E-Paper
Advertisement

భర్తనే నమ్మలేని పరిస్థితి… అమెరికా రాజకీయాల్లో మరో భారీ కుట్ర… ఓటీటీలో తాజా సీజన్ రచ్చ

భర్తనే నమ్మలేని పరిస్థితి… అమెరికా రాజకీయాల్లో మరో భారీ కుట్ర… ఓటీటీలో తాజా సీజన్ రచ్చ
Advertisement

Political Thriller Web Series OTT : రాజకీయాల్లో శత్రువులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం కష్టం. కానీ మన పక్కనే ఉన్న వ్యక్తి మనకు తెలియకుండా మోసం చేస్తున్నాడని అనుమానం వస్తే పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. దేశాల మధ్య సంబంధాలు, రహస్య ఒప్పందాలు, అధికార పోటీలు ఒకవైపు… ఇలాంటి పరిస్థితిలో ఇంట్లో వాళ్ళ వల్లే నమ్మకం దెబ్బతినడం మరోవైపు… దౌత్యవేత్తగా ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కొనే మహిళ తన జీవిత భాగస్వామిపైనే అనుమానం పెంచుకోవాల్సి వస్తే, ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుంది ? ఈ ప్రశ్నకు మరిన్ని రాజకీయ మలుపులు జోడిస్తూ తిరిగొస్తున్న సిరీస్‌ ‘ది డిప్లొమాట్‌ సీజన్‌ 4’ (The Diplomat Season 4). మరి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ ? తెలుగులో ఉందా ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

కేట్‌ వైలర్‌ అమెరికా విదేశాంగ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించే దౌత్యవేత్త. అంతర్జాతీయ సంక్షోభాలు, దేశాల మధ్య ఉద్రిక్తతలు, రాజకీయ ఒప్పందాల వెనుక ఉన్న లెక్కలను అర్థం చేసుకోవడం ఆమె పనిలో భాగం. కానీ ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. భర్త హాల్‌ వైలర్‌ తో ఉన్న సంబంధంలో రాజకీయాల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. గత సీజన్‌ ముగింపులో బయట పడిన పరిణామాలు కేట్‌ నమ్మకాన్ని కదిలించాయి. అమెరికా అధ్యక్షురాలు గ్రేస్‌ పెన్‌, ఉపాధ్యక్షుడిగా ఉన్న హాల్‌ మధ్య ఉన్న రహస్య సంబంధంపై ఆమెకు తీవ్రమైన సందేహాలు మొదలవుతాయి.

Advertisement

నాలుగో సీజన్‌ ఈ అనుమానాల దగ్గర నుంచే కొత్త సమస్యలను తీసుకొస్తుంది. కేట్‌ ఒకవైపు అమెరికా ప్రయోజనాలను కాపాడాలి. మరోవైపు తనకు తెలిసిన నిజం ఎంత వరకు బయట పెట్టాలి, ఎవరిని నమ్మాలి, ఏ నిర్ణయం తీసుకుంటే అంతర్జాతీయ సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయాల గురించి ఆలోచిస్తుంది. ముఖ్యంగా అమెరికా – బ్రిటన్‌ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం, రహస్య రాజకీయ నిర్ణయాలు ప్రపంచ స్థిరత్వాన్ని ప్రభావితం చేసే పరిస్థితి కథలో ఉత్కంఠను పెంచుతాయి.

ఈ సిరీస్‌ ప్రత్యేకత ఏమిటంటే… రాజకీయ చర్చలు, అధికారుల సమావేశాలు మాత్రమే కాకుండా వాటి వెనుక జరిగే వ్యక్తిగత పోరాటాలను కూడా ఇందులో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఒక నిర్ణయం దేశాన్ని కాపాడవచ్చు. కానీ అదే నిర్ణయం కుటుంబ బంధం బీటలు వారడానికి కారణం కావచ్చు. కేట్‌ ఎదుర్కొనే అసలు చిక్కు కూడా అదే. మరి ఈ సమస్యను ఆమె ఎలా సాల్వ్ చేస్తుంది ? అన్నది సిరీస్ లో చూడాల్సిన విషయం.

Advertisement

Also Read : ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

ఏ ఓటీటీలో చూడవచ్చు ?

‘ది డిప్లొమాట్‌ సీజన్‌ 4’ అక్టోబర్‌ 15న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలైంది. ఈ సీజన్‌ లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్నాయి. తెలుగు డబ్బింగ్‌ ఆడియో అందుబాటులో లేదు. కానీ ఇంగ్షీషు, హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. గత సీజన్లు చూసినవారు కొత్త సీజన్‌ ప్రారంభించే ముందు మూడో సీజన్‌ ముగింపును గుర్తుచేసుకుంటే కథలోని రాజకీయ మలుపులు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. సీజన్ 4లో కెరీ రస్సెల్‌ (Keri Russell) కేట్‌ పాత్రలో, రూఫస్‌ సెవెల్‌ (Rufus Sewell) హాల్‌ పాత్రలో తిరిగి కనిపిస్తారు. అలిసన్‌ జానీ (Allison Janney) పోషించే అధ్యక్షురాలు గ్రేస్‌ పెన్‌ పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుంది.

Tags

Related News

చదువుకున్న స్కూల్‌కే టీచర్‌గా… పిల్లలతో ఈ మాజీ స్టూడెంట్ పడుతున్న కష్టాలు చూస్తే నవ్వులే నవ్వులు

బర్త్‌డే పార్టీకి వెళ్లి తుఫానులో… ఒక్కొక్కరి నిజ స్వరూపం చూస్తే మైండ్ బ్లాక్… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న డార్క్ కామెడీ

ఫ్రెండ్స్‌తో కలిసి కేఫ్‌ మొదలుపెడితే… మన ఫ్రెండ్స్ గ్యాంగ్‌ని గుర్తుచేసే మలయాళం కామెడీ సిరీస్ తెలుగులో

కోమా నుంచి లేచాక ఎదుటివాళ్ల మనసులోని మాటలు వినిపిస్తే ? కడుపుబ్బా నవ్వించే మలయాళ సూపర్ హిట్ కామెడీ డ్రామా

బంగారు లాకెట్‌తో మొదలైన చిక్కులు… కోర్టును షేక్ చేసే మత్స్యకారుడి పోరాటం… ఓటీటీలో తెలుగులో ఎమోషనల్ డ్రామా

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

Big Stories

Advertisement
×