Tv Actor : ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో భర్తతో గొడవలు రావడంతో విడిపోతున్నారు. పెళ్లిళ్లు పెటాకులు, అఫైర్లు బ్రేకప్ కావడం మీడియాలో చర్చనీయాంశమవుతున్నది.. గతంలో ఎంతో మంది విడాకులు తీసుకొని విడిపోతున్నారు. రీసెంట్ గా తమన్నా, విజయ్ వర్మ సడెన్ గా బ్రేకప్ చెప్పేసి అందరికి షాక్ ఇచ్చింది. ఈ వార్త ఇంకా మరువక ముందే మరొక నటి విడిపోయింది. తన భర్తతో విడాకులు తీసుకుంది. ఈమె టీవీ సీరియల్స్ లో హీరోయిన్. తన భర్తతో విడిపోవడం అనేక చర్చలకు దారి తీస్తుంది. అసలు ఆమె భర్తతో విడిపోవడానికి అసలు కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
ఆ టీవీ సీరియల్ యాక్టర్ మరెవ్వరో కాదు.. అదితి శర్మ.. అప్పోలోనా అనే షో ద్వారా మంచి గుర్తింపు పొందిన నటి 2024 సంవత్సరం నవంబర్ లో అభినీత్‌ను వివాహం చేసుకొన్నది. అదితి కోరిక మేరకు వారి వివాహం గోరేగావ్‌లోని నివాసంలో చాలా సీక్రెట్‌గా జరిగింది. పెళ్లి చేసుకున్న విషయాన్ని గొప్యంగా ఉంచాలని కోరడంతో ఆమె భర్త కూడా ఆమె మాట ప్రకారం పెళ్లిని దాచాడు. మా పెళ్లికి నా సోదరులు, ఆమె సోదరులు, మా తల్లిదండ్రులు హాజరయ్యారు. వారంతా నాలుగు రోజులు ఉన్నారు. దాదాపు పెళ్లిలో చాలా ఫోటోలు తీసుకొన్నాం.. అయితే ఇలా ఏదో తప్పు చేస్తున్నట్లు సీక్రెట్ గా పెళ్లి చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా కాపురం నచ్చలేదని అభిషేక్ ఎన్నో సందర్భాల్లో బయటపెట్టాడు.
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి చేసుకొనే దాన్ని నేను ఇలా సింపుల్ గా చేసుకొని సీక్రెట్ కాపురం చెయ్యడం నాకు అస్సలు నచ్చలేదు. చాలా సార్లు బాధపడ్డాను. తాను మాత్రం ఎప్పుడు బాధపడలేదు. అయితే అలానే లైఫ్ ను ముందుకు సాగించాము. అయితే ఇటీవల ఒక భయంకరమైన నిజం తెలిసింది. అది షాక్ అయ్యాను. అసలు నమ్మలేక పోయాను అని ఇటీవల ఓ సందర్భంలో బయటపెట్టారు.. అదేంటంటే… గుప్తాతో అఫైర్ ఉందనే విషయం తెలిసింది. ఆ తర్వాత వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నాం అని అభిషేక్ తరుఫు న్యాయవాది వెల్లడించారు.. మ్యారేజ్ బ్రేకప్ చేసి విడాకులు తీసుకోవాలనుకొంటే మాకు ప్రతిఫలం చెల్లించాలని అదితి ఫ్యామిలీ మెంబర్స్ కోరారు. 25 లక్షలు డిమాండ్ చేశారు. దాంతో ప్రస్తుతం ఇది కోర్టులో ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. టీవీ నటి గుట్టు బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఆమె పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.
Also Read :రకుల్ రొమాంటిక్ పోజ్.. పబ్లిక్ లోనే అంతా.. ఛీ.. సిగ్గులేదా…?
ఎఫైర్ పెట్టుకొనే ఇలా సీక్రెట్ యవ్వారం నడిపింది. అందుకే సీక్రెట్ పెళ్లి చేసుకుంది. ఆమె బండారం బయట పెట్టడంతో రివర్స్ అతని మీద కేసు పెట్టడం దారుణం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇది హాట్ టాపిక్ అవుతుంది. త్వరలోనే ఈ కేసు ఒక కొలిక్కి రాబోతుంది..