BigTV English

Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించడం వెనుక ఇంత బాధ ఉందా?

Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించడం వెనుక ఇంత బాధ ఉందా?

Sr.NTR:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకించి కొంతమందిని మనం గమనిస్తే వారి వేషధారణ కాస్త అందరికంటే భిన్నంగా ఉంటుంది. అటు వేషధారణ మాత్రమే కాదు వారు ధరించే వస్తువులు కూడా వారికి ఒక ఐడెంటిటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు దిగ్గజ దర్శకులు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) ను తీసుకుంటే ఆయన పేరు తలుచుకోగానే ఆయన సినిమాలతో పాటు చేతికి ఎర్రటి దారాలు, తలకి తెల్లటి పాగా, నుదుటిన ఎర్రటి బొట్టు మనకు దర్శనం ఇస్తాయి. అలాగే స్వర్గీయ నందమూరి తారక రామా రావు( Sr.NTR ) కూడా ముఖ్యమంత్రి అయ్యాక కాషాయ వస్త్రాలు ధరించి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఆ తర్వాత కాలంలో కూడా ఆయన ఎక్కువగా కాషాయ వస్త్రాలలోనే కనిపించి ఆయనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు అయితే ఇలా సీనియర్ ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించడం వెనుక ఉన్న కారణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


అక్కడే తొలిసారి కాషాయ వస్త్రాలలో కనిపించిన సీనియర్ ఎన్టీఆర్..

తెలుగు సినిమా పరిశ్రమలో అలనాటి హీరో నందమూరి తారక రామారావు కేవలం నటులు మాత్రమే కాదు.. నిర్మాత, దర్శకులు, రాజకీయవేత్త కూడా.. ఈ రంగాలలో ఎవరికి సాధ్యం కానీ రికార్డులు సైతం ఆయన సృష్టించారు. సినిమా నటుడు గానే ఉంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కాషాయ దుస్తులలోనే ఎక్కువగా కనిపించేవారు.ఒకసారి ఎన్టీఆర్ తిరుపతిలో జరిగిన ఒక సినిమా అవార్డు ఫంక్షన్ కి వెళ్లారు. అక్కడ మొదటిసారి కాషాయ దుస్తుల్లో కనిపించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఎందుకు అలా వచ్చారు అని అడిగే ధైర్యం అప్పట్లో ఎవరికీ వుండేది కాదు. కానీ ఆ అవార్డు ఫంక్షన్ తర్వాత కొంతమంది విలేకరులు మాత్రం ఆయన వస్త్రధారణ ఎన్టీఆర్ ను ప్రశ్నించారు.


కాషాయ వస్త్రధారణ వెనుక ఇంత బాధ ఉందా..?

ఎన్టీఆర్ ఆ ప్రశ్నకు సమాధానంగా ఒక సంఘటన నా జీవితాన్ని పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. అందుచేతనే ఈ కాషాయ వస్త్రాలు ధరించాను అంటూ తెలియజేశారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చిన్నారులపై అత్యాచారాలు జరిగిన సంఘటనలు ఆయనను కలచివేసాయట. దీంతో జీవితం పట్ల విరక్తి పుట్టిందని ఎన్టీఆర్ తెలియజేశారు. అంతేకాదు అదే సమయంలో హైదరాబాదుకి అగ్నివేష్ స్వామిజీ రావడంతో ఆయన దగ్గరికి వెళ్లిన సీఎం ఎన్టీఆర్.. ఈ బట్టల గొప్పతనం గురించి తెలుసుకొని అందుచేతనే అప్పటినుంచి ఎక్కువగా కాషాయ దుస్తుల్లోనే కనిపించే వారని సమాచారం

ఎన్టీఆర్ కి అగ్ని వేశ్ స్వామీజీ హితబోధ..

ఇకపోతే అగ్నివేష్ స్వామీజీ ఎన్టీఆర్ కి ఈ కాషాయ వస్త్రాల గురించి హితబోధ కూడా చేశారట. అందులో ఆయన ఏం చెప్పారంటే.. సన్యాసిగా ఉంటే ఎలాంటి స్వార్థం ఉండదని, మన కోసం కాకుండా సమాజం కోసం మాత్రమే పనిచేయాలనే ఆలోచన మనలో మొదలవుతుందని హితబోధ ఇచ్చారట. ఇక అప్పటినుంచి ఎన్టీఆర్ వాటిని ఫాలో అవుతూ అందరిని సమానంగా చూస్తూ వచ్చారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించడం వెనుక ఉన్న అసలు ఆంతర్యం తెలిసి అందరూ ఎమోషనల్ అవుతున్నారు. చిన్నారులపై అత్యాచారాలు నాడే కాకుండా ఇప్పటికీ జరుగుతూనే ఉండడం మన దౌర్భాగ్యం అని చెప్పాలి.

ALSIO READ:Sr. NTR: రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం.. ఇకపై ప్రతి ఏటా..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×