Vishnu priya: విష్ణు ప్రియ (Vishnu Priya) .. యాంకర్ గా బోలెడు ఫేమ్ సొంతం చేసుకున్న ఈమె బిగ్ బాస్ (Bigg Boss) కి వెళ్లిన తర్వాత మరింత పాపులారిటీ అయిపోయింది. ఇక ఈమధ్య తన బాయ్ ఫ్రెండ్ అంటూ పృథ్వీరాజ్ (Prithviraj Shetty) చుట్టూ గింగిరాలు కొడుతోంది. తప్పని తెలిసినా.. పదేపదే చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ అమ్మడు . బిగ్ బాస్ హౌస్ లో ఈ పిచ్చి తోనే విన్నర్ కాకుండా బయటకు వచ్చేసింది.. ఇక ఆమె పిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు నాకు నువ్వు ఇష్టం లేదు మొర్రో అని చెప్పినా అతడి వెంట తిరుగుతూ అతడిపై పడుతూ చూసేవారికి కూడా కాస్త ఇబ్బందికరంగా అనిపించేలా ప్రవర్తిస్తోంది విష్ణు ప్రియ అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
పృథ్వీ పై ప్రేమ.. చీత్కరించినా పర్లేదు అంటున్న విష్ణు ప్రియ..
బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎంతమంది ఈమెకు ఎన్ని విధాలుగా చెప్పి చూసినా.. పృథ్వీ పై ఉన్న ప్రేమను పక్కన పెట్టలేకపోయింది. అతను హీనంగా చూసినా.. అతనికి అవసరం ఉన్నప్పుడు ఒకలాగా.. అవసరం లేనప్పుడు ఒక్కోలాగా ప్రవర్తించినా సరే.. ఆమె మాత్రం అతడి మాయలోనే పడిపోయింది. అతని కాళ్లు పట్టి.. ఒళ్ళు నొక్కి ఎట్టి చాకిరీ కూడా చేసింది. అయినా సరే పృథ్వీ మాత్రం విష్ణుప్రియను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు. కానీ ఈమె మాత్రం ఇతడి మాయలో పడి టైటిల్ విన్నర్ కాకపోవడమే కాకుండా ఉన్న పేరుని కూడా చెడగొట్టుకుంది. ఇక తనపై ఉన్న పాజిటివ్ ఒపీనియన్ మొత్తాన్ని పాడు చేసుకుంది విష్ణు ప్రియ. ఇకపోతే ఇప్పుడు అతనిపై ఆపిచ్చి పెరిగిందే కానీ తగ్గలేదు అందులో భాగంగానే మరొకసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పృథ్వీ పై రిలేషన్ ను మరొకసారి బయటపెట్టింది.
ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నామంటూ బాంబు పేల్చిన విష్ణు ప్రియ..
” నేను ఎంజాయ్ చేస్తూనే పని చేస్తాను. సంపాదన ఒక్కటే ప్రధానం కాదు కదా.. ఎంజాయ్ కూడా ఉండాలి. నాకు వచ్చిన దాంట్లోనే ఖర్చు పెట్టుకుంటాను. సహాయం కూడా చేస్తాను. పెళ్లి తర్వాత కూడా నేను పని చేస్తాను. అయితే వారంలో రెండు మూడు రోజులు మాత్రమే పని చేసేలా ప్లాన్ చేసుకుంటాను. పెళ్లి ఎప్పుడు అంటే నాలో ఎంత వైబ్రేషన్ ఉందో.. అటు నాకు కాబోయే వాడిలో కూడా అంతే వైబ్రేషన్ ఉండాలి. అలాంటి వాడు వస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను.. లేదంటే సింగిల్గానే ఉండిపోతాను. నాకు కూడా ఆశలు, కోరికలు ఉన్నాయి. అవి తీరకపోతే కృంగిపోను. అవ్వకపోయినా పర్లేదు అనుకుంటాను. ఇక పృథ్వీ తో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎలాంటి రిలేషన్ అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. బిగ్బాస్ తర్వాత మళ్లీ పృథ్వీ కోసమే కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ కి వైల్డ్ కార్డు ద్వారా వెళ్లాను. బిగ్ బాస్ లో గేమ్ పృథ్వీ కోసం ఆడాను అనుకుంటున్నారు. ఇప్పుడు అతని కోసం వెళ్తే తప్పేముంది. ఒక మా ఇద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉందా అంటే కలిసినప్పుడు అది జరుగుతుంది. ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తున్నాం. ఏదైనా జరగొచ్చు. జరిగిన ఓకే జరగకపోయినా ఓకే.. కావాలని ఏది ఫోర్స్ చేయను. పృథ్వీ విషయంలో నా జీవితంలో ఏం జరిగినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కుండ బద్దలు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. విష్ణు ప్రియ మాటలు విన్న నెటిజన్స్ ఇంతలా ఎలా మారిపోయావు విష్ణు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించడం వెనుక ఇంత బాధ ఉందా?