BigTV English

Pushpa 2: ఈ మెయిన్ క్యారెక్టర్స్ ని వదులుకున్న స్టార్స్ వీళ్ళే.. చేసి ఉంటే..?

Pushpa 2: ఈ మెయిన్ క్యారెక్టర్స్ ని వదులుకున్న స్టార్స్ వీళ్ళే.. చేసి ఉంటే..?

Pushpa 2:సాధారణంగా ఒక సినిమా కథ రాసుకునేటప్పుడే దర్శకుడు ఆ పాత్రలలో కొంతమంది నటీనటులను ఊహించుకొని పాత్రలు డిజైన్ చేస్తూ ఉంటారు. అయితే ఆ పాత్రలు రూపం పొందాలి అంటే అందులో అనుకున్న నటీనటులు ఒప్పుకోవాల్సి ఉంటుంది. మొదట ఆ నటీనటులకే దర్శకులు కథ వినిపిస్తారు. కానీ కొంతమంది కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మరి కొంతమంది కథ నచ్చక రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అదే కథలో ఇంకొకరు చేసి సక్సెస్ అందుకుంటే.. అయ్యో మిస్ చేసుకున్నామే అంటూ బాధపడతారు. ఇప్పటికే ‘బాహుబలి’ సినిమాలో కూడా చాలామంది పాత్రలు మిస్ చేసుకుని బాధపడ్డారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో భారీ గుర్తింపు తెచ్చుకున్న ‘పుష్ప’ సినిమాని కూడా కొంతమంది నటులు రిజెక్ట్ చేశారు. అయితే ఆ సినిమా ఊహించని విధంగా భారీ గుర్తింపు అందుకుంది. ఇప్పుడు సీక్వెల్ కూడా విడుదలకు సిద్ధమయ్యింది. మరి పుష్ప సినిమాలో క్యారెక్టర్ లను వదులుకున్న వారెవరో ఇప్పుడు చూద్దాం.


అల్లు అర్జున్ (Allu Arjun)- సుకుమార్(Sukumar )కాంబినేషన్లో 2021 లో విడుదలైన సినిమా పుష్ప. భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా అల్లు అర్జున్ కి ఏకంగా జాతీయస్థాయి అవార్డును తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో కేశవ, శ్రీవల్లీ, భన్వర్ లాల్ షెకావత్, పుష్ప పాత్రలు బాగా పాపులారిటీ అందుకున్నాయి. అయితే ఈ పాత్రలను కొంతమంది స్టార్స్ వదులుకున్నారు.

పుష్ప: ఈ పాత్రలో అల్లు అర్జున్ తన మేనరిజం చూపించి, భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ కి అల్లు అర్జున్ తప్ప ఇంకొకరు సెట్ అవ్వరు అనే విధంగా ఆయన నటించి ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఈ పాత్ర మొదట మహేష్ బాబు (Mahesh Babu) కు వెళ్లిందట. ‘1: నేనొక్కడినే’ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబుకి సుకుమార్ కథ వినిపించగా.. మహేష్ బాబు.. తనకు ఈ లుక్ సెట్ అవ్వదని రిజెక్ట్ చేసినట్లు సమాచారం.


కేశవ: పుష్పలోని కేశవ పాత్ర, పుష్ప తర్వాత అత్యంత కీలకం. ఈ పాత్రలో జగదీష్(Jagadeesh )నటించి బాగా ఆకట్టుకున్నారు. అయితే మొదట ఈ పాత్ర కోసం సుహాస్ (Suhas) ను మేకర్స్ సంప్రదించారు. కానీ సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఆ అవకాశాన్ని మిక్స్ చేసుకున్నారు.

శ్రీవల్లీ:

‘రంగస్థలం’ సినిమాలో ‘రామలక్ష్మీ’ క్యారెక్టర్ లో సమంత (Samantha )లీనమై నటించింది. ఇందులో డీ గ్లామరస్ పాత్రకు అభిమానుల సైతం ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రకి కూడా ముందుగా ఈమెను సంప్రదించారు సుకుమార్. కానీ ఆమె రిజెక్ట్ చెప్పిందట. ఇక సమంత వద్దు అనుకున్న ఈ పాత్రను రష్మిక చేసి శ్రీవల్లిగా భారీ పాపులారిటీ అందుకుంది.

అయితే సమంత ఈ సినిమాలో సుకుమార్, అల్లు అర్జున్ పిలుపుమేరకు ఐటమ్ సాంగ్ లో చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

భన్వర్ లాల్ షెకావత్ : ఈ పాత్రలో ఫహాద్ ఫాజిల్ అద్భుతంగా నటించారు. అయితే ఈ పాత్ర ముందుగా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వద్దకి వెళ్లగా ఆయన డేట్స్ సర్దుబాటు చేయలేకపోయినట్లు సమాచారం. అంతేకాదు టాలీవుడ్ లో ఈ పాత్ర కోసం నారా రోహిత్ (Nara rohith)పేరు వినిపించినా.. ఆయన ఈ పాత్ర చేయడానికి ముందుకు రాలేదట. అలా ఈ పాత్రలను ఈ నటులు వదులుకొని తర్వాత బాధపడిన సందర్భాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు వీళ్లంతా కూడా ఈ పాత్రలలో చేసి ఉండి ఉంటే కచ్చితంగా వీరి స్టార్ స్టేటస్ మరింత పెరిగి ఉండేది అని అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×