Kollywood:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathi) తనను మోసం చేశాడు అంటూ ఒక హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు విజయ్ దళపతి పై అలాంటి కామెంట్స్ చేసింది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి, మిస్ ఆంధ్ర ప్రదేశ్ గా టైటిల్ గెల్చుకొని, ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన ప్రముఖ హీరోయిన్ నందిని రాయ్ (Nandini Rai). సినిమాలలో ఎక్కువగా గ్లామర్ పాత్రలు పోస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె బిగ్ బాస్ (Bigg Boss)లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె ఒక సినిమా గురించి, తన పాత్రల గురించి చెప్పుకొచ్చింది.
విజయ్ మూవీ విషయంలో మోసం చేశారు – నందిని రాయ్
నందిని రాయ్ మాట్లాడుతూ.. “విజయ్ దళపతి నటించిన ‘వారసుడు’ సినిమాలో నాది చిన్న పాత్ర కాదు. స్టోరీ చెప్పినప్పుడు నిడివి చాలా వుంది. ప్రకాష్ రాజ్ కూతురు పాత్ర నాది. శ్రీకాంత్ ను రెచ్చగొట్టి ఫ్యామిలీని డివైడ్ చేయాలి. అవన్నీ కూడా షూటింగ్ చేశారు .అయితే ఒక మంచి క్యామియో పాత్ర కానీ ఎడిటింగ్ లో చాలా సన్నివేశాలు తీసేసారు. సినిమాలో రెండు నిమిషాలు కూడా నా పాత్ర లేదు. ఈ విషయం నాకు ముందు తెలియలేదు. సినిమా విడుదలయ్యాక అసలు విషయం తెలిసింది. ఎందుకు ఈ సినిమా చేసావని చాలామంది నన్ను ప్రశ్నించారు కూడా.. ఇక నేను ఏం చేయలేను కదా.. ఆ సినిమా చేసినందుకు బాధపడ్డాను.. నా పోస్టర్ కూడా సపరేటుగా రిలీజ్ చేసేసరికి పెద్ద పాత్ర అనుకున్నాను. కానీ సడన్గా షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని నేను ఊహించలేదు. ఈ సినిమా వల్ల నెగటివ్ ఇంపాక్ట్ వచ్చింది. విజయ్ వారసుడు మూవీ లాంటి పాత్రలు ఇకపై మళ్ళీ చేయను. ఆయనకు తెలియకుండానే ఇదంతా జరుగుటుందని నేను అనుకోను” అంటూ తన బాధను వెళ్ళబుచ్చుతూ తన మనసులో మాటగా చెప్పుకొచ్చింది నందిని రాయ్ . ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది – నందిని రాయ్
నందిని రాయ్ తన గ్లామర్ పాత్రల గురించి కూడా మాట్లాడుతూ.. “నేను ఇకపై స్కిన్ షో చేయకూడదని నిర్ణయించుకున్నాను. అనకాపల్లి అనే మూవీలో చాలా గ్లామర్ గా నటించాను. అది చూసి అమ్మా నాన్న తిడతారేమో.. అదే నా లాస్ట్ సినిమా అనుకున్నాను. ఇక ఈ సినిమా తర్వాత అన్నీ అలాంటి పాత్రలే వస్తున్నాయి. ఇవి నా కెరియర్ పై మరింత ఎఫెక్ట్ చూసే అవకాశం ఉంది. అందుకే ఇకపై నేను ఇలా ఐటమ్ సాంగ్స్, అలాంటి సన్నివేశాలు చేయకూడదని అనుకుంటున్నాను. ఇప్పటికీ నాకు కథలు వస్తున్నాయి కానీ డి గ్లామర్ రోల్స్ మాత్రమే చేయాలనుకుంటున్నాను” అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది నందిని రాయ్.ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Vishnupriya: అందుకే పృథ్వీతో ఎంజాయ్ చేస్తున్న.. బాంబు పేల్చిన విష్ణు ప్రియ!