Layola College Job Scam: హైదరాబాద్ అల్వాల్‌లోని లయోలా కాలేజీ యాజమాన్యంపై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థులు. విదేశాలలో ఉద్యోగాల పేరుతో మోసం చేశారంటున్నారు స్టూడెంట్స్. ఒక్కొక్కరి నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేసి.. ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇచ్చారంటున్నారు విద్యార్థులు. మూడు నెలల నుంచి కాలేజీ చుట్టూ తిరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు.
ఇక తాజాగా ఉద్యోగాల పేరుతో మోసం చేసిన.. అల్వాల్‌లోని లయోలా కాలేజీ ఇష్యూ పోలీస్ టర్న్ తీసుకుంది. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన విద్యార్ధులకు.. పోలీసులు ఫోన్ చేశారు. విజయ్ అనే స్టూడెంట్‌కి అల్వాల్ ఎస్సై కాల్ చేశారు. ఇంకోసారి కాలేజీకి వెళ్లి ఇష్యూ చేయొద్దని హెచ్చరించారు. యాజమాన్యం చెప్పినట్లు జూన్ 25 వరకు ఆగాల్సిందేనన్నారు. లేదని మళ్లీ ధర్నా చేస్తే కేసులు పెడతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాము ఒక్కసారి కేసు నమోదు చేస్తే మీ లైఫ్ ఆగమైతదని చెప్పారు. ఏ దేశానికి కూడా వెళ్లలేరన్నారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే తమ దగ్గరకు రావాలని సూచించారు.
4 నెలల నుంచి కాలేజీ యాజమాన్యం పోస్ట్‌పోన్ చేస్తున్నారని ఎస్సైకి చెప్పాడు స్టూడెంట్ విజయ్. కాలేజీ యాజమాన్యం సరిగా రియాక్ట్ అవ్వడం లేదని.. ఎన్నిసార్లు వెళ్లినా ఏదో ఒక డేట్ చెప్పి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు ఏదో ఒక అప్డేట్ ఇస్తే ఆందోళన చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పుకొచ్చాడు. తమ పేరెంట్స్ నుంచి ఫోర్స్ ఉందని.. కట్టిన డబ్బులు కూడా అడగొద్దా? అని విజయ్ ప్రశ్నించాడు.
విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారని సికింద్రాబాద్ అల్వాల్‌లోని లయోలా కాలేజీ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఫేక్ ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారని ఫైరవుతున్నారు. డిగ్రీ పూర్తికాక ముందే విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కన్సల్టెన్సీ నుంచి వాట్సాప్ ద్వారా తమకు మొసెజ్‌లు పంపినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఒక్కో విద్యార్థి నుంచి 10 లక్షల రూపాయల చొప్పున తీసుకుని విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని కాలేజీ యాజమాన్యం కన్సల్టెన్సీ అధికారి చెప్పారని విద్యార్థులు తెలిపారు. వారు చెప్పిన విధంగానే మొత్తం ఐదు మంది విద్యార్థులు ఒక్కొక్కరు పది లక్షల రూపాయలను ఇచ్చినట్లు తెలిపారు.
Also Read: రూల్స్ అధిగమిస్తే కష్టాలు తప్పవు.. వాళ్లపై ట్రాఫిక్ పోలీసుల గురి
తీరా నకిలీ విదేశీ ఐడీని సృష్టించి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను అందజేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. గత మూడు నెలల నుంచి ఉద్యోగాల విషయమై కళాశాలకు వచ్చి వెళ్తున్నప్పటికీ తమను పట్టించుకోకుండా తమపైనే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారని కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డబ్బులు తిరిగి ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. తమ డబ్బులు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.