E-Paper
Advertisement

Youtuber Vaishnavi: యూట్యూబర్ వైష్ణవి హత్య అందుకోసమేనా.. విస్తుపోయే నిజాలు!

Youtuber Vaishnavi: యూట్యూబర్ వైష్ణవి హత్య అందుకోసమేనా.. విస్తుపోయే నిజాలు!
Advertisement

Youtuber Vaishnavi:జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకున్న విషాదం యావత్ దేశాన్ని కదిలించింది అనే చెప్పాలి. కారణం యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య. రీల్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని అత్యధిక ఫాలోవర్స్ దక్కించుకున్న యూట్యూబర్ వైష్ణవి ఆమె భర్త చేతుల్లోనే అత్యంత దారుణ హత్యకు గురవడం అందరినీ కలిచివేసింది. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న ఎనిమిది నెలలకే పైగా అప్పటికే నాలుగు నెలల గర్భవతి కూడా.. అలాంటి వైష్ణవిని ఆమె భర్త అత్యంత దారుణంగా హతమార్చడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే వైష్ణవిని హత్య చేయడం వెనుక విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.

భర్త చేతిలోనే అత్యంత దారుణ హత్యకు గురైన వైష్ణవి..

అసలు విషయంలోకి వెళ్తే.. కోరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి వయసు 19 సంవత్సరాలు. ఆమె భర్త హరిబాబు ఆమెను అత్యంత కిరాతకంగా గొంతు నులిమి కత్తితో పొడిచి హత్య చేశాడు. ప్రస్తుతం వైష్ణవి 4 నెలల గర్భవతి కూడా.. ఇక ఈ విషయాన్ని కూడా హరిబాబు పట్టించుకోకుండా ఈ ఘాతుకానికి పాల్పడడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగగా.. మంగళవారం వైష్ణవి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించారు. అర్ధరాత్రి ఓసారి అరుపులు విని అత్తమామలు వెళ్లి చూడగా.. కూతురు, అల్లుడు నిద్రపోతున్నట్లు కనిపించడంతో తిరిగి వారి గదికి వచ్చి నిద్రపోయారు. ఉదయం లేచి చూస్తే కూతురు దారుణ హత్యకు గురైందని తెలిసి వైష్ణవి తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. నమ్మి కూతుర్ని చేతిలో పెడితే ఇంత దారుణం చేశాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ALSO READ:Ustaad Bhagat Singh: ఉస్తాద్ హైలెట్స్.. వీటి కోసమైనా సినిమా చూడాల్సిందే!

నమ్మలేని నిజాలు తెరపైకి..

ఇకపోతే వైష్ణవిని ఇంత దారుణంగా హత్య చేయడానికి కారణం ఆస్తి కోసమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా డీఎస్పీ కూడా మీడియాతో మాట్లాడుతూ.. గత కొంతకాలంగా వరకట్నం కోసం హరిబాబు వైష్ణవిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఈ క్రమంలోనే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. మృతిరాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇకపోతే ఆస్తి కోసమే తాను ప్రేమించి పెళ్లి చేసుకొని గర్భవతిని చేసిన తన భర్త హరిబాబే వైష్ణవిని అత్యంత దారుణంగా హతమార్చినట్లు సమాచారం. హరి బాబే వైష్ణవి ని వెంటపడి వేధించాడు. వైష్ణవి ఒప్పుకోకపోతే విషం కూడా తాగేసాడట. ఇక దాంతో హరిబాబుని ఇచ్చి వైష్ణవికి పెళ్లి చేశారట ఆమె కుటుంబ సభ్యులు. వైష్ణవి వాళ్ళ వంశం మొత్తంలో ఏకైక ఆడ సంతానం. వైష్ణవికి 15 మంది అన్నలు ఉన్నారు. 15 మంది అన్నలకు వైష్ణవి అంటే ప్రాణం అట. అంతమంది అన్నలు ఉండి కూడా వైష్ణవిని కాపాడలేకపోవడం నిజంగా దురదృష్టకరమనే చెప్పాలి. ఏదేమైనా ఆస్తికోసం ఆ వంశ ఏకైక గారాల పట్టి వైష్ణవిని హరిబాబు హత్య చేయడం బాధాకరం అనే చెప్పాలి.

Advertisement

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×