Maharastra: మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ప్రశ్నకు మరికొద్దిగంటల్లోనే సమాధానం రానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించడంతో సీఎం కుర్చీని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కుర్చీపై ఎవరు కూర్చోనున్నారు అనేదానిపై మాత్రం సస్సెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సోమవారమే సీఎం ప్రమాణస్వీకారం చేయబోతున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా మహాయుతి కూటమి 235 స్థానాలను కైవసం చేసుకుంది. వీటిలో 132 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలు కాగా బీజేపీ అతిచేరువలో ఉంది.
అయితే ఫలితాల అనంతరం సీఎంగా ముగ్గురి పేర్లు వినిపించాయి. ఫడ్నవీస్ తో పాటూ షిండే, అజిత్ పవార్ పేర్లు ప్రధానంగా వినిపించగా ఇప్పుడు అజిత్ పవార్ కు మాత్రం కుర్చీ దగ్గే అవకాశాలు కనిపించడంలేదు. అజిత్ పవార్ ను ఉపముఖ్యమంత్రిగా కొనసాగిస్తారని ప్రచారం జరగుతోంది. ఫడ్నవీస్, షిండే మధ్యనే సీఎం కుర్చీ ఆట కనిపిస్తోంది. వీరిద్దరిలోనూ దేవేంద్ర ఫడ్నవీస్ ముందున్నారు. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉండటం, ప్రస్తుతం ఆయన ఉపముఖ్యమంత్రిగా ఉండటంతో పాటూ గతంలో రెండు సార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉంది.
దీంతో ఆయననే సీఎం చేయాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. అదే జరిగితే పఢ్నవీస్ ముచ్చటగా మూడోసారి సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు. మరోవైపు షిండేకు సైతం కొంతమంది బీజేపీ నాయకులు మద్దతు తెలుపుతున్నారు. ఆయన కూడా కుర్చీ విషయంలో తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఫడ్నవీస్ సీఎం ఎవరనేది మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. కానీ ఫిండే మాత్రం ఎక్కువ స్థానాలు ఏ పార్టీకి వస్తే వాళ్లే సీఎం కావాలన్న రూల్ లేదంటూ ట్విస్ట్ ఇచ్చారు.
Also read: తిరుపతిలో ఈ పోస్టయినా టీడీపీకి దక్కుతుందా..?
అంతే కాకుండా తను తీసుకువచ్చిన లడ్కీ బహెన్ యోజన వల్లనే మహాయుతి భారీ విజయం సాధించిందని అభిప్రాయపడ్డారు. దీంతో ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన షిండేకు మరోసారి తానే సీఎం కావాలనే ఆశ గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. సీఎంగా ఉన్న షిండేను చూపించి ఎన్నికలకు వెళ్లి గెలిచిన తరవాత ఆయనను పదవి నుండి తప్పిస్తే బీజేపీకి నష్టం తప్పదని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. 2019లో షిండే ప్రభుత్వాన్ని చీల్చి బీజేపీతో చేతులు కలిపి సీఎం అయ్యారు.
కాబట్టి ఆయనను తక్కువ అంచానా వేయలేం. మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉన్నా పూర్తి మెజారిటీ లేకపోవడంతో బీజేపీకి ఆ భయం కూడా ఉంది. దీంతో ఫడ్నవీస్, షిండే ఇద్దరిలో సీఎం ఎవరు అన్నదానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉండగా మరికొద్ది గంటల్లోనే ఒకరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎవరు సీఎం అయినా స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా మహాయుతి కూటమి స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే నేడు సీఎంతో పాటూ 21 మంది మంత్రలుతో కొత్త ప్రభుత్వం ఏర్పడనుందని సమాచారం అందుతోంది.