BigTV English

Trinayani Serial Today November 25th: ‘త్రినయని’ సీరియల్‌: నేత్రి గురించి ఆరా తీసిన గురువు – రివాల్వర్ తో నేత్రిని చంపబోయిన తిలొత్తమ్మ

Trinayani Serial Today November 25th: ‘త్రినయని’ సీరియల్‌: నేత్రి గురించి ఆరా తీసిన గురువు – రివాల్వర్ తో నేత్రిని చంపబోయిన తిలొత్తమ్మ

trinayani serial today Episode: హాసిని కూడా నేత్రి అని పిలవగానే.. తిలొత్తమ్మ, హాసినిని తిడుతుంది. నువ్వు కూడా అలా పిలుస్తున్నావేంటి అని అడుగుతుంది. చెల్లి దారిలోనే వెళ్లి వివరాలు తెలుసుకోవాలి అందుకే నేను అలా పిలుస్తున్నాను అని హాసిని చెప్తుంది. గురవు కూడా హాసిని చెప్పింది కరెక్టు అని చెప్పగానే నేత్రి.. ఇప్పుడు చెప్తున్నాను.. ఆ ఫోటోలో ఉన్న ఆవిడ నాకు అత్తయ్య అవుతారు మీరు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు అంటుంది నేత్రి. దీంతో గురువు నువ్వు విశాల్‌ను ఎక్కడ చూశావు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నావు అని అడుగుతాడు. నన్ను చూడటానికి బాబుగారు మా ఊరు వచ్చారు కదా..? అంటుంది నేత్రి. దీంతో తాను ముక్కటిపురం వెళ్లినప్పుడు జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తూ ముక్కటి పురానికి వెళ్లిన్నప్పటి గురించి చెప్పిందేమో అంటాడు.


ఇంతలో నేత్రి దేవీపురం అని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. మన ఊరు ముక్కంటిపురం కదా అక్కా అంటుంది సుమన. కాదు దేవీపురం అంటూ.. అయోమయంగా ఆ పేరు అనేశానేంటి..? అనుకుంటుంది నేత్రి. నిన్నటి వరకు ఊరు పేరు చెప్పలేదు.. కానీ ఇవాళ ఊరు పేరు చెప్తుంది అని వల్లభ అంటాడు. ఇంకా ఏమైనా గుర్తుకు వస్తున్నావా… త్రినేత్రి అని గురువు అడుగుతాడు. బాబు గారి  కోసం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లాను అని చెప్తుంది. దీంతో అవునని విశాల్‌ నీకు ఆరోజే యాక్సిడెంట్‌ జరిగింది అంటాడు.

నాకేం కాలేదని నేత్రి చెప్పగానే అవునని గురువు కూడా చెప్తాడు. దీంతో సుమన గురువుగారు కూడా కన్పీజ్‌ అవుతున్నాడు అంటుంది. దీంతో గురువు అవును ఎవరైనా అప్పుడప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటారు. దేవుడు కూడా తప్పులు చేస్తుంటారు అంటూ త్రినయని.. త్రినేత్రిగా మారిన విషయంలో కూడా అదే పొరపాటు జరిగింది అంటాడు. ఇంతలో ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉందని ఇక నాకు సీమంతం జరిగితే బాగుండు అంటుంది దురందర. ఆ మాటలకు పావణమూర్తి కోపంగా దురందరను తిడతాడు. గురువు మాత్రం సీమంతం జరపించండి అని చెప్తాడు.


విక్రాంత్‌ బయటకు వెళ్తుంటే సుమన వెళ్లి మా అక్కకు ఏదైనా మూలికలు తలకు కట్టి ఇలా చేశారా.? అని అడుగుతుంది. అసలు ఏం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు అంటాడు విక్రాంత్‌. అసలు మా అక్కను మంచి హాస్పిటల్ లోనే చూపించారా..? అని అడుగుతుంది. నాకే అర్థం కాక తల పట్టుకుంటే నీకేం చెప్పగలను అంటూ విక్రాంత్‌ కోప్పడతాడు. ఆమెను నువ్వు మీ అక్కా అనుకుంటున్నావేమో.. కానీ ఆమె మీ అక్క కాదు అని విక్రాంత్‌ చెప్పగానే సుమన షాక్‌ అవుతుంది. అవునని అసలు ఆమె ఎవరు అనేది తెలుసుకునేందుకు పోలీసులతో ఎంక్వైరీ చేయిస్తున్నాను అని విక్రాంత్‌ చెప్పి వెళ్లిపోతాడు.

మరోవైపు దేవీపురంలో  ఎస్సై చంద్రశేఖర్‌ ఊరిలో వారిని ఎక్వైరీ చేస్తుంటాడు. యాక్సిడెంట్‌ గురించి ఆరా తీస్తుంటాడు. ఇంతలో అక్కడకు నేత్రి వాళ్ల బామ్మ వస్తుంది. ఆమె వెనకాలే ముక్కోటి, వైకుంఠం పరుగెత్తుకొస్తుంటారు. బామ్మ పోలీసులకు నేత్రి ఆచూకి తెలుసుకోమని చెబితే మనం దొరికిపోతాము అంటాడు ముక్కోటి. పోలీసుల దగ్గరకు వెళ్లి మీ అమ్మ పిచ్చిది అని పోలీసులకు చెప్పాలి అంటాడు ముక్కోటి సరేనంటుంది వైకుంఠం. పోలీసు దగ్గరకు వెళ్లిన బామ్మ  నేత్రి ఫోటో ఇచ్చి నా మనవరాలు త్రినేత్రి తప్పిపోయిందని చెప్తుంది. నేత్రి ఫోటో చూసిన చంద్రశేఖర్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో దగ్గరకు వచ్చిన ముక్కోటి, వైకుంఠం రత్నాంభకు పిచ్చి అని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు.

నేత్రి దగ్గరకు వెళ్లిన తిలొత్తమ్మ  గన్‌ తీసుకుని ఎయిమ్‌ చేస్తుంది. దీంతో దీపావళి అయిపోయి చాలా రోజులైంది మళ్లీ ఆడుకుంటున్నారా..? అని నేత్రి వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతలో విశాల్‌, విక్రాంత్‌ అందరూ వస్తారు. అమ్మ ఫ్లీజ్‌ డ్రాప్‌ ద గన్‌ అంటాడు విశాల్‌. దీంతో తిలొత్తమ్మ ఎవ్వరూ దగ్గరకు రాకండి అంటుంది. దీంతో నేత్రి కూడా రాకండి బాబుగారు మీకు ప్రమాదం అంటుంది. తమ్మిని కాలుస్తుందనుకున్నావా..? మా అమ్మా అంటుంది వల్లభ. నన్ను బెదిరిస్తే మీకేం వస్తుందని.. నన్ను బయపెడితే దూరంగా వెళ్లిపోతానని అనుకుంటున్నారా..? అంటుంది నేత్రి. ఇంతలో గాయత్రి పాప వచ్చి చూస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×