ్యింది. సినిమా థియేటర్‌లో ఇంటర్వెల్ బెల్ మోగేలోపే.. ఇల్లంతా ఊడ్చేసి, చెక్కేశారు.

సినిమా చూసొచ్చేసరికి షాక్..

Advertisement

సినిమా ముగిసింది.. నవ్వుతూ ఇంటికి వచ్చారు. ఆ నవ్వు గుమ్మం దగ్గరే ఆగిపోయింది. గేట్స్ తెరిచే ఉన్నాయ్.. ఇంటి తలుపులు కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. లోపల వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఇక బీరువా దగ్గరకు వెళ్లి.. షాక్‌ ఐపోయారు. బీరువాలో ఉన్న 204 కాసుల బంగారం, 85 తులాల వెండి, 20 వేల నగదు.. అంతా మాయమైంది.

క్లైమాక్స్ చూపిస్తామంటున్న పోలీసులు!

Advertisement

గొల్లప్రోలు పోలీసులకు సుబ్బారావు ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు. పోలీసులు క్లూస్‌టీమ్‌తో వచ్చి ఇళ్లంతా జల్లెడ పట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ నిందితుల కోసం వేట మొదలైంది. మరి ఈ కిలాడీ దొంగలకు పోలీసులు క్లైమాక్స్ ఎలా చూపిస్తారో చూడాలి.

Also Read: ఎమ్మెల్యే, ఎంపీ రేసు నుంచి జెడ్పీటీసీ బరిలోకి.. యువ నేతల మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Tags

Related News

ఎస్‌ఐ ప్రియాంక వేటుపై.. సోషల్ మీడియాలో విడదల రజిని సంచలన పోస్ట్?

ఎమ్మెల్యే, ఎంపీ రేసు నుంచి జెడ్పీటీసీ బరిలోకి.. యువ నేతల మాస్టర్ ప్లాన్ ఇదేనా?

మాజీ మంత్రి విడదల రజినీపై చేయిచేసుకున్న.. ఎస్‌ఐ ప్రియాంక సస్పెండ్!

‘వైసీపీది క్రిమినల్ పాలిటిక్స్.. జగన్ మనస్తత్వం రాష్ట్రానికే ప్రమాదం’.. సీఎం చంద్రబాబు సంచలనం

మైనింగ్‌లో భారీ పేలుడు.. ఐదుగురు స్పాట్ డెడ్.. హోంమంత్రి కీలక ఆదేశాలు!

ఏపీకి ‘అర్ణబ్’ తుఫాను ముప్పు.. రేపటికి తీవ్ర వాయుగుండం.. డేంజర్ జోన్‌లో ఆ జిల్లాలు!

అసెంబ్లీ సైకిల్‌ది.. మున్సిపాలిటీ ఫ్యాన్‌దేనా? ఇచ్ఛాపురంలో పీఠం ఎవరిది?

Big Stories

Advertisement
×