Rakul Preeth: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమా అవకాశాలు రావడంతో స్టార్ హీరోల అందరి సరసన నటించింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇటీవల బాలీవుడ్ మూవీలతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఒక్క సినిమా కూడా అక్కడ హిట్ అవ్వలేదు. దాంతో మళ్లీ తెలుగులో అవకాశాల కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలతో షేర్ చేస్తుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతాయో చూస్తున్నాం. తాజాగా తన భర్తతో కలిసి రొమాంటిక్ పోజ్ ఇస్తూ ఒక ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య కాలంలో పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. సినిమాల్లో ఆఫర్లు తగ్గిన వెంటనే తన చిరకాల ప్రేమికుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని నిర్ణయించుకుంది.. అలాగే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కుటుంబ సన్నిహితులు, స్నేహితులు, బంధువుల హాజరు అయ్యారు. ఫిబ్రవరి 21, 2024 న వీరి వివాహం జరిగిన విషయం తెల్సిందే.. ఆమె పెళ్లి అయ్యి ఏడాది కావొస్తుంది. తన భర్తతో పెళ్లి రోజును గ్రాండ్ గా చేసుకోవాలని అనుకుంది. అందుకే మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తుంది.. మాల్దీవ్స్ నుంచి రెగ్యులర్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈమె భర్త జాకీ భగ్నానీతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. రొమాంటిక్‌గా భర్తతో ఉన్న ఫోటోను రకుల్ షేర్ చేసింది. ఆ పిక్ ప్రస్తుతం నెట్టింట ట్రోల్స్ కు గురైంది..
ఆ పిక్ లో స్విమ్మింగ్ పూల్ లో తన భర్త భగ్నాని తో రొమాంటిక్ పోజ్ లో కనిపించింది. సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ ఒకరి మొహంలోకి ఒకరిని చూసుకుంటూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చారు. పెళ్లి అయి ఏడాది అవుతున్నా కొత్త జంట మాదిరిగానే వీరిద్దరు ఉన్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తాని కి సోషల్ మీడియా ద్వారా వీరిద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తోంది. ఆ సినిమాల ఫలితాలపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుని ఉంది. కనీసం ఆ సినిమాలు హిట్ అయినా మళ్లీ బిజీ అవ్వాలని రకుల్ ఆశ పడుతుంది. దే దే ప్యార్ దే సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఆ సినిమా సీక్వెల్ తో సక్సెస్ దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.. తెలుగులో అయితే సినిమాలు అనౌన్స్ చెయ్యలేదు.. ఈమధ్య కాలంలో ఈమెకు ఒక్క సినిమా కూడా విజయాన్ని తెచ్చి పెట్టలేదు. కనుక ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అన్న విషయంగా ఆలోచనలో పడేస్తుంది..