OTT Movie : మనుషుల జీవితాలను సినిమాలలో చూపిస్తూనే ఉంటారు. వాటిలో కొన్ని మాత్రం మనసుకు హత్తుకుంటాయి. ఇప్పుడు ఒంటరిగా ముసలి వయసులో జీవితాన్ని మొదలుపెట్టే ఒక వృద్దుడి స్టోరీ గురించి తెలుసుకుందాం. రష్యా, జార్జియా సరిహద్దు యుద్ధ వాతావరణం లో ఈ స్టోరీ జరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …
గూగుల్ ప్లే (Google Play) లో
ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘కార్న్ ఐలాండ్’ (Corn island). ఈ జార్జియన్ డ్రామా మూవీకి జియోర్జి ఓవాష్విలి దర్శకత్వం వహించారు. ఒక తాత, మనవరాలు సైనిక సంఘర్షణలు, ఉద్రిక్తతల మధ్య ఎంగూరి నదిలోని ఒక సిల్ట్ ద్వీపంలో మొక్కజొన్న పంటను పండించడానికి ప్రయత్నిస్తారు. మనవరాలు కోసం తాత చాలా దిగులు పడుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ సైనికులకు ఈ అమ్మయిపై కన్ను ఉంటుంది. ఈ మూవీ జార్జియన్, అబ్ఖాజ్ భాషలతోనే కాకుండా ఆంగ్ల భాషా వెర్షన్ లో కూడా విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ గూగుల్ ప్లే (Google Play) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
జేసన్ 60 సంవత్సరాలు దాటిన వృద్ధుడు. అతడు ఒక చిన్న దీవిని తన నివాస స్థావరంగా ఏర్పరుచుకోవాలని అనుకుంటాడు. అక్కడ కొంత ప్రాంతం మాత్రమే పంట వేయడానికి అనుకూలంగా ఉంటుంది. తనతో పాటు తన మనవరాలు రియాని కూడా అక్కడికి తెచ్చుకుంటాడు. వీళ్లకు ఎవరూ ఉండకపోవడంతో, వాళ్ళే ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. జేసన్ ఇప్పుడు మనవరాలి గురించి భయపడుతూ ఉంటాడు. తాను బ్రతికుండగానే ఆమెను చదివించాలనుకుంటాడు. అయితే ఆ ప్రాంతంలో రష్యా, జార్జియా మధ్య యుద్ధ వాతావరణం ఉంటుంది. ఇక అక్కడ చిన్న గుడిసెను వేసుకుంటారు. అక్కడ వీళ్లకు తినడానికి చేపలు తప్ప ఏమీ ఉండవు. వాటిని తింటూనే అక్కడ వ్యవసాయం చేయాలని అనుకొంటారు. ఆ తరువాత ఒక చిన్న మొక్కజొన్న పంటను వేస్తారు. అక్కడ సైనికులు తిరుగుతూ రియా వైపు అదోలా చూస్తూ ఉంటారు. జేషన్ కు వాళ్లు అలా ఎందుకు చూస్తున్నారో అర్థమవుతుంది.
అక్కడ ఒక రష్యన్ సైనికుడి కోసం వెతుకుతూ ఉంటారు జార్జియా సైనికులు. అయితే ఆ సైనికుడు వీళ్ళ పొలం దగ్గర గాయాలతో పడి ఉంటాడు. అతనికి నయం చేసి ప్రాణాలు కాపాడుతాడు పెద్దాయన. ఆ తర్వాత రియా అతన్ని ఇష్టపడటం మొదలు పెడుతుంది. ఇంతలోనే జార్జియా సైనికులకు భయపడి రష్యన్ సైనికుడు పారిపోతాడు. ఆ తర్వాత వర్షం కూడా జోరుగా వస్తుంది. వేసిన పంట నీటిలో కొట్టుకుపోకుండా, పడవ మీద సర్దుతూ ఉంటాడు జేసన్. వర్షం మరింత ఎక్కువగా పడటంతో జేసన్ చాలా బాధపడతాడు. మనవరాలిని పడవలో దూరంగా పంపుతాడు. చివరికి ఆ వృద్ధుడుకి పంట చేతికి వస్తుందా? రియా జీవితం ఏమవుతుంది? సైనికుల వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘కార్న్ ఐలాండ్’ (Corn island) అనే ఈ మూవీని చూడండి.