E-Paper
Advertisement

ఇప్పుడే సంబ‌రాలు చేసుకోకండి..ఫైన‌ల్స్ లో ప్ర‌తీకారం తీర్చుకుంటాం

ఇప్పుడే సంబ‌రాలు చేసుకోకండి..ఫైన‌ల్స్ లో ప్ర‌తీకారం తీర్చుకుంటాం
Advertisement

Javed Miandad On IND VS PAK:  ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా తాజాగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (India Women vs Pakistan Women, Match 9) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా… 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ మహిళల జట్టును చిత్తు చేసింది. పాకిస్తాన్ జట్టును ఓడించడమే కాకుండా ఆసియా కప్ కచ్చితంగా గెలుస్తామని సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో టీమిండియా మహిళల జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జావేద్ మియాందాద్ (Javed Miandad). ఇప్పుడే సంబరాలు చేసుకోకండి.. ముందుంది ముసళ్ళ పండుగ అంటూ వార్నింగ్ ఇచ్చారు. గ్రూప్ స్టేజ్ లో మీరు గెలిచినప్పటికీ… పాకిస్తాన్ ఉమెన్స్ టీం ఈసారి ఆసియా కప్ టైటిల్ గెలవడం గ్యారెంటీ అని సవాల్ విసిరారు జావేద్ మియాందాద్. దీంతో జావేద్ మియాందాద్ (Javed Miandad) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

ఇప్పుడే సంబ‌రాలు చేసుకోకండి..ఫైన‌ల్స్ లో ప్ర‌తీకారం తీర్చుకుంటాం

ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా ఏకంగా ఏడు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ విజయంతో టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకుంటే… పాకిస్తాన్ అభిమానులు మాత్రం తమ జట్టు ప్లేయర్లను దూషిస్తున్నారు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ (Javed Miandad) హాట్ కామెంట్స్ చేశారు. గ్రూప్ స్టేజిలో ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన.. ఏం మునిగిపోలేదని వ్యాఖ్యానించారు. ఫైనల్స్ లో మాత్రం టీమిండియాను పాకిస్తాన్ ఓడించడం గ్యారంటీ అని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ పాకిస్తాన్ ఛాంపియన్ కాకపోతే.. లాహోర్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానని చాలెంజ్ విసిరారు జావేద్ మియాందాద్. అయితే, జావేద్ మియాందాద్ చేసిన వ్యాఖ్య‌ల‌కు టీమిండియా ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఒక‌సారి జావేద్ త‌న ముఖాన్ని అద్దంలో చూసుకోవాల‌ని చుర‌క‌లు అంటిస్తున్నారు. 1000 జ‌న్మ‌లు ఎత్తినా టీమిండియాపై పాకిస్తాన్ గెల‌వ‌బోద‌ని కౌంట‌ర్లు ఇస్తున్నారు.

ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసిన టీమిండియా

Advertisement

ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య తొమ్మిదవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా… బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 55 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కేవలం ఎనిమిది ఓవర్లు ఆడి 3 వికెట్లు నష్టపోయిన టీమిండియా… లక్ష్యాన్ని చేదించింది.

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

Related News

ఇండియా, పాకిస్తాన్ మ‌ధ్య ట్రై సిరీస్‌…ఐసీసీ ప్లాన్ అదుర్స్‌

పాకిస్తాన్ జ‌ట్టులోనూ కోటీశ్వరులు…షోయ‌బ్ అక్త‌ర్ నుంచి బాబ‌ర్ వ‌ర‌కు ఎవ‌రి ఆస్తులు ఎంతంటే ?

రియాజ్.. నీకు బుర్ర ఉందా ? 55 ప‌రుగుల చేసిన పాకిస్తాన్, ఎలా ఆసియా క‌ప్ కొడుతుంది ?

పాకిస్తాన్ ఘోర ఓట‌మి…హుటా హుటిన‌ దుబాయ్ వెళ్లిన న‌ఖ్వీ..!

టీమిండియా చేతిలో ఓడినా, ఆసియా కప్ గెలుస్తాం – పాక్ కోచ్ సంచలనం

వైభ‌వ్ ఓవ‌రాక్ష‌న్‌..మ్యాచ్ మ‌ధ్య‌లో తిల‌క్ వ‌ర్మ‌కు స్ట్రాంగ్ వార్నింగ్

లైవ్ మ్యాచ్ లో బ‌రితెగించిన పాక్ ఫ్యాన్స్‌…”క్రాంతి గౌడ్” మ‌గాడంటూ కేక‌లు !

Big Stories

Advertisement
×