E-Paper
Advertisement

ఇక ఆట షూర్.. బిగ్ బాస్ 10 హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్!

ఇక ఆట షూర్.. బిగ్ బాస్ 10 హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్!
Advertisement

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10 తెలుగు  బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది . ఈ కార్యక్రమంలో భాగంగా హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లకు సంబంధించి ఇదివరకు ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలన్నింటికీ తెర దించుతూ ఒక్కొక్క కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమంలో భాగంగా తొలి కంటెస్టెంట్ గా హౌస్ లోకి సీరియల్ నటి దెబ్జానీ మోదక్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో స్టేజ్  పైకి వచ్చి తన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది అనంతరం నాగార్జున గారి పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. అనంతరం వచ్చిరాని తెలుగులో ముద్దు ముద్దు మాటలతో నాగార్జున అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చారు.

చాలా నిజాయితీగా ఉంటాను..

ఇక నాగార్జున హౌస్ లో ఎలా ఉండబోతున్నావో 3 మాటలలో చెప్పాలి అంటే ఏం చెబుతావు అని అడగగా తాను చాలా నిజాయితీగా ఉంటాను. అందరితో సరదాగా ఉంటూ మంచిగా ఎంటర్టైన్ చేస్తాను అంటూ ఈమె తెలియజేశారు. అదేవిధంగా తన డ్రీమ్స్ గురించి కూడా అడిగి తెలుసుకున్నారు తనకు విచిత్రమైన కలలు వస్తున్నాయని చెప్పారు.
తన కోరిక ఏంటి అంటే బీచ్ లోకి తాను ఒక పింక్ కలర్ ఫ్రాక్ వేసుకొని అలా కూర్చుని ఉన్నప్పుడు తెల్ల గుర్రాలపై రాకుమారుడు వస్తున్నట్లు కలకంటూ ఉంటానని ఈమె తన కళల గురించి తెలిపారు. అయితే ఇలాంటివన్నీ కూడా కలలో మాత్రమే జరుగుతాయి కానీ నిజజీవితంలో కాదు అంటూ దెబ్జానీ తెలిపారు.

బాయ్ ఫ్రెండ్ గురించి  ఓపెన్ అయిన దెబ్జానీ..

Advertisement

మరి నిజ జీవితంలో రాకుమారుడు ఉన్నారా అంటూ నాగార్జున ప్రశ్నించారు ఆ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ ఉన్నాడా లేదా అనే కన్ఫ్యూషన్ లోనే తాను ఉన్నానని, ఆ విషయంలో తనకు క్లారిటీ వచ్చిన వెంటనే ముందుగా మీకే చెబుతాను అంటూ దెబ్జానీ తెలిపారు. ఇక హౌస్ లోకి వెళ్లడానికి ముందు నాగార్జున తనకు ఒక బాక్స్ ఇస్తారు. అందులో 18 బ్యాడ్జెస్ ఉన్నాయని, అందులో ఉన్న ఒక్కొక్క క్వాలిటీ హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్లకు సరిపడా బ్యాడ్జ్ వేయాలని నాగార్జున చెబుతారు. ఇక ఈమె హౌస్ లోకి వెళ్లడానికి ముందు నాగార్జున నాకోసం ఒక పాట పాడు అంటూ ఆమెను అడగడంతో నాగార్జున కోసం “గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది” అంటూ ఇవే పాట పాడుతూ నాగార్జునను ఇంప్రెస్ చేస్తుంది.

ఫస్ట్ కంటెస్టెంట్ గా డెబ్జానీ..

Advertisement

ఇలా నాగార్జున కోసం పాట పాడిన అనంతరం దెబ్జానీను నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు. ఇక ఈమె కోసం గేట్స్ ఓపెన్ అవ్వడంతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్ మొత్తం తిరుగుతూ చాలా ఎగ్జైట్ అవుతుంది. ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దెబ్జానీ హౌస్ లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుంది, ఆమె ఆట తీరు ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Also Read: ‘దాదా’గా విశ్వరూపం చూపించబోతున్న బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?

Related News

డిగ్రీలో 5 సబ్జెక్టులు ఫెయిల్.. సింగపూర్ లో హౌస్ కీపింగ్ జాబ్.. . సుధీర్ రెడ్డి స్టోరీ ఇదే!

టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ!

అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Big Stories

Advertisement
×